MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Water cut Iron: ఇనుమును నీరు కట్ చేయగలదా? ఎలా కట్ చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Water cut Iron: ఇనుమును నీరు కట్ చేయగలదా? ఎలా కట్ చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Water cut Iron: ఇనుమును చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఆ ఇనుమును కూడా నీరు కట్ చేయగలదని మీకు తెలుసా? ఇది ఆశ్చర్యకరమైనదే అయిన ఇది నిజం. ఇనుమును నీరు ముక్కలు చేసే శక్తిని కలిగి ఉంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Sep 11 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నీరు ఇనుమును ముక్కలు చేస్తుందా?
Image Credit : Chat Gpt

నీరు ఇనుమును ముక్కలు చేస్తుందా?

నీటితో ఇనుమును కట్ చేయగలరా? అని అడిగితే చాలామంది వెంటనే నో అనే చెబుతారు. ఎందుకంటే మనం సాధారణంగా నీటిని మృదువైన పదార్థం.. అది గట్టి ఇనుమును ఎలా కట్ చేస్తుంది? ఇలా ఆలోచించి ఎంతో మంది నీటితో గట్టి ఇనుమును కోయడం అసాధ్యమని అంటారు. కానీ నిజానికి నీటికున్న శక్తి చాలా ఎక్కువ. సరైన పద్ధతిలో వాడితే నీటితో ఇనుమును కట్ చేయవచ్చు. ప్రత్యేకమైన యంత్రాల సాయంతో నీటిని అత్యంత అధిక ఒత్తిడితో, చాలా వేగంగా పంపితే ఇనుము, స్టీల్ వంటి గట్టి లోహాలను కూడా కట్ చేయవచ్చు. ఈ టెక్నాలజీని వాటర్‌జెట్ కటింగ్ అంటారు. పరిశ్రమల్లో లోహాలను అవసరమైన ఆకారంలో కచ్చితంగా కోయడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎలా కట్ చేస్తుంది?
Image Credit : Chat gpt

ఎలా కట్ చేస్తుంది?

నీరు ఇనుమును కట్ చేసేందుకు వాటర్‌జెట్ కటింగ్‌ వాడతారు. ఇందులో నీటిని భారీ ఒత్తిడికి గురిచేస్తారు. ఆ తర్వాత దాన్ని చాలా చిన్న రంధ్రం ఉన్న నాజిల్‌ నుంచి బయటకు పంపిస్తారు. రంధ్రం చాలా చిన్నగా ఉండటంతో నీరు అత్యంత వేగంతో సన్నని ధారగా బయటకు దూసుకొస్తుంది. ఈ ధార లోహంపై బలంగా తాకినప్పుడు దాని ఉపరితలంలోని చిన్న చిన్న కణాలను తొలగిస్తుంది. అదే ప్రాంతంలో నిరంతరం నీటి ధార పడుతుండటంతో క్రమంగా కోత ఏర్పడి లోహం రెండు భాగాలుగా విడిపోతుంది. అయితే చాలా గట్టి ఇనుము లేదా స్టీల్‌ను కోయాల్సి వచ్చినప్పుడు నీటితో పాటు గార్నెట్ వంటి గట్టి రేణువులను కలుపుతారు. ఈ రేణువులు లోహాన్ని రుద్దుతూ తొలగించడంతో కట్టింగ్ మరింత వేగంగా, ప్రభావవంతంగా జరుగుతుంది.

Related Articles

Related image1
Meal Maker: మీల్ మేకర్ అంటే ఏమిటి? వాటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు షాకవుతారు
Related image2
గ్యాస్ స్టవ్ పక్కనే ఉప్పు డబ్బా పెడుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
33
ఇంట్లో కష్టం
Image Credit : Chat Gpt

ఇంట్లో కష్టం

నీరు.. ఇనుమును కట్ చేస్తుంది కాబట్టి ఇంట్లో చేద్దాం అనుకోకండి. ఇంట్లో ట్యాప్‌ నుంచి వచ్చే సాధారణ నీటితో ఇనుమును కట్ చేయడం సాధ్యం కాదు. అత్యంత అధిక ఒత్తిడి, భారీ వేగం, ప్రత్యేక నాజిల్, అవసరాన్ని బట్టి అబ్రేసివ్ రేణువులు ఉన్న ప్రత్యేక యంత్రం మాత్రమే ఈ పని చేయగలదు. ఈ పద్ధతికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇనుమును కత్తి, రంపం లేదా ఇతర యంత్రాలతో కోసేటప్పుడు వేడి ఎక్కువగా ఉత్పత్తి కావచ్చు. కానీ వాటర్‌జెట్ కటింగ్‌లో నీరు చల్లదనాన్ని అందించడం వల్ల వేడి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆటోమొబైల్ తయారీ, విమానాల తయారీ, భారీ యంత్రాల తయారీ, లోహాల తయారీ వంటి రంగాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ దేశాల్లో మీరు బట్టలు బాల్కనీలో ఆరేసినా.. రూ.70వేలు జరిమానా కట్టాల్సిందే.. ఎందుకో తెలుసా?
Recommended image2
Farmer Success Story: ఒక ఎకరం పొలంలో రోజుకు 12 వేల ఆదాయం.. ఈ యువరైతు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?
Recommended image3
Snake Bite First Aid : పాము, తేలు, జెర్రి... ఈ విషపూరిత జీవులు కాటేయగానే ఏం చేయకూడదు? ఏం చేయాలి?
Related Stories
Recommended image1
Meal Maker: మీల్ మేకర్ అంటే ఏమిటి? వాటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు షాకవుతారు
Recommended image2
గ్యాస్ స్టవ్ పక్కనే ఉప్పు డబ్బా పెడుతున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved