Recipes: నోరూరించే క్యాబేజీ వడ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!
Recipes: చాలామంది క్యాబేజీలతో కూర, పప్పు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడు అదే వెరైటీ అంటే పిల్లలు బోర్ ఫీల్ అవుతారు అందుకే ఈసారి వడలు చేద్దాం. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.

క్యాబేజీ వడలు ఇవి పొద్దున బ్రేక్ ఫాస్ట్ గాను బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ గాను బాగుంటాయి. పైగా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. క్యాబేజీ లో ఉండే డైటరీ ఫైబర్, కాల్షియం మెగ్నీషియం పొటాషియం విటమిన్ సి, థియామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పోషకాలు పిల్లలకి ఎంతో అవసరం కూడా..
అలాగే క్యాబేజీ తినటం ద్వారా అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు. దీనికి నూనె కూడా చాలా తక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 1/2 కేజీ క్యాబేజీ, అర కప్పు మినప్పప్పు, అర కప్పు శనగపప్పు,
అర స్పూను నల్ల మిరియాలు, అర స్పూను సోపు, అర స్పూను జీలకర్ర, చిన్న అల్లం ముక్క, రెండు పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్టు, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర. ఉప్పు రుచికి తగినంత. ముందుగా మినప్పప్పుని శనగపప్పుని శుభ్రం చేసి నాలుగైదు గంటలు నీటిలో నానబెట్టండి.
ఇప్పుడు నానబెట్టిన పప్పులని ఒక మిక్సీలో తీసుకొని అందులో నల్ల మిరియాలు సోపు జీలకర్ర వేసి ముద్దగా రుబ్బుకోండి. ఇప్పుడు దీనిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అందులో తరిగిన క్యాబేజీ అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు, కొత్తిమీర కలుపుకోండి.
మామూలుగా మనం వడలు చేసుకున్నట్లుగానే వీటిని కూడా చేతి మీద అద్దుతూ మరి పల్చగాను కాకుండా మరి లావుగాను కాకుండా నూనెలో వేయించుకోండి. నూనె ఆరోగ్యానికి మంచిది కాదు అనుకున్న వాళ్లు పెనం మీద కూడా కాల్చుకోవచ్చు.
ఇంకేముంది టేస్టీ టేస్టీ క్యాబేజీ వడ రెడీ. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే కరకరలాడుతాయి లేదంటే కొంచెం మెత్తబడతాయి. ఇది ఉత్తినోటి నే తినేయవచ్చు లేదంటే సాస్ లో డిప్ చేసి తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది.