MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Clean Greasy Non-Stick Pan: నాన్‌స్టిక్ పాన్ అంచులకు పట్టిన మొండి జిడ్డు పోవడం లేదా? ఇలా చేస్తే ఈజీగా క్లీన్

Clean Greasy Non-Stick Pan: నాన్‌స్టిక్ పాన్ అంచులకు పట్టిన మొండి జిడ్డు పోవడం లేదా? ఇలా చేస్తే ఈజీగా క్లీన్

Clean Greasy Non-Stick Pan: నాన్‌స్టిక్ పాన్‌ను జాగ్రత్తగా వాడినా అంచుల చుట్టూ నూనె మరకలు, జిడ్డు పేరుకుపోతాయి. డిష్‌వాష్ తో కడిగినా జిడ్డు తొలగదు. గట్టిగా రుద్దితే నాన్‌స్టిక్ కోటింగ్ పోతుంది. అయితే కిచెన్‌లో దొరికే వస్తువులతో ఈజీగా క్లీన్ చేయొచ్చు.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 16 2026, 02:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నాన్ స్టిక్ పాన్ జిడ్డు పోవడం లేదా?
Image Credit : gemini ai

నాన్ స్టిక్ పాన్ జిడ్డు పోవడం లేదా?

నాన్‌స్టిక్ పాన్‌ను ఎంత జాగ్రత్తగా వాడినా వంట చేసిన తర్వాత అంచుల చుట్టూ నూనె, మరకలు, జిడ్డు పేరుకుపోతుంటాయి. సాధారణంగా డిష్‌వాష్ లిక్విడ్‌తో కడిగినా ఈ మొండి జిడ్డు తొలగదు. గట్టిగా రుద్దితే నాన్‌స్టిక్ కోటింగ్ పోతుంది. అందుకే కిచెన్‌లో దొరికే వస్తువులతోనే జిడ్డు క్లీన్ చేయొచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముందుగా గోరువెచ్చని నీటితో..
Image Credit : gemini ai

ముందుగా గోరువెచ్చని నీటితో..

పాన్‌ను శుభ్రం చేసే ముందు అది పూర్తిగా చల్లారే వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత పాన్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో కొద్దిగా మైల్డ్ డిష్‌వాష్ లిక్విడ్ వేయాలి. మెత్తని స్పాంజ్ లేదా క్లాత్‌ను ఈ నీటిలో ముంచి పాన్ అంచుల చుట్టూ ఉన్న జిడ్డును మెల్లగా తుడవాలి.

జిడ్డు మరీ గట్టిగా పేరుకుపోయి ఉంటే.. పాన్‌ను 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ నీటిలో నానబెట్టవచ్చు. దీంతో అంచులకు అంటుకున్న జిడ్డు మెత్తబడుతుంది. ఆ తర్వాత మెత్తని స్పాంజ్‌తో తేలికగా తుడిస్తే సులభంగా తొలగిపోతుంది.

35
బేకింగ్ సోడాతో జాగ్రత్తగా..
Image Credit : Getty

బేకింగ్ సోడాతో జాగ్రత్తగా..

గోరువెచ్చని నీటితో కడిగిన తర్వాత కూడా జిడ్డు అలాగే ఉంటే.. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని అందులో నీళ్లు కలిపి పలుచని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జిడ్డు ఉన్న ప్రాంతంలో మాత్రమే అప్లై చేసి కొన్ని నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మెత్తని స్పాంజ్ లేదా క్లాత్‌తో సున్నితంగా తుడవాలి. అయితే బేకింగ్ సోడాను వేసి గట్టిగా రుద్దకూడదు. ఎక్కువ ఒత్తిడితో స్క్రబ్ చేయడం వల్ల నాన్‌స్టిక్ కోటింగ్‌పై గీతలు పడే అవకాశం ఉంటుంది.

45
వెనిగర్‌తో జిడ్డు మరకలు..
Image Credit : Getty

వెనిగర్‌తో జిడ్డు మరకలు..

అంచుల దగ్గర జిగటగా ఉన్న ఫుడ్ తీసేయడానికి వైట్ వెనిగర్ కూడా వాడొచ్చు. సమానంగా వైట్ వెనిగర్, నీటిని కలిపి.. అందులో మెత్తని క్లాత్‌ను ముంచి పాన్ అంచులను తుడవాలి. అయితే వెనిగర్‌ను పాన్‌పై ఎక్కువసేపు అలాగే ఉంచకూడదు. తుడిచిన తర్వాత మైల్డ్ డిష్‌వాష్ లిక్విడ్‌తో పాన్‌ను మరోసారి శుభ్రంగా కడుక్కోవాలి.

55
స్టీల్ స్క్రబ్బర్ మాత్రం వద్దు..
Image Credit : gemini ai

స్టీల్ స్క్రబ్బర్ మాత్రం వద్దు..

జిడ్డు ఎంత గట్టిగా ఉన్నా స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్దడం మంచిది కాదు. అలాగే చాలా గట్టిగా ఉండే క్లీనింగ్ ప్యాడ్స్, అబ్రేసివ్ పౌడర్లను కూడా ఉపయోగించకూడదు. ఇవి నాన్‌స్టిక్ కోటింగ్‌ను గీసే అవకాశం ఉంటుంది. మెత్తని స్పాంజ్, మైక్రోఫైబర్ క్లాత్ లేదా సాఫ్ట్ బ్రష్‌తోనే శుభ్రం చేయడం మంచిది.

చివర్లో ఇలా చేయండి..

జిడ్డు పూర్తిగా తొలగిన తర్వాత పాన్‌ను శుభ్రమైన నీటితో బాగా కడిగి.. పొడి కిచెన్ టవల్‌తో తుడవాలి. ముఖ్యంగా పాన్ అంచులు, రిమ్ దగ్గర నీరు లేదా ఫుడ్ మిగలకుండా చూసుకోవాలి. వంట చేసిన వెంటనే పాన్‌ను శుభ్రం చేస్తే జిడ్డు మందపాటి పొరగా పేరుకుపోకుండా ఉంటుంది. నాన్‌స్టిక్ పాన్‌ను గట్టిగా రుద్దకుండా.. గోరువెచ్చని నీరు, మైల్డ్ సోప్, మెత్తని క్లాత్‌తో క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే ఎక్కువకాలం మంచి కండిషన్‌లో ఉంచుకోవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd: పెరుగు పులియకుండా 3 రోజులు తాజాగా ఉంచడం ఎలా?
Recommended image2
Tablet: ట్యాబ్లెట్ వేసుకొనేటప్పుడు ఎన్ని నీళ్లు తాగాలి? ఈ తప్పులు మాత్రం చేయకండి..!
Recommended image3
Black Beads Chain: 3 గ్రాముల బంగారంలో వచ్చే నల్లపూసల చైన్స్.. ఇవిగో!
Related Stories
Recommended image1
Gold Price Hike: బంగారం ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులు...మళ్లీ షాకిచ్చిన పసిడి
Recommended image2
Kitchen Hack: వంట చేసేటప్పుడు ఈ 10 తప్పులు చేస్తున్నారా? అయితే ఇప్పుడే ఆపేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved