MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Immortal Collections: జీవీ ప్రకాశ్ సినిమాకు తొలిరోజే షాకింగ్ కలెక్షన్లు.. ఇమ్మోర్టల్ ఎంత వసూలు చేసిందంటే? ?

Immortal Collections: జీవీ ప్రకాశ్ సినిమాకు తొలిరోజే షాకింగ్ కలెక్షన్లు.. ఇమ్మోర్టల్ ఎంత వసూలు చేసిందంటే? ?

Immortal Collections: మారియప్పన్ సిన్నా దర్శకత్వంలో జీవీ ప్రకాశ్ కుమార్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించిన 'ఇమ్మోర్టల్' సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసిందో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 05 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
య్యేళ్ల క్రితం జరిగిన ఓ రహస్య ఘటనతో ...
Image Credit : X

య్యేళ్ల క్రితం జరిగిన ఓ రహస్య ఘటనతో ...

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ హీరోగా నటించిన మరో సినిమా ఇమ్మోర్టల్. వెయ్యేళ్ల క్రితం జరిగిన ఓ రహస్య ఘటనతో ఈ కథ మొదలవుతుంది. ఆ తర్వాత ప్రస్తుత కాలానికి వస్తుంది. ఈ విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో, హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డెబ్యూ డైరెక్టర్ మారియప్పన్ సిన్నా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ కుమార్, కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇమ్మోర్టల్ కథ ఏంటంటే?
Image Credit : PR Team

ఇమ్మోర్టల్ కథ ఏంటంటే?

కథ ప్రారంభంలో, ఓ నిండు గర్భిణి వింత బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డ సాధారణమైనది కాదని అక్కడున్న ఓ వృద్ధురాలు హెచ్చరిస్తుంది. దీంతో భయపడిన కుటుంబం, ఆ బిడ్డను ఓ కొండపై వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కథ నేరుగా 2026 సంవత్సరానికి వెళ్తుంది. చెన్నైలో తన మామ ప్రింటింగ్ ప్రెస్‌లో జీవీ ప్రకాశ్ కుమార్ పనిచేస్తుంటాడు. తక్కువ అద్దెకు ఇల్లు వెతుకుతున్న అతనికి, ఓ యువతి నుంచి అనుకోని కాల్ వస్తుంది. తను ఉంటున్న పెద్ద బంగ్లాలో షేరింగ్‌కు రమ్మని ఆమె పిలుస్తుంది.

తక్కువ ఖర్చుతో మంచి ఇల్లు దొరికిందని హీరో ఆ ఇంట్లో చేరతాడు. కాలక్రమేణా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కానీ, ఆ అమ్మాయి సాధారణ మనిషి కాదని, ఆ ఇంటి చుట్టూ శక్తులు ఉన్నాయని హీరోకి తెలుస్తుంది. ఆ ఇంటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే హీరోకి అనేక షాకింగ్ సంఘటనలు ఎదురవుతాయి. ఆ తర్వాత జరిగే థ్రిల్లింగ్ మలుపులే ఈ సినిమా మిగిలిన కథ.

34
ఇమ్మోర్టల్ సినిమా ఎలా ఉందంటే?
Image Credit : X

ఇమ్మోర్టల్ సినిమా ఎలా ఉందంటే?

జీవీ ప్రకాశ్ కుమార్ ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో అద్భుతంగా నటించాడు. హీరోయిన్ కాయదు లోహర్ తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె నవ్వు, డైలాగ్ డెలివరీ ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. సినిమాలోని పాటలు గుర్తుండిపోయేలా ఉన్నాయి. థ్రిల్లింగ్ సన్నివేశాలకు తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం కథలో టెన్షన్‌ను పెంచాయి. ఎం. రాజేశ్ ఎడిటింగ్‌లో 131 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది.

44
ఇమ్మోర్టల్ షాకింగ్ కలెక్షన్లు..
Image Credit : X

ఇమ్మోర్టల్ షాకింగ్ కలెక్షన్లు..

ఇమ్మోర్టల్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, అది కలెక్షన్లపై కూడా ప్రభావం చూపింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఇండియాలో రూ.1.10 కోట్లు వసూలు చేసింది. విభిన్నమైన కథాంశం కావడంతో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ వీకెండ్ రెండు సెలవు దినాలు కావడంతో ఇమ్మోర్టల్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమా జీవీ ప్రకాశ్ కుమార్‌కు మంచి కంబ్యాక్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hanuman Ansh Telugu Day 3 Collections: తెలుగులో హనుమాన్‌ అంశ్‌ ఊహించని జంప్‌.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Recommended image2
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Recommended image3
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Related Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ ఇచ్చిన 1 లక్ష రెమ్యునరేషన్ తో 5 ఎకరాలు కొని, కోట్లు సంపాదించిన హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Rajamouli: రాజమౌళి కొడుకు హీరోగా సినిమా, డైరెక్టర్ ఎవరు? జక్కన్నషాకింగ్ నిర్ణయం వెనుక కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved