MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Interesting Facts : ఆవులు, బర్రెలు తల తిప్పకుండానే వెనక్కి చూస్తాయా..! ఇది ఎలా సాధ్యమో తెలుసా?

Interesting Facts : ఆవులు, బర్రెలు తల తిప్పకుండానే వెనక్కి చూస్తాయా..! ఇది ఎలా సాధ్యమో తెలుసా?

ఆవులు, బర్రెలు తల వెనక్కి తిప్పకుండానే వాటి వెనకాల ఏం జరుగుతుందో చూడగలవని మీకు తెలుసా? ఇది ఎలా సాధ్యం? వాటి కంటిచూపు అంత ప్రత్యేకంగా ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 11 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పశువులు 330 డిగ్రీస్ లో ఎలా చూడగలవు?
Image Credit : Gemini AI

పశువులు 330 డిగ్రీస్ లో ఎలా చూడగలవు?

మనిషికి కళ్లు ముందువైపు ఉంటాయి... కాబట్టి ముందు ఏం జరుగుతుందో మాత్రమే చూడగలం. వెనక ఏం జరుగుతుందో చూడాలంటే కచ్చితంగా తల తిప్పాల్సిందే. కాని పాడిపశువులైన ఆవులు, బర్రెలు తల తిప్పకుండానే వెనకాల ఏం జరుగుతుందో చూడగలవట. వాటికి కూడా మనలాగే ముందు వైపేగా కళ్లు ఉండేది... మరి వెనకాల ఎలా చూడగలవు? అనేగా మీ డౌట్. ఇది ఏదో మంత్రజాలం కాదు... మనుగడ కోసం పశువులకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఈ వెనక చూపు. మరి ఆవులు, గేదెల కంటి అమరిక, వాటి చూపు వెనుక ఉన్న ఆసక్తికరమైన సైంటిఫిక్ నిజాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పశువుల్లో పనోరమిక్ విజన్... అంటే ఏమిటో తెలుసా?
Image Credit : Guinness World Records

పశువుల్లో పనోరమిక్ విజన్... అంటే ఏమిటో తెలుసా?

మానవులకు కళ్లు ముఖానికి ముందు భాగంలో అమర్చబడి ఉంటాయి. దీనివల్ల మన చూపు కేవలం 180 డిగ్రీల పరిధికి మాత్రమే పరిమితమవుతుంది. కానీ ఆవులు, బర్రెల విషయానికి వస్తే వాటి కళ్లు తలకు ఇరువైపులా (లాటరల్ పొజిషన్) ఉంటాయి. ఈ ప్రత్యేకమైన శరీర నిర్మాణం వల్ల వాటికి 'పనోరమిక్ విజన్' (Panoramic Vision) లభిస్తుంది. అంటే అవి తల తిప్పకుండానే దాదాపు 300 నుండి 330 డిగ్రీల విశాలమైన కోణంలో తమ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించగలవు. దీనివల్ల తమ వెనుక నుంచి ఎలాంటి ముప్పు లేదా శబ్దం వచ్చినా వెంటనే గ్రహించగలుగుతాయి.

Related Articles

Related image1
Murrah Buffalo: ఈ స్పెషల్ గేదె ఒక్కటి చాలు.. ఏడాదికి రూ.లక్షల్లో సంపాదించొచ్చు
Related image2
Cow Ghee vs Buffalo Ghee: ఆవు నెయ్యి Vs గేదె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
35
పశువుల కంటిచూపు ఎంత ప్రత్యేకమో తెలుసా?
Image Credit : Getty

పశువుల కంటిచూపు ఎంత ప్రత్యేకమో తెలుసా?

ఆవులు, గేదెల కనుపాప (Pupil) నిర్మాణం మనిషి కళ్ల కంటే పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. మనుషుల కనుపాప గుండ్రంగా ఉంటే, పశువుల కనుపాప అడ్డంగా (Horizontal Slit) ఉంటుంది. ఇలాంటి కనుపాప అమరిక వల్ల నేలమట్టానికి సమాంతరంగా ఉండే విశాల ప్రాంతాన్ని కూడా ఒకేసారి స్పష్టంగా చూడటానికి పశువులకు వీలవుతుంది. ముఖ్యంగా పశువులు మేత మేసేటప్పుడు తల కిందకు దించినప్పటికీ ఇరువైపులా, వెనుక భాగంలో ఏం జరుగుతుందో ఈ ప్రత్యేకమైన కనుపాప సహాయంతో గమనించగలవు. అందుకే అవి వెనకాల చిన్న కదలిక ఉన్న అలర్ట్ అవుతాయి… పరుగుతీస్తాయి.

పశువుల దేన్నయినా చూసేటప్పుడు రెండు రకాల దృష్టి వ్యవస్థలు ఒకే సమయంలో పనిచేస్తాయి.

ఏక నేత్ర దృష్టి (Monocular Vision) : కళ్లు తలకు ఇరువైపులా ఉండటం వల్ల, కుడి కన్ను కుడివైపు, వెనుక దృశ్యాన్ని, ఎడమ కన్ను ఎడమవైపు, వెనుక దృశ్యాన్ని వేర్వేరుగా చూడగలవు. ఈ ఏక నేత్ర దృష్టి ద్వారానే అవి తల తిప్పకుండా వెనుక భాగాన్ని గమనిస్తాయి.

ద్వి నేత్ర దృష్టి (Binocular Vision) : నేరుగా ముందుకు చూసేటప్పుడు రెండు కళ్లను కలిపి దాదాపు 25 నుండి 50 డిగ్రీల చిన్న పరిధిలో చూస్తాయి. ఇది వస్తువుల దూరాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి తోడ్పడుతుంది.

45
పశువులకు బ్లైండ్ స్పాట్ ఏది?
Image Credit : ANI

పశువులకు బ్లైండ్ స్పాట్ ఏది?

పాడి పశువులకు 330 డిగ్రీల విశాల దృష్టి ఉన్నప్పటికీ చిన్న బ్లైండ్ స్పాట్స్ (కనపడని ప్రాంతాలు) కూడా ఉంటాయి. సరిగ్గా వాటి తోక వెనుక భాగంలో (దాదాపు 30 నుండి 60 డిగ్రీల కోణంలో), ముక్కు/నుదురు కింద ఉన్న చిన్న ప్రాంతంలో వాటికి ఏమీ కనిపించదు. అందుకే ఆవు లేదా గేదె వెనుక సరిగ్గా తోక వెనుక భాగంలో నిలబడితే అవి భయపడి తన్నే అవకాశం ఉంది. అవి మిమ్మల్ని చూడలేవు కాబట్టి హఠాత్తుగా శబ్దం వస్తే బెదిరిపోతాయి… దాడికి దిగుతాయి.

55
వెనక చూపు... పశువులకు ప్రకృతి ప్రసాదించిన ఆత్మరక్షణ కవచం
Image Credit : Getty

వెనక చూపు... పశువులకు ప్రకృతి ప్రసాదించిన ఆత్మరక్షణ కవచం

ప్రకృతిలో శత్రువులను వేటాడే సింహాలు, పులుల వంటి క్రూర మృగాలకు కళ్లు ముఖం ముందు భాగంలో ఉంటాయి. ఎందుకంటే వాటికి ఎరను కచ్చితంగా అంచనా వేసి వేటాడే ద్వినేత్ర దృష్టి ముఖ్యం. కానీ ఆవులు, గేదెలు మేత మేసే సాదు జంతువులు (Prey Animals). మేత మేస్తున్న సమయంలో వేటాడే జంతువులు వెనుక నుంచి దాడి చేయకుండా తమను తాము కాపాడుకోవడానికి ప్రకృతి వాటికి ఈ విశేషమైన నేత్ర నిర్మాణాన్ని ఇచ్చింది. తల తిప్పకుండా వెనక్కి చూడగలగడం అనేది వాటి మనుగడకు అత్యంత ఆవశ్యకమైన ఒక జీవశాస్త్ర పరిణామం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prime Ministers Favorite Food : నెహ్రూ నుండి మోదీ వరకు.. ఏ ప్రధాని, ఏ ఫుడ్ ఇష్టంగా తినేవారో తెలుసా?
Recommended image2
America: అమెరికాలో ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల జీతాలు ఎంత ఉంటాయి? నెలకు ఎంత మిగులుతుంది?
Recommended image3
దేశానికి అత్యధికమంది ఐపిఎస్ లను అందించిన టాప్ 10 రాష్ట్రాలివే.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?
Related Stories
Recommended image1
Murrah Buffalo: ఈ స్పెషల్ గేదె ఒక్కటి చాలు.. ఏడాదికి రూ.లక్షల్లో సంపాదించొచ్చు
Recommended image2
Cow Ghee vs Buffalo Ghee: ఆవు నెయ్యి Vs గేదె నెయ్యి.. ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved