MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • వైవా హర్ష తన భార్యకు విడాకులు ఇస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్..?

వైవా హర్ష తన భార్యకు విడాకులు ఇస్తున్నాడా..? క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్..?

ప్రముఖ యూట్యూబర్.. స్టార్ కమెడియన్ వైవా హార్ష.. తన భార్యకు విడాకులు ఇస్తున్నాడా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 02 2024, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈమధ్య కాలంలో సెలబ్రిటీల పెళ్లిల్లు.. విడాకులు ఎక్కువై పోయాయి. అంతే కాదు విడాకులు రూమర్లు కూడా ఎక్కువ అయ్యాయి. అయితే రూమర్ల సంగతి పక్కన పెడితే నిజంగా విడాకులు తీసుకుంటున్న  తారల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే సమంత, చైతు, ధనుష్, ఐశ్వర్య.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు త‌మ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు. 
 

పాప కోసం ప్రాణాలకు తెగించిన సల్మాన్ ఖాన్... రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ స్టార్..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇలా కొంత మందిపై రూమర్లు కూడా వస్తున్నాయి. అయితే  టాలీవుడ్ లో క‌మెడియ‌న్ గా.. అంతకు ముందు యూట్యూబర్ గా  ఫేమస్ అయిన  వైవా హ‌ర్ష అందరికి తెలిసిన వ్యక్తే. అయితే ఈమధ్యనే ఆయన అక్ష‌ర‌ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే తాజాగా ఆయన తన భార్యకు  విడాకులు ఇవ్వ‌బోతున్నాడంటూ రెండు రోజుల నుంచి ప్రచారం  జోరుగా జ‌రుగుతోంది. 

ఆలియా భట్ ఇతర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పై.. రణ్ బీర్ కపూర్ కామెంట్స్ ఏంటంటే..?

37

అయితే దీనికి ప్రధాన కారణం కూడా  హ‌ర్ష పెట్టిన ఒక పోస్టే కార‌ణం అయ్యింది. ఆయన ఏమని పోస్ట్ పెట్టాడంటే..  ఏద‌మైందో ఏమో గానీ స‌డెన్ గా సోష‌ల్ మీడియాలో.. లైఫ్ అనేది రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు, ఎగ్జైట్మెంట్, చికాకు, భయం, థ్రిల్‌.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. అని పోస్ట్ పెట్టాడు. 

47

అంతే కాదు మనం బకెల్‌ పట్టుకుని కూర్చుని రైడ్‌ను ఎంజాయ్‌ చేయడం తప్ప ఏం చేయాలేం. జీవితంలో దేనిని  కోరుకోకూడదు.. అది రాలేదు అని నిరాశపడకూడదు.. జీవితం ఎటు వెళ్తే.. అటు గుడ్డిగా వెళ్లిపోవడమే అంటే హర్ష పోస్ట్ పెట్టారు. దాంతో ఈ పోస్ట్ చూసి చాలామంది ఆలోచనలో పడ్డారు. ఏం జరిగి ఉంటుంది.. ఎందుకు ఇలా పెట్టాడు అంటూ ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు. 

57
హర్ష ఎంగేజ్‌మెంట్‌ దృశ్యం.

హర్ష ఎంగేజ్‌మెంట్‌ దృశ్యం.

ఇకఇదే అదనుగా చాలామంది సోషల్ మీడియా జనాలు హ‌ర్ష ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేస్తున్నాడ‌ని.. అతని భార్య ఆక్ష‌ర‌కు విడాకులు ఇవ్వ‌బోతున్నాడ‌ని రకరకాల ప్రచారం స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. వైజాగ్ లో అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు హర్ష.  రీసెంట్ గా సుందరం మాస్టార్ మూవీతో హీరోగా కూడా మారాడు. గతంలో వైవా సిరీస్ తో . యూట్యూబ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు.. బాగా ఫేమస్ అయ్యాడు.. ఆత‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చి క‌మెడియ‌న్ గా చాలా షార్ట్ టైమ్ లో ఎదిగాడు హర్ష. 

67

ఇక ఈ రూమర్స్ పై.. స్పందించాడు హర్ష. విడాకులపై క్లారిటీ ఇస్తూ.. మరో పోస్ట్ పెట్టాడు. తనకు తన భార్యకు  విడాకుల వార్త‌ల్లో ఎటువంటి నిజం లేద‌ని  క్లారిటీ ఇచ్చాడు. తనకు ఈ విధంగా ప్రశ్నిస్తూ.. కాల్స్ వస్తున్నాయని... ఇక తనుపెట్టిన  పోస్టు గురించి ఆరా తీస్తున్నారని.. తనకు ఏమయ్యిందో అని కంగారుపడుతున్నారని.. వారందరికి హర్ష కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు.

77

తన జీవితంలో చాలామంది  అందమైన వ్యక్తులు ఉన్నారని. వారి వల్ల తాను పర్సనల్ లైఫ్ లో ఎంతో  సంతోషంగా ఉన్నాని అన్నారు. అయితే తన పని విషయంలోనే తాను  కాస్త చికాకుగా ఉన్నాన‌ని.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాన‌ని హ‌ర్ష తెలిపాడు.  దాంతో విడాకుల వార్తలు ప్రచారం చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved