MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెంకటేష్ ని రోజా అసహ్యించుకుని వెళ్లిపోయిందా..ఆ హీరోయిన్ వల్లే గొడవ, ఇద్దరి మధ్య ఇంత జరిగిందా ?

వెంకటేష్ ని రోజా అసహ్యించుకుని వెళ్లిపోయిందా..ఆ హీరోయిన్ వల్లే గొడవ, ఇద్దరి మధ్య ఇంత జరిగిందా ?

టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యాన్స్ ప్రస్తుతం వెంకటేష్ ని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 02 2024, 07:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్ లో ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా కెరీర్ ని క్లీన్ గా నడిపిస్తున్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఫ్యాన్స్ ప్రస్తుతం వెంకటేష్ ని వెంకీ మామ అని ముద్దుగా పిలుస్తున్నారు. వెంకటేష్ చేసిన ఫ్యామిలీ చిత్రాలు ఒకప్పుడు ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. వెంకటేష్ తన పని తాను చేసుకుని నేరుగా ఇంటికి వెళ్లిపోయే రకం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఎవరితోనూ ఎలాంటి గిల్లికజ్జాలు ఉండవు. అలాంటిది ఒక హీరోయిన్ తో వెంకటేష్ కి కూడా గొడవ జరిగినట్లు చాలా కాలం నుంచి ప్రచారంలో ఉంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రస్తుతం పాలిటిక్స్ లో రాణిస్తున్న రోజా. వెంకటేష్, రోజా ఇద్దరూ కలసి కేవలం ఒకే ఒక్క చిత్రంలో నటించారు. ఆ మూవీ పోకిరి రాజా. అయితే వెంకటేష్, రోజా మధ్య ఎందుకు గొడవ జరిగింది అనే దానిపై రకరకాల రూమర్స్ ప్రచారం లో ఉన్నాయి. 

38

వెంకటేష్ పర్సనల్ మేకప్ మెన్ రాఘవ ఈ వివాదం గురించి తాజాగా ఇంటర్వ్యూలో తనకి తెలిసిన వాస్తవాన్ని బయట పెట్టారు. వెంకటేష్ అంటే రోజా అసహ్యించుకుని వెళ్లిపోయే వరకు వ్యవహారం వెళ్లిందట. దీని గురించి రాఘవ వివరణ ఇచ్చారు. వెంకటేష్ బాబుకి సినిమా, ఇల్లు తప్ప ఇంకేమి తెలియదు. 

48

వెంకటేష్, సౌందర్య నటించిన రాజా చిత్రం విషయంలోనే రోజాతో గొడవ జరిగిందనేది నా అభిప్రాయం అని మేకప్ మెన్ రాఘవ అన్నారు. రాజా చిత్రం తమిళ చిత్రానికి రీమేక్. తమిళంలో రోజా, కార్తీక్ జంటగా నటించారు. ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. 

58
Soundarya

Soundarya

ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని రోజాకి తెలిసిందే. వెంకటేష్ హీరోగా కంఫర్మ్ అయ్యారు. తమిళంలో నేను చేశాను కాబట్టి తెలుగులో నన్నే హీరోయిన్ గా తీసుకుంటారు అనే ధీమాతో రోజా ఉండేదట. కొంతమంది మీరే హీరోయిన్ అని కూడా ఆమెకి చెప్పారు. దీనితో వెంకటేష్ కి జోడిగా నటించబోతుండడంతో రోజా చాలా సంబరపడింది. 

68

కానీ ఆ టైంలో వెంకటేష్, సౌందర్య జంటకి సూపర్ క్రేజ్ ఉండేది. పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో ఘనవిజయం సాధించాయి. దీనితో రాజా చిత్రంలో కూడా వెంకటేష్ కి హీరోయిన్ గా సౌందర్యనే ఉండాలని నిర్మాతలు, డైరెక్టర్ డిసైడ్ అయ్యారు. అక్కడే రోజా మనస్తాపానికి గురైంది. 

78

నేను రాజా చిత్రంలో హీరోయిన్ గా చేయకపోవడానికి కారణం వెంకటేష్ అని ఆమె ఫిక్స్ అయింది. తాను ఇష్టం లేకపోవడం వల్లే సౌందర్యని హీరోయిన్ గా పెట్టుకున్నాడు అంటూ రోజా బాగా హర్ట్ అయింది. అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున ఈ న్యూస్ సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి వెంకటేష్ ఏదైనా ఫంక్షన్స్ లో కనిపిస్తే రోజా మాట్లాడకపోవడం.. పక్కన కూర్చోకుండా అసహ్యించుకుని వెళ్లిపోవడం లాంటివి జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 

88

అయితే ఇందులో వెంకటేష్ బాబు తప్పేమి లేదు. సౌందర్యని హీరోయిన్ గా తీసుకోవాలనేది పూర్తిగా డైరెక్టర్, నిర్మాత నిర్ణయం. వెంకటేష్ కి సంబంధం లేదు. అయినప్పటికీ రోజా అపార్థం చేసుకుని ఉండొచ్చని మేకప్ మెన్ రాఘవ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Disha Patani: ముంబై ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశా.. నెల రెంట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది
Recommended image2
Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Recommended image3
Classic Movies: 2026లో 25 ఏళ్లు పూర్తి చేసుకోనున్న క్లాసిక్ మూవీస్..లిస్ట్ లో స్పోర్ట్స్, రొమాంటిక్ సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved