MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • టొమాటోలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలా? ఈ సింపుల్ పని చేయండి చాలు

టొమాటోలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలా? ఈ సింపుల్ పని చేయండి చాలు

మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే టొమాటోలు ఫ్రిజ్ లో పెట్టేస్తారు. కానీ అవి కొద్ది రోజులకే మెత్తబడిపోతుంటాయి. లేదా కుళ్లిపోతుంటాయి. ఇక్కడ మేము చెప్పే సింపుల్ టిప్స్ పాటిస్తే, రెండు మూడు వారాల పాటు టొమాటోలు తాజాగా ఉంటాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 20 2026, 12:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
టమోటోలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Image Credit : pinterest

టమోటోలు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?

ప్రతి ఇంట్లో టోమోటోలు ఉంటాయి. అవి లేనిదే ఏ కూర పూర్తి కాదు. ఇగురు, పులుసు ఎక్కువ కావాలంటే వెంటనే టమోటాలను ముక్కలు కోసి వేసేస్తూ ఉంటారు. రోజూ వండే వంట్లో టొమాటో కచ్చితంగా ఉండాల్సిందే. కూరల నుంచి సలాడ్స్, చట్నీలు, శాండ్‌విచ్‌ల వరకు టొమాటో వాడతాం. ఇది ఫుడ్ టేస్ట్‌ను పెంచుతుంది. కానీ మార్కెట్ నుంచి తెచ్చిన ఎర్రటి టొమాటోలు కొద్ది రోజులకే మెత్తబడి కుళ్లిపోతుంటాయి. వాటిపై నల్ల మచ్చలు వస్తాయి. ఇలా జరగకుండా అవి నెల రోజులూ పాటూ తాజాగా ఉండాలంటే కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టొమాటోలను వెంటనే ఫ్రిజ్ లో వద్దు
Image Credit : stockPhoto

టొమాటోలను వెంటనే ఫ్రిజ్ లో వద్దు

టొమాటోలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, వాటిని తొడిమ ఉన్న భాగం కిందకు పెట్టి నిల్వ చేయాలి. గుండ్రంగా ఉండే భాగం పైకి ఉండాలి. ఇలా చేయడం వల్ల టొమాటోలో ఉండే తేమ బయటకు పోదు. ఫలితంగా అవి తాజాగా ఉంటాయి.

ఒకవేళ టొమాటోలకు తొడిమ లేకపోతే, ఆ ప్రదేశంలో టేప్ అంటించండి. తొడిమ ఉండే భాగం చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని తెరిచి ఉంచితే, తేమ త్వరగా ఆవిరైపోయి టొమాటో ముడతలు పడి మెత్తగా అవుతుంది. కొన్ని రోజుల పాటు టొమాటోలను వాడకపోతే, ఈ సింపుల్ చిట్కా బాగా పనిచేస్తుంది.

చాలామంది టొమాటోలు కొనగానే ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. కానీ అలా చేయకూడదు. ఫ్రిజ్‌లోని చల్లటి ఉష్ణోగ్రత టొమాటో రుచిని, రూపాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల టొమాటోలు మెత్తగా అయిపోతాయి. కొంచెం పచ్చిగా లేదా దోరగా ఉన్న టొమాటోలను వంటగదిలో చల్లని ప్రదేశంలో ఉంచడం మంచిది.

Related Articles

Related image1
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Related image2
మన పూజ గదిలో కనిపించే దేవుళ్లకు ఆ రూపాన్ని ఇచ్చినది ఎవరో తెలుసా?
33
ఒకదానిపై ఒకటి పెట్టకండి
Image Credit : Getty

ఒకదానిపై ఒకటి పెట్టకండి

కొన్న తర్వాత టొమాటోలను ఒకదానిపై ఒకటి గుట్టగా పోయకూడదు. అలా చేయడం వల్ల పైవాటి బరువుకు కింద ఉన్న టొమాటోలు నలిగిపోయి, త్వరగా కుళ్లిపోతాయి. కాబట్టి, వాటిని ఒక బుట్టలో వేయకుండా, వెడల్పాటి ప్లేటులో దూరదూరంగా పరచి పెట్టడం ఉత్తమం.

అరటిపండ్లు, యాపిల్స్, జామపండ్ల వంటి పండ్లతో కలిపి టొమాటోలను ఉంచకూడదు. ఎందుకంటే ఈ పండ్లు 'ఇథిలీన్' అనే వాయువును విడుదల చేస్తాయి. ఇది టొమాటోలు త్వరగా పండిపోయి, మెత్తబడేలా చేస్తుంది. అందుకే టొమాటోలను పండ్ల బుట్టకు దూరంగా, వేరే చోట పెట్టాలి. మార్కెట్లో టొమాటోలు కొనేటప్పుడు తొడిమ ఉన్న, కాస్త గట్టిగా ఉండే వాటిని ఎంచుకోవడం మంచిది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
చీరలపై ఈ పెద్ద చెవిదిద్దులు పెట్టుకుంటే అదిరిపోతుంది
Recommended image2
Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు
Recommended image3
Capital: ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి?
Related Stories
Recommended image1
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Recommended image2
మన పూజ గదిలో కనిపించే దేవుళ్లకు ఆ రూపాన్ని ఇచ్చినది ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved