- Home
- Life
- Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Coriander Water: పొడవాటి, ఒత్తైన జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. అయితే, దాని కోసం ఖరీదైన షాంపూలు, నూనెలు వాడాల్సిన అవసరం లేకుండా.. మన వంటింట్లో ఈజీగా దొరికే ధనియాలు వాడితే సరిపోతుంది. ఈ ధనియాల నీటితో జుట్టు వేగంగా పెంచుకోవచ్చు.

Hair Growth
ప్రతి ఒక్కరి ఇంట్లో కిచెన్ లో ధనియాలు ఉంటూనే ఉంటాయి. వీటిని పలు రకాల వంటల్లో వాడుతూ ఉంటాం. అయితే.. ఈ ధనియాలు.. మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా సహాయపడతాయి. ఎందుకంటే, ధనియాల్లో విటమిన్ ఎ, సి, కె తో పాటు ఐరన్, కాపర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
జుట్టు పెరుగుదలకు ధనియాల నీరు ఎలా సహాయపడుతుంది..
ధనియాల నీరు తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. ధనియాలలో ఉండే కొన్ని పోషకాలు రక్త ప్రసరణను పెంచుతాయి. దీని వల్ల.. జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి. దీని వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాదు, ఈ నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించి, జుట్టు చిట్లిపోకుండా, చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా కాపాడుతుంది. ధనియాలలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్లు, దురద, చుండ్రు సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడతాయి. అంతేకాదు, రెగ్యులర్ గా ఈ నీటిని వాడటం వల్ల... జుట్టు కుదుళ్లు బలపడటమే కాకుండా, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.
ఈ ధనియాల నీటిని ఎలా తయారు చేసుకోవాలి?
రెండు చెంచాల ధనియాల విత్తనాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని సన్నని మంటపై 5 నుండి 10 నిమిషాల పాటు మరిగించాలి. నీరు చల్లారిన తర్వాత దానిని వడకట్టి, ఒక స్ప్రే సీసాలోకి తీసుకోవాలి.
ఉపయోగించే విధానం:
హెయిర్ రిన్స్ : షాంపూతో తలస్నానం చేసిన తర్వాత, చివరిగా ఈ ధనియాల నీటితో మాడును, జుట్టును కడిగి 10-15 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత సాధారణ నీటితో తడిపి వదిలేయవచ్చు.
స్ప్రే : స్ప్రే సీసా సహాయంతో జుట్టు కుదుళ్లకు నేరుగా స్ప్రే చేసి, వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు. వారంలో 2 నుండి 3 సార్లు ఈ విధంగా చేయవచ్చు.
ఇది నిజంగా పనిచేస్తుందా? ధనియాల నీరు జుట్టు ఆరోగ్యానికి తోడ్పడుతుందనడంలో సందేహం లేదు, కానీ ఇది అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. కానీ, దీనిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టుకు బాహ్య పోషణను అందిస్తాయి.
అయితే.. నాలుగు రోజులు నీటిని వాడి జుట్టు పెరగలేదు అని మాత్రం అనుకోవద్దు. రెగ్యులర్ గా ఫాలో అయితే అనుకున్న ఫలితాలు వస్తాయి. జన్యుపరమైన జుట్టు రాలే సమస్యలు , హార్మోన్ల అసమతుల్యత లేదా తీవ్రమైన విటమిన్ లోపాలు ఉన్నప్పుడు కేవలం ఈ నీరు మాత్రమే సరిపోదు. ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.

