MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • ఒక్కసారి ఈ గుడికి వెళ్లి పూజ చేస్తే...మీ కారుకు ప్రమాదమే జరగదు, ఈ గుడి ఎక్కడ ఉంది?

ఒక్కసారి ఈ గుడికి వెళ్లి పూజ చేస్తే...మీ కారుకు ప్రమాదమే జరగదు, ఈ గుడి ఎక్కడ ఉంది?

ఇంటి నుంచి బయటకు వెళితే.. క్షేమంగా ఇంటికి వస్తామో లేదో అనే భయం చాలా మందికి ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు రోడ్డు ప్రమాదం జరుగుతుందో అనే భయం ఉంటుంది.కానీ, ఓ గుడికి వెళ్తే రోడ్డు ప్రమాదాలే జరగవని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 24 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Vehicle Temple
Image Credit : gemini ai

Vehicle Temple

కొత్తగా కారు లేదా బైక్ కొన్నారా? జీవితంలో ఎప్పటికీ.. మీ వెహికల్ కి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, మీరు కూడా క్షేమంగా ఉండాలని అనుకుంటున్నారా? అయితే.. కచ్చితంగా ఓ అమ్మవారి గుడికి వెళ్లాల్సిందే. ఈ అమ్మవారి గుడికి ఒక్కసారి వెళ్లి.. మీ వెహికిల్ కి పూజ చేయించి,అక్కడ మీ నెంబర్ ప్లేట్ ని రాస్తే.. జీవితంలో ప్రమాదానికి గురి అవ్వదు. మరి, ఆ గుడి ఎక్కడ ఉంది? ఈ గుడిలో అంత స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏంటి ఈ ఆలయ ప్రత్యేకత..
Image Credit : gemini ai

ఏంటి ఈ ఆలయ ప్రత్యేకత..

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ కొత్త లారీ, కారు లేదా బైక్ వెనుక చూసినా "తలుపులమ్మ తల్లి ఆశీస్సులతో" అని రాసి ఉండటం సాధారణంగా చూస్తూనే ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో వాహన కొనుగోలుదారులు అత్యంత పవిత్రంగా భావించే ఆలయం "తలపులమ్మ లోవ శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం". ఇక్కడికి వచ్చి పూజ చేయిస్తే వాహనానికి, డ్రైవర్‌కు ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగవని భక్తులు గట్టిగా నమ్ముతారు.

కొత్తగా కొన్న వాహనాలను కొండ కిందకు తెచ్చి, అమ్మవారికి ప్రత్యేక వాహన పూజలు జరిపిస్తారు. పూజ పూర్తయ్యాక, వాహనాలు ప్రమాదాలకు గురికాకూడదని, వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకుంటూ భక్తులు అక్కడి గోడలపై లేదా రాళ్లపై తమ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్లను రాస్తుంటారు.నిజానికి ఆలయ నిర్వాహకులు గోడలపై రాయడాన్ని నిషేధించినా, భక్తుల నమ్మకం వల్ల ఇది ఇంకా కొనసాగుతుంది.

Related Articles

Related image1
Pillow: మీ దిండ్లు పసుపు రంగులోకి మారిపోయాయా?రూ.10ఖర్చుతో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు
Related image2
Kids Smart Watch: ఈ ఒక్క వాచ్ చేతికి ఉంటే చాలు, మీ పిల్లలు ఎక్కడున్నా సేఫ్..!
33
తలపులమ్మ తల్లి అనే పేరు ఎలా వచ్చింది?
Image Credit : gemini ai

తలపులమ్మ తల్లి అనే పేరు ఎలా వచ్చింది?

ఆలయ స్థల పురాణం ప్రకారం, పూర్వం అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని చెబుతారు. ఇక్కడి అమ్మవారు స్వయంభూమూర్తి.మనస్సులో ఒక్క చిన్న 'తలపు' (ఆలోచన) వచ్చి అమ్మవారిని తలుచుకుంటే చాలు.. కోరిన కోరికలు తీర్చి, భక్తులను ఆపదలనుంచి కాపాడుతుందని, అందుకే అమ్మవారికి తలపులమ్మ తల్లి (తలుపులమ్మ అమ్మవారు) అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు.

ఈ ఆలయం ఎక్కడ ఉంది? 

ఈ ప్రసిద్ధ క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా, తుని మండలం 'లోవ' గ్రామంలో ఉంది.దారకొండ, తీగకొండ అనే రెండు కొండల మధ్య పచ్చని అటవీ వాతావరణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. జాతీయ రహదారి (NH16) వద్ద తుని - అన్నవరం మధ్యలో ఉండే ఆర్చ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో లోవ క్షేత్రం ఉంటుంది.

ఈ క్షేత్ర ప్రత్యేకత: ఈ ఆలయానికి కొత్త వాహనంపై కుటుంబంతో వచ్చి పూజ చేయించడం, కొండ దిగువన పచ్చని ప్రకృతి ఒడిలో వంటలు చేసుకుని మొక్కులు తీర్చుకోవడం దశాబ్దాలుగా వస్తున్న ఆచారం.

గమనిక: ఆధ్యాత్మిక విశ్వాసాలు భక్తులకు మనోధైర్యాన్ని ఇస్తాయి. అయితే ఏ వాహనానికైనా అసలైన రక్షణ హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం, పరిమిత వేగంతో ట్రాఫిక్ నిబంధనలు పాటించడమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
పసుపును ఇలా వాడారంటే మొక్కలు పచ్చగా, చీడ పీడలు లేకుండా పెరుగుతాయి
Recommended image2
Mangalsutra: డైలీవేర్ కి అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు..!
Recommended image3
Pillow: మీ దిండ్లు పసుపు రంగులోకి మారిపోయాయా?రూ.10ఖర్చుతో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు
Related Stories
Recommended image1
Pillow: మీ దిండ్లు పసుపు రంగులోకి మారిపోయాయా?రూ.10ఖర్చుతో మళ్లీ కొత్తదానిలా మార్చేయచ్చు
Recommended image2
Kids Smart Watch: ఈ ఒక్క వాచ్ చేతికి ఉంటే చాలు, మీ పిల్లలు ఎక్కడున్నా సేఫ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved