Uniform Civil Code : సహజీవనం రిజిస్టర్ చేసుకోవాల్సిందే.. లేదంటే ఆరు నెలల జైలు, జరిమానా..

లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండేవారికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై వీరి బంధాన్ని రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి. అందులోనూ నిజాయితీగా లేకపోతే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది

Live-In Relationships has to be registered, or six months jail and fine : Uttarakhand Civil Code - bsb

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టబడింది. ఇందులో ఇతర అంశాలతో పాటు, లివ్-ఇన్ రిలేషన్షిప్ లో పుట్టిన పిల్లలకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుందని పేర్కొంది. ఇక యూనిఫాం సివిల్ కోడ్ చట్టంగా మారిన తర్వాత, ఉత్తరాఖండ్‌లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారంతా జిల్లా అధికారుల దగ్గర తమ బంధాన్ని నమోదు చేసుకోవాలి. వీరి వయసు 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండి, లివ్ ఇన్ రిలేషన్ లో ఉండేవారికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.

సహజీవనంలో ఉన్నవారు ఉత్తరాఖండ్ వాసులై ఉండి.. రాష్ట్రానికి దూరంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి అని తెలిపారు. పబ్లిక్ పాలసీకి, నైతికతకు విరుద్ధంగా ఉన్న సంబంధాలను రిజిస్ట్రేషన్ చేయరు. సహజీవనంలో ఉన్న ఒక భాగస్వామికి అంతకుముందే వేరే పెళ్లి అయినా, వేరేవాళ్లతో సంబంధాలు ఉన్నా, మైనర్ అయినా... లేదా సహజీవనానికి మోసపూరితంగా ప్రేరేపించినా, బలవంతంగా ఒప్పించినా, తప్పు ఆధారాలు చూపించినా.. అలాంటి బంధాలను రిజిస్టర్ చేయరు. 

Gyanvapi: ఏ మసీదును హిందువులకు అప్పగించం: జ్ఞానవాపి వివాదంపై అసదుద్దీన్ ఒవైసీ

దీనిమీద ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. లైవ్-ఇన్ రిలేషన్షిప్ ను రిజిస్టర్ చేసుకోవడానికి జంటలు ఇచ్చే వివరాలను పరిశీలించడానికి, వారి బంధానికి పర్మిషన్ ఇవ్వడానికి ఓ వెబ్‌సైట్ సిద్ధం చేయబడుతోంది. దీంట్లో నమోదు చేసిన జంటల వివరాలు జిల్లా రిజిస్ట్రార్‌తో ధృవీకరించబడుతుంది. వారు ఆయా వ్యక్తుల గురించి పరిశీలించి, ఇచ్చిన వివరాలు సరైనవా, లేదా విచారణ నిర్వహిస్తారు. దీనికోసం సహజీవనంలో ఉన్న భాగస్వాములను ఇద్దరినీ లేదా ఎవరినైనా ఒక్కరినీ పిలిచి మాట్లాడొచ్చు. 

రిజిస్ట్రేషన్ నిరాకరించబడితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రార్ అతని లేదా ఆమె కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలి. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ విషయంలో రిజిస్టర్ 

రిజిస్టర్డ్ లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌లను టర్మినేట్ చేయాలనుకుంటే..నిర్దేశించిన ఫార్మాట్ లో వ్రాతపూర్వక ప్రకటన అవసరమవుతుంది. ఈ సంబంధం ముగియడానికి కారణాలు  "తప్పు"గా లేదా "అనుమానాస్పదమైనవి"గా అని రిజిస్ట్రార్ భావిస్తే పోలీసు విచారణకు చెప్పొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వారి వయసు 21 ఏళ్లలోపు అయితే, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కూడా ఈ విషయం తెలియజేస్తారు.

లైవ్-ఇన్ రిలేషన్ షిప్ డిక్లరేషన్‌లను సమర్పించడంలో విఫలమయినా, లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా.. అది తేలితే.. మూడు నెలల జైలు శిక్ష, రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇక సహజీవనంలో ఉంటూ.. ఆ బంధాన్ని రిజిస్టర్ చేయించకపోతే గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష, రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించబడతాయి. రిజిస్ట్రేషన్‌లో ఒక నెల ఆలస్యమైనా శిక్షలు పడతాయి. ఇలాంటి సందర్భాల్లో మూడు నెలల వరకు జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా లేదా రెండూ విధించబడతాయి.

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మంగళవారం ఉదయం ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్‌లోని లివ్-ఇన్ రిలేషన్స్ విభాగంలో ఇతర కీలక అంశాలు కూడా ఉన్నాయి. ఇందులో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ద్వారా పుట్టిన పిల్లలకు చట్టపరమైన గుర్తింపు లభించడం కూడా ఉంది. అంటే, వారు సహజీవనం చేస్తున్న "జంటకి చట్టబద్ధమైన సంతానం"గా గుర్తించబడతారు.

 "పెళ్లి, సహజీవనం లేదా ఇంక్యుబేషన్ ద్వారా జన్మించిన పిల్లలందరికి ఒకే రకమైన హక్కులు ఉంటాయి. ఏ బిడ్డను 'చట్టవిరుద్ధం' అని నిర్వచించలేం" అని ఆ అధికారి తెలిపారు. అలాగే, "పిల్లలందరికీ వారసత్వం (తల్లిదండ్రుల ఆస్తితో సహా)లో సమాన హక్కులు ఉంటాయి" అని తెలిపారు. 

అంతేకాదు.. సహజీవన భాగస్వామి విడిచిపెట్టినట్లైతే ఆ మహిళకు మెయింటనెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా యూసీసీ డ్రాఫ్ట్ లో ఉంది. 

ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్ వివరాలు..

యూనిఫాం సివిల్ కోడ్, లేదా UCC అనేది పౌరులందరికీ వర్తించే చట్టాలను సూచిస్తుంది. ఇతర వ్యక్తిగత విషయాలతోపాటు వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత లాంటి విషయాలకు మతంతో సంబంధం లేకుండా అందరికీ ఇవి సమానంగా వర్తిస్తాయి. 

ఉత్తరాఖండ్‌కు ఉమ్మడి సివిల్ కోడ్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిజెపి చేసిన ప్రధాన ఎన్నికల వాగ్దానాలలో ఒకటి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్యానెల్, 2.33 లక్షల వ్రాతపూర్వక అభిప్రాయాలు, 60,000 మందితో మాట్లాడి, వీటి ఆధారంగా 749 పేజీల పత్రాన్ని రూపొందించింది.

ఇంకా ఇందులో బహుభార్యత్వం, బాల్య వివాహాలపై పూర్తిస్థాయిలో నిషేధం, అన్ని మతాలలోని బాలికలకు ప్రామాణిక వివాహ వయస్సు, ఒకే రకమైన విడాకుల విధానం వంటి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి.

ఉత్తరాఖండ్ UCC కూడా 'హలాలా','ఇద్దత్' వంటి పద్ధతులను నిషేధించాలని కోరింది, ఇవి విడాకులు లేదా భర్త మరణం తర్వాత స్త్రీ తప్పనిసరిగా పాటించాల్సిన ఇస్లామిక్ పద్ధతులు.యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఉత్తరాఖండ్ ఒక్కటే కాదు. అస్సాం, మరో బిజెపి పాలిత రాష్ట్రం కూడా ఈ ఏడాది చివర్లో ఇలాంటి నిబంధనలను అమలు చేయడానికి ప్రణాళికలను ప్రకటించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios