MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Homemaking Tips: ఇంటి పనులు చిటికెలో అయిపోవాలా? మీ టైం సేవ్ చేసే టిప్స్ ఇవిగో!

Homemaking Tips: ఇంటి పనులు చిటికెలో అయిపోవాలా? మీ టైం సేవ్ చేసే టిప్స్ ఇవిగో!

Homemaking Tips: ఇంటి పనులతో రోజంతా బిజీగా ఉంటున్నారా? ఇకపై ఎక్కువ టైం, శ్రమ అవసరం లేదు. మీ రోజువారీ ఇంటి పనులను ఈజీగా, త్వరగా పూర్తి చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని సింపుల్ టైమ్ సేవింగ్ టిప్స్ మీకోసం. ఇవి పాటిస్తే మీ పని త్వరగా పూర్తవుతుంది.

3 Min read
Author : Kavitha G
Published : Sep 10 2026, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఇంటి పనుల కోసం సింపుల్ టిప్స్
Image Credit : chat GPT

ఇంటి పనుల కోసం సింపుల్ టిప్స్

ఇంటి పనులకు అంతూ పొంతూ ఉండదు. వంట, గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఇల్లు ఊడవడం.. ఇలా లిస్ట్ పెరుగుతూనే ఉంటుంది. అందుకే, రోజూ కచ్చితంగా చేయాల్సిన 3 ముఖ్యమైన పనులను ముందుగా ఎంచుకోవాలి. వంట, గిన్నెలు కడగడం, ఇల్లు శుభ్రం చేయడం వంటి వాటిలో మీ కుటుంబానికి ఏది అవసరమో దానికి ఫస్ట్ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి పనినీ పర్ఫెక్ట్‌గా చేయాలనే ఆలోచనను కాస్త పక్కన పెట్టాలి. రోజూవారీ పనుల విషయంలో 'పరవాలేదు, బాగానే ఉంది' అనుకుంటే చాలా టైమ్ సేవ్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఇల్లంతా రోజూ తుడవాలా?
Image Credit : Asianet News

ఇల్లంతా రోజూ తుడవాలా?

ఇల్లంతా రోజూ నీళ్లు పెట్టి తుడవడం వల్ల ఎక్కువ సమయం, శ్రమ తప్పదు. దానికి బదులుగా, రోజూ ముందుగా ఇల్లు ఊడ్చి లేదా వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసి, మురికి ఎక్కువగా ఉన్న చోట మాత్రమే తుడవండి. ముఖ్యంగా వంటగది దగ్గర, ఇంటి గుమ్మం దగ్గర మురికి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశాలపై ఎక్కువ దృష్టి పెడితే సరిపోతుంది. దీనివల్ల ఇల్లు శుభ్రంగా కనిపించడమే కాకుండా, రోజూ ఇల్లంతా తుడిచే సమయం కూడా తగ్గుతుంది.

Related Articles

Related image1
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Related image2
Instant Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో ఇడ్లీ రెడీ!
37
ఉదయాన్నే వంట చేయడం
Image Credit : Gemini AI

ఉదయాన్నే వంట చేయడం

వంట కోసం మళ్లీ మళ్లీ కిచెన్‌లోకి వెళ్లడం వల్ల టైమ్ వేస్ట్ అవుతుంది. వీలైతే, ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కు కావాల్సిన కొన్ని పనులను ఒకేసారి చేసి పెట్టుకోండి. ఉదయం పూట ఓ 15 నుంచి 30 నిమిషాలు అదనంగా కేటాయిస్తే, సాయంత్రం మళ్లీ ఎక్కువసేపు వంటగదిలో నిలబడాల్సిన అవసరం ఉండదు. వంట పూర్తయ్యాక గిన్నెలను పోగుపెట్టకుండా, ఎప్పటికప్పుడు కడిగేస్తే ఆ తర్వాత పెద్ద పనిలా అనిపించదు.

47
వంటగది క్లీనింగ్
Image Credit : our own

వంటగది క్లీనింగ్

వంట పూర్తయిన వెంటనే కిచెన్‌ను పూర్తిగా రుద్ది రుద్ది శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు వంట తర్వాత కౌంటర్‌టాప్, స్టవ్, ఎక్కువగా మురికి అయిన ప్రాంతాలను మాత్రమే వెంటనే తుడిచేయండి. డీప్ క్లీనింగ్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు పెట్టుకోవచ్చు. అలాగే, వంటగదిలో వాడే క్లాత్ కూడా చాలా ముఖ్యం. మురికి క్లాత్ తో తుడిస్తే, ఆ మురికి ఒకచోట నుంచి మరోచోటకు పాకుతుంది. కాబట్టి, కిచెన్ కౌంటర్‌టాప్, స్టవ్ తుడవడానికి శుభ్రమైన క్లాత్ వాడండి. ఆ క్లాత్‌ను కూడా బాగా ఉతికి ఆరబెట్టి, కొన్ని రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి.

57
ఇంట్లోని వస్తువులను..
Image Credit : chatgpt

ఇంట్లోని వస్తువులను..

ఇంట్లో వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్లే, తర్వాత శుభ్రం చేయడం పెద్ద పనిగా మారుతుంది. సోఫా, డైనింగ్ టేబుల్, బెడ్ లేదా కిచెన్ కౌంటర్‌టాప్.. ఎక్కడైనా సరే, వస్తువును వాడిన వెంటనే తిరిగి దాని స్థానంలో పెట్టే అలవాటును ఇంట్లో అందరూ పాటించాలి. దీనికోసం రోజూ ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన పనిలేదు. ఒక వస్తువును తీసుకెళ్తున్నప్పుడే, దారిలో ఉన్న మరో వస్తువును కూడా దాని ప్లేస్‌లో పెట్టేస్తే, ఇల్లు చిందరవందర కాకుండా ఉంటుంది.

67
రాత్రిపూట ఈ పనులు చేస్తే..
Image Credit : Getty

రాత్రిపూట ఈ పనులు చేస్తే..

ఉదయం లేవగానే ఇంటి పనులు కొండలా పేరుకుపోకుండా ఉండాలంటే, రాత్రిపూట కొన్ని నిమిషాలు కేటాయిస్తే చాలు. గిన్నెలు కడిగి పెట్టుకోవడం, కిచెన్ కౌంటర్‌టాప్ తుడవడం, సింక్‌ను శుభ్రంగా ఉంచడం, బయట పడి ఉన్న వస్తువులను వాటి స్థానాల్లో పెట్టడం వంటివి పూర్తి చేయండి. ఉదయం లేవగానే శుభ్రమైన వంటగది, కాస్త సర్ది ఉన్న ఇల్లు కనిపిస్తే, ఉదయం పనులు కూడా వేగంగా మొదలవుతాయి. అలాగే, ఇంట్లో పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు వారి వయసుకు తగిన చిన్న పనులను అప్పగించండి.

77
ఆదివారం నాడు..
Image Credit : Freepik

ఆదివారం నాడు..

మిగతా రోజుల్లో చేసే పనులకు అదనంగా, ఆదివారం నాడు పెద్ద పెద్ద పనులన్నీ పెట్టుకుంటే ఇక రెస్ట్ తీసుకునే టైమే ఉండదు. దానికి బదులుగా, వారంలో చేయాల్సిన పనులను ముందుగానే ఒక చిన్న లిస్ట్ రాసుకోండి. ఏ రోజు బట్టలు ఉతకాలి, ఎప్పుడు డీప్ క్లీనింగ్ చేయాలి, ఎప్పుడు వస్తువులు సర్దాలి అని ప్లాన్ చేసుకుంటే, ఒకే రోజు అన్ని పనులు చేయాల్సిన ఒత్తిడి ఉండదు. ఇంటి పనులను నూటికి నూరు శాతం పూర్తి చేయడమే లక్ష్యం కాదు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఇంటిని నీట్‌గా ఉంచుకోవడమే ముఖ్యం.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Recommended image2
Hair Care: కోడిగుడ్డులో ఇవి కలిపి రాస్తే.. జుట్టు పట్టుకుచ్చులా, సిల్కీగా మారడం పక్కా..!
Recommended image3
Sarees: ఈ చీరలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి.. అదిరిపోయే డిజైన్స్!
Related Stories
Recommended image1
Parenting: మీ పిల్లలకు ఈ అలవాటు ఉందా? అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Recommended image2
Instant Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో ఇడ్లీ రెడీ!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved