Anti-Aging Foods: ఈ ఆహారాలు మిమ్మల్ని నిత్య యవ్వనంగా ఉంచుతాయి..
Anti-Aging Foods: చర్మానికి లోపలి నుంచి పోషణ అందినప్పుడే మాత్రమే చర్మం అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.

చర్మం, అందంగా కాంతివంతంగా కనిపించేలా చేయడానికి కెమికల్స్ మిక్స్ చేసిన క్రీములు ఏ మాత్రం సహాయపడవు. నిజానికి చాలా మంది చర్మం మెరిసిపోవాలని రకరకాల క్రీములను వాడుతూ ఉంటారు. వాటివల్ల చర్మం మరింత దెబ్బతినడమే కాకుండా.. ముఖంపై ముడతలు, మచ్చలు ఏర్పడటానికి కారణమవుతాయి. చర్మం కాంతివంతంగా తయారవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడమే. అవును లోపలి నుంచి పోషణ లభించినప్పుడే చర్మం గ్లో గా, ఆకర్షణగా మారుతుంది. ఇందుకోసం మీరు మంచి పోషకాలుండే ఆహారాలను తీసుకోవాలి.
మనం తీసుకునే ఆహార పదార్థాలకు, చర్మానికి సంబంధం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మంచి పోషకాహారాన్ని తింటేనే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. లేదంటే మీరెన్ని ప్రొడక్ట్స్ వాడినా ఫలితమే ఉండదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ ను, స్మోకింగ్ చేసే అలవాట్లను పూర్తిగా మానుకోవాలి. ఇవి చర్మ కణాలకు పోషకాల ప్రవాహాన్ని, ఆక్సిజన్ సరఫరాను పరిమితం చేస్తాయి. ముఖ్యంగా ముఖంపై ముడతలు, ఇతర వృద్ధాప్య లక్షణాలను కారణమవుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు ఇతర వృద్ధాప్య లక్షణాలను నెమ్మదింపజేస్తాయి. ఆయుష్షును కూడా పెంచుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్ ను తినడం పూర్తిగా మానుకోవాలి. ఇది ముఖంపై ముడతలను చాలా తర్వగా రప్పిస్తుంది.
గుడ్లు, గింజలు, గోధుమలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, బ్రౌన్ రైస్ ను ఎక్కువగా తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. పోషకాహార నిపుణుడు లవ్నీత్ బాత్రా ఇన్ స్టాగ్రామ్ వేదికగా చర్మాన్ని యవ్వనంగా ఉంచే ఆహారాల గురించి వివరించారు. ఆయన ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు మనల్ని నిత్య యవ్వనంగా ఉంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Turmeric
పసుపు (Turmeric)
పసుపులో యాంటీ ఆన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం చర్మాన్ని రక్షిస్తుంది. చర్మంపై ఉండే ముడతలను కూడా తొలగిస్తుంది.
దానిమ్మ (Pomegranate)
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫోలిక్ యాసిడ్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి. అలాగే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలను, పగుళ్లను నయం చేస్తాయి.
గ్రీన్ టీ (Green tea)
గ్రీన్ టీలో విటమిన్ ఇ, విటమిన్ బి2 పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కొల్లాజెన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడటమే కాకుండా.. కొత్త చర్మకణాల పెరుగుదలకు తోడ్పడుతాయి. అలాగే చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.