MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఓ ఛానల్ హెడ్ మా ఇంటికొచ్చి రూమ్ బుక్ చేస్తా వస్తావా అని పిలిచాడు.. వరలక్ష్మి శరత్ కుమార్ కి చేదు అనుభవం

ఓ ఛానల్ హెడ్ మా ఇంటికొచ్చి రూమ్ బుక్ చేస్తా వస్తావా అని పిలిచాడు.. వరలక్ష్మి శరత్ కుమార్ కి చేదు అనుభవం

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో రాణించాలని కలలు కనే యువతుల్ని టార్గెట్ చేసి కొందరు వారిని లైంగికంగా వేధిస్తుంటారు. కొందరు అవకాశాల పేరుతో లోబరుచుకుని వాడుకోవాలి అని ప్రయత్నిస్తుంటారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 29 2024, 01:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో రాణించాలని కలలు కనే యువతుల్ని టార్గెట్ చేసి కొందరు వారిని లైంగికంగా వేధిస్తుంటారు. కొందరు అవకాశాల పేరుతో లోబరుచుకుని వాడుకోవాలి అని ప్రయత్నిస్తుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిలకు ఎక్కువగా ఇలాంటి కష్టాలు ఎదురవుతుంటాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

కానీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబాల  అమ్మాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు, లైంగిక వేధింపులు తప్పడం లేదని వరలక్ష్మి శరత్ కుమార్ ద్వారా తెలుస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ మే 3న శబరి అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్న సంగతి తెలిసిందే. 

36

ఈ చిత్రంలో వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి శరత్ కుమార్ సౌత్ లో పేరుగాంచిన ప్రముఖ నటులు. ఆయన వారసురాలిగా వరలక్ష్మి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టం అని తన తండ్రి ముందుగానే హెచ్చరించినట్లు ఆమె పేర్కొంది. 

 

46

చాలా చిత్రాల్లో నన్ను తొలగించారు. స్టార్ కూతుర్ని అయినంత మాత్రాన నా కెరీర్ ఏమి సాఫీగా లేదు. ఓ ఛానల్ హెడ్ పనిమీద మా ఇంటికి వచ్చారు. పని పూర్తయ్యాక.. మీ మూడ్ బాగా లేనట్లు ఉంది.. రూమ్ బుక్ చేస్తా వస్తారా అని అడిగాడు. నాకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారు సార్ అని అడిగా. అదే మీ మూడ్ బాగా లేదు కదా ఎంజాయ్ చేయడానికి రూమ్ బుక్ చేస్తా అన్నాడు. 

56

ఎక్కడలేని కోపం వచ్చింది. నా ఇంటికి వచ్చి నాతోనే ఇలా మాట్లాడుతున్నావేంట్రా అని అడిగా. నేను స్టార్ కుమార్తెని.. నాతోనే ఇలా బిహేవ్ చేస్తున్నావంటే మిగిలిన అమ్మాయిలని నువ్వేం చేస్తున్నావ్ రా అంటూ తిట్టేశా. వెంటనే వాడిపై కేసు పెట్టా. వాడిని జాబ్ నుంచి పీకేశారు అని వరలక్ష్మి శరత్ కుమార్ తెలిపింది. 

66

ఇక మరికొందరు అయితే.. ఆ అమ్మాయి దానికి ఒప్పుకోదు తీసేయండి అంటూ చాలా చిత్రాల నుంచి నన్ను తొలగించారు. వారి మాటలు కూడా నేను విన్నాను అని వరలక్ష్మి ఇండస్ట్రీలో తనకి ఎదురైనా ఇబ్బందులు తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Recommended image2
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image3
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved