- Home
- Entertainment
- Sara Ali Khan: షాక్... బికినీలో బయట తిరిగేస్తున్న స్టార్ కిడ్ సారా.. ఆ ప్యాంటు కూడా ఎందుకంటూ ఘాటు కామెంట్స్!
Sara Ali Khan: షాక్... బికినీలో బయట తిరిగేస్తున్న స్టార్ కిడ్ సారా.. ఆ ప్యాంటు కూడా ఎందుకంటూ ఘాటు కామెంట్స్!
స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ సెన్సేషనల్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. కష్టపడి సాధించిన శరీర వంపులను అప్పనంగా చూపించేస్తూ అభిమానుల గుండెలను కోసేస్తుంది. సారా లేటెస్ట్ ఫోటో షూట్ లో బికినీని తలపించే టాప్ ధరించి పబ్లిక్ లో కొచ్చేసింది.

Sara Ali Khan
ప్రముఖ మ్యాగజైన్ ట్రావెల్ లీజర్ కోసం సారా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కేక పుట్టించారు. హాట్ ట్రెండీ వేర్ లో అన్ లిమిటెడ్ స్కిన్ షోకి తెరలేపింది. సారా సూపర్ హాట్ ఫోటో షూట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
Sara Ali Khan
ఇక సైఫ్ అలీ ఖాన్ వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సారా. హీరోయిన్ కావాలనే కలతో కష్టపడి బరువు తగ్గింది. ఒకప్పటి సారాను చూస్తే ఆమె ఈమేనా అంటారు. ఊబకాయంతో చాలా లావుగా ఉండేది. 2018లో విడుదలైన కేధార్ నాథ్ ఆమె మొదటి చిత్రం. ఈ మూవీలో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటించారు.
Sara Ali Khan
అదే ఏడాది రణ్వీర్ సింగ్ కి జంటగా సింబా మూవీలో నటించారు. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. అనంతరం ఆమెకు వరుసగా రెండు ప్లాప్స్ ఎదురయ్యాయి. లవ్ ఆజ్ కల్, కూలి నంబర్ వన్ అనుకున్నంత విజయం సాధించలేదు. లవ్ ఆజ్ కల్ మూవీలో సారా బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించడం విశేషం.
Sara Ali Khan
అయితే హీరో ధనుష్ కి జంటగా నటించిన అత్రాంగి రే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అత్రాంగి రే నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓ విడుదలైంది. అక్షయ్ కుమార్ మరో హీరోగా నటించారు. ఈ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
Sara Ali Khan
ప్రస్తుతం సారా హీరోయిన్ గా రెండు హిందీ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. అడపాదడపా చిత్రాలు చేస్తున్న సారాకు సాలిడ్ హిట్ ఇంకా దక్కలేదు. ఓ బ్లాక్ బస్టర్ పడితే స్టార్ హీరోయిన్ గా సెటిల్ కావచ్చని ఆశపడుతోంది. ఈ యంగ్ బ్యూటీకి మరో స్టార్ కిడ్ జాన్వీ నుండి పోటీ ఎదురవుతుంది.
మరోవైపు సారా తరచుగా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు డ్రగ్స్ కేసుగా టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలీవుడ్ కి చెందిన దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సారా అలీ ఖాన్ ని ఎన్సీబి అధికారులు విచారించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సారాకు ఎఫైర్ ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ ఆరోపణలు, వివాదాలు పక్కనపెడితే సీరియస్ గా కెరీర్ నిర్మించుకునే పనిలో సారా ఉన్నారు. రోజుకు రోజుకు తన గ్లామర్ పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం సారా వయసు 26 ఏళ్ళు కాగా ఆమెకు స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.