MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • డీహైడ్రేషన్ తో ప్రాణం పోవచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే సేఫ్..

డీహైడ్రేషన్ తో ప్రాణం పోవచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే సేఫ్..

Dehydration Symptoms: ఒంట్లో నీటి శాతం తగ్గితే.. డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదముంది. ఈ డీహైడ్రేషన్ కారణంగా ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ ఎండలకు డీ హైడ్రేషన్ బారిన పడకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 20 2022, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Dehydration

Dehydration

Dehydration Symptoms: ఎండాకాలం స్టార్టింగో లోనే ఎండలు ఇంత దారుణంగా దంచికొడితే.. ఇక రానురాను పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఉదయం 11 దాటితే చాలు బయటకు అడుగు పెట్టడానికి జనాలు జంకుతున్నారు. ఈ ఎండలు మార్చి ప్రారంభం నుంచే మరింత ఎక్కువయ్యాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో జనాలు ఎక్కువగా డీహైడ్రేషన్ సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తోంది. మన బాడీలో తగినంత నీటిశాతం లేకపోతే కూడా ఈ సమస్య బారిన పడతామని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని టిప్స్ తో ఎండాకాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. అవేంటో చూద్దాం  పదండి. 

36

డీ హైడ్రేషన్ లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎండాకాలంలో మన శరీరం నుంచి నీళ్లు ఎక్కువగా మూత్రం, చెమట రూపంలో బయటకు పోతూ ఉంటుంది. దీనివల్ల మన శరీరానికి నీటి కొరత ఏర్పడుతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోతే బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది.  కాబట్టి ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. 

46

డీహైడ్రేషన్ తో ప్రాణం కూడా పోవచ్చు.. శరీరంలో నీటి శాతం తగ్గితే.. డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఒంట్లో పూర్తిగా నీటి నిల్వలు తగ్గితే.. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ వడదెబ్బతో ఒక్కో సారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ ఎండాకాలం నీటిని ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండాలి. డీహైడ్రేషన్ బారిన పడితే.. తలనొప్పి, తలతిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

56

నీళ్లను తాగుతూ ఉండాలి..  ఎండాకాలం నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఒకవేళ ఒంట్లో నీటిశాతం తగ్గితే చర్మం డ్రైగా మారుతుంది. అలాగే పెదవులు పొడి బారి పగుళ్లు వస్తాయి. ఈ ఎండాకాలం ప్రతి నాలుగు గంటలకోసారి మూత్ర విసర్జన చేయాలి. ఇలా చేయకపోతే వారు డీహైడ్రేషన్ కు గురయ్యారని అర్థం చేసుకోవాలి. పురుషులు రోజుకు 3 లీటర్ల నీటిని తాగితే.. ఆడవారు 2.5 లీటర్ల నీళ్లను ఖచ్చితంగా తాగాలి. 
 

66

డీహైడ్రేషన్ కు చికిత్స: ఎండాకాలం డీహైడ్రషన్ బారిన ఎక్కువగా పడే ప్రమాదముంది. డీహైడ్రేషన్ బారిన పడే వ్యక్తికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగను తాపుతూ ఉండాలి. ముఖ్యంగా వీరిని చల్లగా ఉండే ప్లేస్ లోనే ఉంచాలి. ఒకవేల వీరు జిమ్ లో వ్యాయామాలు చేసేవారైతే.. ప్రతి 20 నిమిషాలకోసారి ద్రవపదార్థాలను ఖచ్చితంగా తాగుతూ ఉండాలి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Money Plant: ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా డబ్బు నిలవట్లేదా? ఇదే కారణం
Recommended image2
Prawns Recipe: ఆంధ్రా స్టైల్లో గోంగూర రొయ్యల ఇగురు.. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అదిరిపోతుంది
Recommended image3
Leftover Cool Drinks Uses: మిగిలిపోయిన కూల్ డ్రింక్స్ పారబోస్తున్నారా? ఈ క్రేజీ హ్యాక్స్ తెలిస్తే అస్సలు వదలరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved