MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Uniform Colors : డాక్టర్లు తెల్లకోటు, పోలీసులు ఖాకీ డ్రెస్.. ఏ యూనిఫామ్ వెనక ఏ అర్థం దాగుందో తెలుసా?

Uniform Colors : డాక్టర్లు తెల్లకోటు, పోలీసులు ఖాకీ డ్రెస్.. ఏ యూనిఫామ్ వెనక ఏ అర్థం దాగుందో తెలుసా?

డాక్టర్లు వైట్ కోట్, పోలీసులు ఖాకీ డ్రెస్, ఆర్మీ వాళ్లు గ్రీన్ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు? ప్రతి వృత్తికి చెందిన యూనిఫామ్ రంగుల వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలు ఇక్కడ తెలుసుకోండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Sep 14 2026, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యూనిఫామ్ రంగుల వెనుక ఇన్ని కారణాలున్నాయా?
Image Credit : pinterest

యూనిఫామ్ రంగుల వెనుక ఇన్ని కారణాలున్నాయా?

డాక్టర్లను చూడగానే మనకు వాళ్ల వైట్ కోట్ గుర్తొస్తుంది. పోలీసులు అనగానే ఖాకీ డ్రెస్, ఆర్మీ అనగానే గ్రీన్ యూనిఫామ్ గుర్తుకొస్తాయి. ప్రతి వృత్తికి ఒక ప్రత్యేకమైన యూనిఫామ్ ఉండటం కేవలం వాళ్లను సులభంగా గుర్తించడానికి మాత్రమే కాదు. ఆ రంగుల వెనుక స్వచ్ఛత, భద్రత, నమ్మకం, అధికారం, క్రమశిక్షణ, ప్రాక్టికల్ అవసరాలు వంటి ఎన్నో కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

డాక్టర్లు – తెలుపు కోటు

డాక్టర్లు వేసుకునే వైట్ కోట్ కేవలం యూనిఫామ్ మాత్రమే కాదు. అది స్వచ్ఛత, శుభ్రత, నమ్మకానికి చిహ్నం. డాక్టర్ల ఈ తెల్లటి వస్త్రధారణ.. రోగులకు ఒక రకమైన నమ్మకాన్ని, భద్రతా భావాన్ని కలిగిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పోలీస్ – ఖాకీ డ్రెస్
Image Credit : pinterest

పోలీస్ – ఖాకీ డ్రెస్

ఇండియాలో పోలీసుల యూనిఫామ్ అనగానే ఖాకీ రంగే గుర్తొస్తుంది. ఈ రంగు పోలీసు డిపార్ట్‌మెంట్‌తో ఎప్పటినుంచో ముడిపడి ఉంది. బ్రిటిష్ వాళ్ల పాలనలోనే ఈ ఖాకీ యూనిఫామ్‌ను ఇండియాలో ప్రవేశపెట్టారు.

దుమ్ము, ధూళి వంటివి ఈ ఖాకీ రంగుపై అంత స్పష్టంగా కనిపించవు. అందుకే బయట, ఫీల్డ్ వర్క్ చేసే పోలీసులకు ఇది చాలా ప్రాక్టికల్‌గా అనిపించింది. బ్రిటిషర్ల కాలంలో మొదలైన ఖాకీ యూనిఫార్మ్ కల్చర్ కాలక్రమేణా భారత పోలీసు శాఖకు ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిపోయింది.

36
ఆర్మీ – ఆకుపచ్చ, క్యామోఫ్లాజ్
Image Credit : pinterest

ఆర్మీ – ఆకుపచ్చ, క్యామోఫ్లాజ్

ఆర్మీ సైనికులు ధరించే యూనిఫామ్‌లో ఆకుపచ్చ రంగు, క్యామోఫ్లాజ్ (Camouflage) డిజైన్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అడవులు, పర్వత ప్రాంతాలు, పచ్చని వాతావరణంలో ఉన్నప్పుడు సైనికులు అక్కడి పరిసరాల్లో కలిసిపోయేందుకు ఈ రంగులు, డిజైన్లు బాగా ఉపయోగపడతాయి. శత్రువుల కంటపడకుండా ఉండటమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఆర్మీ యూనిఫామ్ రంగు కేవలం గుర్తింపు కోసం కాదు, భద్రత, యుద్ధ క్షేత్రంలోని అవసరాల కోసం కూడా దీన్ని వాడుతారు.

46
పైలట్లు – ముదురు నీలం యూనిఫార్మ్
Image Credit : pinterest

పైలట్లు – ముదురు నీలం యూనిఫార్మ్

పైలట్లు ఎక్కువగా ముదురు నీలం (డార్క్ బ్లూ) రంగు యూనిఫామ్ ధరిస్తారు. ఈ రంగు క్రమశిక్షణ, అధికారం, విశ్వసనీయతను సూచిస్తుంది. ముఖ్యంగా పైలట్ యూనిఫామ్.. ప్రయాణికులలో ఒక ప్రొఫెషనల్ లుక్‌తో పాటు నమ్మకాన్ని కలిగించేలా డిజైన్ చేయబడింది.
56
చెఫ్ – తెలుపు డ్రెస్
Image Credit : pinterest

చెఫ్ – తెలుపు డ్రెస్

చెఫ్‌లు, వంటవాళ్లు ధరించే తెల్లటి యూనిఫామ్ కూడా స్వచ్ఛత, శుభ్రతను తెలియజేస్తుంది. ఆహారం తయారుచేసే చోట శుభ్రత చాలా ముఖ్యం కాబట్టి, తెల్లటి దుస్తులపై మరకలు, మురికి సులభంగా కనిపిస్తాయి. దీనివల్ల యూనిఫామ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలనే బాధ్యత ఉంటుంది. అంతేకాకుండా వంటగదిలో ఉండే అధిక వేడిలో, తెల్లటి దుస్తులు వేడిని తక్కువగా గ్రహిస్తాయి. అందుకే ఇతర ముదురు రంగుల దుస్తులతో పోలిస్తే ఇది కాస్త సౌకర్యంగా ఉంటుంది. ఈ కారణాల వల్లే చెఫ్‌ల సంప్రదాయ యూనిఫామ్‌లో తెలుపు రంగుకు అంత ప్రాధాన్యం ఉంది.

66
నిర్మాణ కార్మికులు – పసుపు, నారింజ డ్రెస్
Image Credit : pinterest

నిర్మాణ కార్మికులు – పసుపు, నారింజ డ్రెస్

రోడ్డు, నిర్మాణ పనుల్లో పాల్గొనే కార్మికులు సాధారణంగా పసుపు లేదా నారింజ వంటి ప్రకాశవంతమైన రంగుల దుస్తులు ధరిస్తారు. వాహనాలు, భారీ యంత్రాలు తిరిగే ప్రదేశాల్లో కార్మికులను దూరం నుంచే సులభంగా గుర్తించడానికి ఈ రంగులు సహాయపడతాయి. దీనివల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.

ఇలా యూనిఫామ్ రంగులు కేవలం దుస్తుల ఎంపిక మాత్రమే కాదు. అవి ఒక వ్యక్తి వృత్తిపరమైన గుర్తింపు, పని స్వభావం, భద్రత, సమాజంలో ఆ వృత్తిపై నమ్మకాన్ని తెలియజేసే ముఖ్యమైన సాధనంగా పనిచేస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rats Behavior : ఎలుకలు ఏ వస్తువులనైనా ఎందుకు కొరికి పాడుచేస్తాయి? అసలు కారణం ఇదే..!
Recommended image2
చిన్నారులపై లైంగిక అరాచకాలు తగ్గాలంటే... 'టింగ్ టాంగ్' ఫార్ములా ఫాలో అవ్వాల్సిందే, అంటే ఏమిటో తెలుసా?
Recommended image3
Heritage Trains: 170 ఏళ్లు వచ్చినా తగ్గని ఫేరీ క్వీన్ స్పీడ్.. ఇండియాలోని టాప్ 5 హెరిటేజ్ రైళ్లు ఇవే
Related Stories
Recommended image1
Uniform Civil Code : సహజీవనం రిజిస్టర్ చేసుకోవాల్సిందే.. లేదంటే ఆరు నెలల జైలు, జరిమానా..
Recommended image2
Indian Army Uniform: ఆర్మీ యూనిఫాంపై పేటెంట్స్! బ‌హిరంగ మార్కెట్లో విక్ర‌యిస్తే.. ఇక అంతే.. 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved