MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10 Elimination: 2వ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనేనా? సెలబ్రెటీ ఎలా డేంజర్ జోన్ లోకి వచ్చాడు?

Bigg Boss Telugu 10 Elimination: 2వ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనేనా? సెలబ్రెటీ ఎలా డేంజర్ జోన్ లోకి వచ్చాడు?

Bigg Boss Telugu 10 Elimination: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా కొనసాగుతోంది. సక్సెస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ షోలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా? ఇప్పటి వరకూ డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు? కారణం ఏంటి?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 16 2026, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రెండవ వారంలో మారుతున్న సమీకరణాలు..
Image Credit : youtube/@Starmaa

రెండవ వారంలో మారుతున్న సమీకరణాలు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 విజయవంతంగా రెండవ వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలోనే ఊహించని ట్విస్టులతో డబుల్ ఎలిమినేషన్ చేసి ఆడియన్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు బిగ్ బాస్ టీమ్. హౌస్ మేట్స్ ఓటింగ్ ఆధారంగా చరణ్ ఎలిమినేట్ కావడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆతరువాత చైత్ర రాయ్ విషయంలో జరిగిన డ్రామా.. అందరు చూశారు. ఈ క్రమంలోనే రెండవ వారం ఎలిమినేషన్ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నామినేషన్స్ రేసులో 11 మంది సభ్యులు
Image Credit : youtube/@Starmaa

నామినేషన్స్ రేసులో 11 మంది సభ్యులు

ఈ వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నామినేషన్స్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ ఒక ప్రత్యేకమైన రోప్ (తాడు) టాస్క్‌ను నిర్వహించారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీ ముగిసేసరికి ఏకంగా 11 మంది సభ్యులు నామినేషన్ జోన్‌లోకి వచ్చారు. నామినేట్ అయిన వారిలో రోహిత్, త్రిగున్, రామ్ ప్రసాద్, వర్షిణి, ఝాన్సీ, దేబ్జాని, సుధీర్ రెడ్డి, షాలిని, సృష్టి, ముకేష్ తో పాటు నటుడు కృష్ణుడు కూడా ఉన్నారు.

34
డేంజర్ జోన్‌లో నటుడు కృష్ణుడు
Image Credit : Asianet News

డేంజర్ జోన్‌లో నటుడు కృష్ణుడు

సోషల్ మీడియా నివేదికల ప్రకారం.. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ పరిశీలిస్తే.. ప్రేక్షకుల్లోత్రిగుణ్ కు ఫాలోయింగ్ పెరిగింది. ఓటింగ్ లో అతను అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆతరువాత స్థానంలో రోహిత్ ఉన్నాడు వీరిద్దరి మధ్య 10 శాతం ఓటింగ్ తేడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆతరువాత స్థానాల్లో ముఖేష్, రామ్ ప్రసాద్, షాలినీ ఉన్నారు.

ఇక సుధీర్ రెడ్డి గత వారం డేంజర్ జోన్‌లో ఉన్నప్పటికీ, ఈ వారం తన ప్రదర్శనతో గ్రాఫ్‌ను మెరుగుపరుచుకుని సేఫ్ జోన్‌లోకి వెళ్లాడు. అయితే, ఓటింగ్ ట్రెండ్స్‌లో అందరికంటే చిట్టచివరన ఉంటూ సీనియర్ నటుడు కృష్ణుడు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు సమాచారం. కృష్ణుడితో పాటు యాంకర్ వర్షిణి కూడా తక్కువ ఓటింగ్‌తో ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటోంది.

44
కృష్ణుడు వెనుకబడటానికి కారణాలు
Image Credit : Asianet News

కృష్ణుడు వెనుకబడటానికి కారణాలు

కృష్ణుడు హౌస్‌లో ఇప్పటివరకు తనదైన మార్క్ గేమ్‌ను చూపించకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. తనలో మరో కోణం చూపిస్తానంటూ హౌస్ లోకి వచ్చిన ఈ నటుడు.. త్రిగున్‌తో ముచ్చట్లు పెట్టడం మినహా, టాస్కుల్లో చురుగ్గా పాల్గొనకపోవడం వల్ల స్క్రీన్ స్పేస్ దక్కడం లేదు. రోప్స్ టాస్క్‌లో తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, ఆడియన్స్ ఓటింగ్ పెంచుకోవడానికి ఆ పెర్ఫార్మెన్స్ సరిపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఓటింగ్ లైన్స్ శుక్రవారం వరకూ ఉంటాయి.. ఇంకా మూడు రోజులు ఓటింగ్ ఉంది.. ఈలోపు పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం సాధారణ ఆడియన్స్ ఓటింగ్ ప్రాతిపదికన ఈ వారం నటుడు కృష్ణుడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి ఈ ఆదివారం నాగార్జున ఎవరికి వీడ్కోలు పలుకుతారో.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Aasmaan Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్‌‌ కొత్త మూవీ ఆస్మాన్‌ టీజర్‌ వచ్చింది.. వామ్మో ఇలా ఉందేంటి?
Recommended image2
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Recommended image3
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Related Stories
Recommended image1
600 కోట్ల విలువైన భూమిని ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఇచ్చిన నటుడు, ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన 12 ఎకరాల భూమిలో ఇప్పుడు ఏముందంటే?
Recommended image2
60 ఏళ్ల కెరీర్ లో 800 సినిమాలు.. కైకాల సత్యనారాయణ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved