MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Health
  • యోని ఉత్సర్గ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

యోని ఉత్సర్గ గురించి ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు

యోని ఉత్సర్గ యోనిని ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ ఈ ఉత్సర్గలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. వీటిని గమనించకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 11 2023, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యోని ఉత్సర్గ ఒక సాధారణ విషయం. కానీ ఇది మహిళల ఆరోగ్యం, ఏదైనా అంతర్లీన అనారోగ్య సమస్యల గురించి సూచించే ముఖ్యమైన అంశం. యోని ఉత్సర్గ చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. కానీ ఇది మీ శరీరం సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవాలి. పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు యోని ఉత్సర్గ ఎంతో సహాయపడుతుంది. దీని రంగు, వాసన, స్థిరత్వం యోని ఉత్సర్గ సాధారణమైనదా లేదా అసాధారణమైనదా అని చెబుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే యోని ఉత్సర్గ గురించి కొన్ని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సాధారణ యోని ఉత్సర్గ

యోని ఉత్సర్గను చూసినప్పుడు చాలా మంది మహిళలు ఆందోళన చెందుతుంటారు. ఎందుకంటే ఇది సంక్రమణ లేదా ఇతర సమస్యల వల్ల వస్తుందని. యోని ఉత్సర్గ పునరుత్పత్తి వ్యవస్థ సహజ లక్షణం. యోని తనను తానే స్వయంగా శుభ్రపరుచుకునే అవయవం. కాబట్టి ఉత్సర్గ దానిని కందెనగా, శుభ్రంగా ఉంచుతుంది. యోనిని శుభ్రంగా ఉంచుతుంది. ఇది లూబ్రికేట్ గా కూడా పనిచేస్తుంది. అలాగే అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాబట్టి యోని ఉత్సర్గ తెల్లగా, స్పష్టంగా లేదా కొద్దిగా ఆఫ్-వైట్ రంగులో ఉండటం సాధారణం, మంచిది. సాధారణ యోని ఉత్సర్గ మందం లేదా స్థిరత్వం రుతుచక్రం, గర్భం, అండోత్సర్గము, లైంగిక ఉద్దీపన సమయంలో మారుతుంది.
 

36

అసాధారణ ఉత్సర్గ 

యోని ఉత్సర్గ సాధారణం అయితే ఎలాంటి సమస్యా రాదు. కానీ ఇది అంతర్లీన సమస్యను కూడా సూచిస్తుంది. మీ ఉత్సర్గ రంగు, స్థిరత్వం, వాసన లేదా పరిమాణంలో ఏవైనా మార్పులు ఉంటే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బాక్టీరియల్ వాగినోసిస్ వంటి ఇన్ఫెక్షన్ అసాధారణ ఉత్సర్గకు దారితీస్తుంది. ఇది ఎస్టీఐలు  అంటే లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, లేదా గర్భాశయ లేదా గర్భాశయ సమస్యలతో సహా ఇతర అనారోగ్యాలకు కూడా సంకేతం కావొచ్చు. యోని ఉత్సర్గలో మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా హాస్పటల్ కు వెళ్లి చెకప్ లు చేయించుకోండి.
 

46

యోని ఉత్సర్గ రంగు, వాసన

యోని ఉత్సర్గ రంగు, వాసన కూడా ఎన్నో సమస్యల గురించి వెళ్లడిస్తాయి. సాధారణ ఉత్సర్గ సాధారణంగా స్పష్టంగా లేదా తెల్లగా ఉంటుంది. కొద్దిగా మాత్రమే వాసన వస్తుంది. ఆకుపచ్చ, పసుపు లేదా బూడిద వంటి ఉత్సర్గ రంగు ఉంటే మంచిది కాదు. లేదా మీ ఉత్సర్గ బలమైన, దుర్వాసన వాసన  వస్తే అది సంక్రమణను సంకేతం. బాక్టీరియల్ వాగినోసిస్ లేదా ట్రైకోమోనియాసిస్ వంటి అంటువ్యాధుల వల్ల ఉత్సర్గలో ఇలాంటి మార్పులు వస్తాయి. ఇలాంటి సమస్యలు కనిపిస్తే లైట్ తీసుకోకుండా హాస్పటల్ కు వెళ్లండి.

56

సాధారణ, అసాధారణ ఉత్సర్గ మధ్య వ్యత్యాసం

సాధారణ, అసాధారణ యోని ఉత్సర్గ మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం చాలా కష్టం. సాధారణ ఉత్సర్గ సాధారణంగా తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది లేదా వాసన లేకుండా కూడా ఉంటుంది. అయినప్పటికీ అసాధారణ ఉత్సర్గ ఘాటైన, చెడు వాసనను కలిగి ఉంటుంది. అసాధారణ ఉత్సర్గ పసుపు, ఆకుపచ్చ, బూడిద  రంగులో కనిపిస్తుంది. సాధారణ ఉత్సర్గ స్పష్టంగా లేదా తెల్లగా ఉంటుంది. అసాధారణ ఉత్సర్గ మూత్రవిసర్జన లేదా లైంగిక చర్య సమయంలో దురద, మంట లేదా నొప్పి వస్తుంది. 

66

మంచి పరిశుభ్రత, ఆరోగ్యకరమైన అలవాట్లు 

యోని ఆరోగ్యానికి మంచి పరిశుభ్రతను, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం చాలా ముఖ్యం. రసాయన సబ్బులు, డౌచ్లు, సువాసనగల వస్తువులను యోనికి ప్రాంతంలో పెట్టకూడదు. ఎందుకంటే ఇవి యోని పీహెచ్ ను దెబ్బతీస్తాయి. లేదా చికాకు లేదా సంక్రమణకు కారణమవుతాయి. అందుకే అక్కడ శుభ్రం చేయడానికి తేలికపాటి, సువాసన లేని సబ్బు, వెచ్చని నీటిని ఉపయోగించండి. గాలి ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి, తేమను తగ్గించడానికి శ్వాసించదగిన లోదుస్తులనే వేసుకోండి. అలాగే బిగుతుగా ఉండే దుస్తులను వేసుకోకండి. ముఖ్యంగా సురక్షితమైన సెక్స్ లోనే పాల్గొనండి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved