MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Facts : విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారు?

Facts : విమానాలకు తెలుపు రంగే ఎందుకు వేస్తారు?

ప్రపంచవ్యాప్తంగా చాలా విమానాలు తెలుపు రంగులోనే ఉంటాయి. వేరే రంగులు కాకుండా కేవలం తెలుపు రంగులోనే విమానాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 17 2026, 09:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విమానాలు ఎక్కువగా తెల్లగా ఎందుకుంటాయి?
Image Credit : Getty

విమానాలు ఎక్కువగా తెల్లగా ఎందుకుంటాయి?

ఎక్కువశాతం విమానయాన సంస్థలు తమ విమానాలను తెలుపు రంగులోనే ఉంచుతాయి. కేవలం ఆకర్షనీయంగా కనిపించడం కోసమే తెలుపు రంగులో ఉండవు... దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్, భద్రతా కారణాలు విమానాల రంగు విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెలుపు రంగుతో ఇంధనం ఆదా...
Image Credit : X

తెలుపు రంగుతో ఇంధనం ఆదా...

విమానాలకు తెలుపు రంగు ఉండటం వల్ల, దానిపై పడే సూర్యకిరణాలు రిఫ్లెక్ట్ అవుతాయి. తెలుపు రంగు సూర్యకిరణాలను ఎక్కువగా గ్రహించదు. దీంతో విమానం లోపల ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది.

విమానం ఆకాశంలో ఎగిరేటప్పుడు సూర్యరశ్మి వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే తెలుపు రంగు వల్ల విమానం లోపల వేడి తగ్గి, ఏసీ సిస్టమ్‌పై భారం తగ్గుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది. విమానయాన సంస్థలకు ఇది మంచి లాభం తెచ్చిపెట్టే ట్రిక్ అన్నమాట.

భద్రతా కారణాలు..

భద్రత విషయంలో కూడా తెలుపు రంగే ఉత్తమమని చెప్పొచ్చు. ఎందుకంటే విమానం తెలుపు రంగులో ఉంటే, దానిపై ఏర్పడిన పగుళ్లు, తుప్పు లేదా ఆయిల్ లీక్‌లను సులభంగా గుర్తించవచ్చు. వేరే రంగులు వేస్తే ఇవి అంత స్పష్టంగా కనిపించవు. అందుకే భద్రతా కారణాల వల్ల కూడా విమానానికి తెలుపు రంగును ఎంచుకుంటారు.

విమానాలు సహజంగానే చాలా బరువుగా ఉంటాయి. ముదురు రంగులు వేయడం వల్ల విమానం బరువు మరింత పెరుగుతుంది. అందుకే తక్కువ పిగ్మెంట్ ఉండే తెలుపు రంగును వాడటం వల్ల బరువు తగ్గుతుంది. ఇది కూడా ఇంధనాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది.

 

Related Articles

Related image1
Facts : కుక్కలు కంటిచూపుతో కాదు వాసనతో మనుషులను గుర్తుపడతాయి.. ఇది ఎలా సాధ్యమో తెలుసా?
Related image2
Interesting Facts : ఆవులు, బర్రెలు తల తిప్పకుండానే వెనక్కి చూస్తాయా..! ఇది ఎలా సాధ్యమో తెలుసా?
34
విమానాలకు తెలుపు రంగు వెనక మరిన్ని కారణాలు..
Image Credit : X

విమానాలకు తెలుపు రంగు వెనక మరిన్ని కారణాలు..

  • తెలుపు రంగు విమానాలను అమ్మేటప్పుడు మంచి రీసేల్ విలువ వస్తుంది.
  • విమానం బరువు ఒక కిలో తగ్గినా, ఇంధన ఖర్చు భారీగా తగ్గుతుంది.
  • తెలుపు రంగు సులభంగా దొరుకుతుంది, దాని నిర్వహణ ఖర్చు కూడా తక్కువే.
  • తెలుపు ఒక సాధారణ రంగు కాబట్టి చాలా కంపెనీలు దీన్నే ఇష్టపడతాయి.
  • ముదురు రంగులను మార్చి వేరే రంగు వేయడం కష్టం. అందుకే చాలామంది తెలుపు రంగు విమానాలనే కొనడానికి ఇష్టపడతారు.
44
విమానాల తెలుపురంగు వెనక చారిత్రక కారణం
Image Credit : Getty

విమానాల తెలుపురంగు వెనక చారిత్రక కారణం

తెలుపు రంగు వాడటం వల్ల విమానయాన సంస్థలకు లక్షల రూపాయలు ఆదా అవుతాయి. నీలి ఆకాశంలో ఎగిరేటప్పుడు పక్షులు తెల్లటి విమానాన్ని సులభంగా గుర్తించగలవు. దీనివల్ల విమానాన్ని పక్షులు ఢీకొట్టే ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతారు.

తెలుపు రంగు వెనుక ఒక చారిత్రక కారణం కూడా ఉంది. విమానాలను తయారుచేసిన తొలి రోజుల్లో వాటిని అల్యూమినియంతో చేసేవారు. అల్యూమినియం సహజంగానే వెండిలాంటి తెలుపు రంగులో ఉంటుంది. ఆ తర్వాత పెయింటింగ్ వేసే అలవాటు వచ్చినా, తెలుపు రంగే ప్రామాణికంగా మారింది. ఆ పాత అలవాటే ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ కారణంతో కూడా చాలా విమానాలు తెలుపు రంగులోనే ఉన్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gas Cylinder Safety : గ్యాస్ సిలిండర్‌పై ఉండే A, B, C, D కోడ్ ఏంటో తెలుసా? దీనిలో ఇంత అర్థం దాగుందా?
Recommended image2
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image3
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Related Stories
Recommended image1
Facts : కుక్కలు కంటిచూపుతో కాదు వాసనతో మనుషులను గుర్తుపడతాయి.. ఇది ఎలా సాధ్యమో తెలుసా?
Recommended image2
Interesting Facts : ఆవులు, బర్రెలు తల తిప్పకుండానే వెనక్కి చూస్తాయా..! ఇది ఎలా సాధ్యమో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved