MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: ఒకటైన సౌందర్య కుటుంబం.. దీప, కార్తీక్ బతికే ఉన్నారని తెలుసుకున్న సౌందర్య?

Karthika Deepam: ఒకటైన సౌందర్య కుటుంబం.. దీప, కార్తీక్ బతికే ఉన్నారని తెలుసుకున్న సౌందర్య?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 26 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 26 2022, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ నాకు గతం గుర్తు లేకపోవచ్చు కానీ వర్తమానం గుర్తుంది కదా. నేనే నీ భర్తని అంటున్నావు. తపన తాపత్రయం అని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. అందుకే చెప్తున్నాను నన్నే నీ భర్త అనుకో అనడంతో దీప ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఏమన్నారు డాక్టర్ బాబు మీరు చెప్పేది నిజమేనా అని అడగగా నిజమే దీప అని అంటాడు కార్తీక్. అప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నీ సమస్యలను నా సమస్యలుగా అనిపిస్తున్నాయి. ఏం చేశానా నిన్ను సంతోషంగా చూసుకోవాలనిపిస్తోంది నేను నీ భర్తనే దీప అనడంతో దీప సంతోష పడుతూ ఉంటుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ఈ క్షణం నుంచి నీకు నేనున్నాను అనడంతో దీప ఎమోషనల్ గా కార్తీక్ ని హత్తుకుంటుంది. ఆ తర్వాత దీప కార్తీక్ ఇద్దరు సౌర్య కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటారు. మరొకవైపు చంద్రమ్మ దంపతులు సౌర్య వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏం చేద్దాం సౌజన్య మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసాము అని అనడంతో శౌర్య అమ్మానాన్నలు ఎక్కడ  ఉన్నారో అని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య వాళ్ళు సౌర్య కోసం వెతుకుతుండగా కార్తీక్ వాళ్ళు కూడా సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు సౌందర్య, సౌర్య వాళ్ళు ఒక చోట కలుసుకుంటారు. అప్పుడు సౌందర్య నా మనవరాలను నాకు అప్పగించిందంటే ఇల్లు కాలు చేసి ఊర్లూర్లు తిరుగుతారా అంటూ కోపంతో రగిలిపోతుండగా సౌర్య సౌందర్యను ఆపుతుంది.
 

36

నానమ్మ ఆరోజు నువ్వు మళ్లీ వస్తానని చెప్పావంట కదా బాబాయ్ కి అనడంతో ఓహో ఇలా చెప్పి నీకు మాకు నిన్ను దూరం చేస్తున్నారు అని అంటుంది సౌందర్య. అప్పుడు సౌర్య లేదు నానమ్మ అమ్మ నాన్నలను వెతకడానికి నాకు సహాయం చేస్తున్నారు అనడంతో ఆనందరావు అవన్నీ అబద్ధాలే అమ్మ నీకోసం మీ అమ్మ నాన్న రావడంతో ఆ ఊరు విడిచి ఊరికి వచ్చారు అని చెబుతాడు. అప్పుడు నిజమా బాబాయ్ అని సౌర్యని నిలదీయడంతో వెంటనే ఇంద్రుడు సౌందర్య కాళ్లు పట్టుకుంటాడు. క్షమించండమ్మ తప్పయిపోయింది. జ్వాలమ్మ లేకుండా బతకలేం అనిపించింది అందుకే సౌర్యమ్మ చేసాము అని అంటుంది చంద్రమ్మ.

46

మరొకవైపు కార్తీక్ దీప ఇద్దరు సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత దీప కార్తీక్, ఇద్దరు సౌందర్య గురించి గుర్తుపట్టి అక్కడికి వెళ్లి అందరూ ఒకచోట కలుసుకుంటారు. అప్పుడు దీప తన కూతుర్లను చూసి సంతోష పడుతూ ఉంటుంది. ఆనందరావు దంపతులు కూడా సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు ఎందుకు మీరు బతికి ఉండి కూడా మమ్మల్ని ఏడిపించారు అనడంతో కార్తీక్ లేదమ్మా అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సౌర్య ఇక్కడే ఉందని తెలిసి మేము కూడా సౌర్య కోసం వెతుకుతున్నాము అని అంటాడు కార్తీక్. అప్పుడు సౌర్య చూసావా నానమ్మ నేను చెబితే నువ్వు నమ్మలేదు అనడంతో అవును రౌడీ అని అంటుంది.
 

56

అప్పుడు దీప సంతోషంతో ఇక మనల్ని విడదీసే వారు ఎవరు అనడంతో దూరం నుంచి మోనిత గన్ తో షూట్ చేయడంతో వంటలక్క కింద పడిపోతుంది. అయితే అదంతా జరిగినట్టు ఆనందరావు కలగంటాడు. ఇప్పుడు భగవంతుడా నిజంగా ఈసారి నా కొడుకు కోడల్ని కళ్ళముందు కనిపించేలా చెయ్ స్వామి అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు సౌందర్య ఆ మోనిత చేసిన పనికి వారం రోజులపాటు ఇక్కడికి రాలేకపోయాను సౌర్య దగ్గరికి వెళ్లి సౌర్యను పిలుచుకొని ఆ తర్వాత మోనిత దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సౌందర్య అక్కడికి వెళ్లడంతో ఇంటికి తాళం వేసి ఉండగా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా మళ్లీ ఆ ఇంటి ఓనర్ వాళ్ళు రావడంతో సౌందర్య అక్కడికి వెళ్లి శౌర్య గురించి అడుగుతుంది.
 

66

ఆ తర్వాత ఆ ఇంటి ఓనర్ వాళ్ళు సౌందర్యని లోపలికి రమ్మని పిలుస్తారు. మరొకవైపు దీప ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు దీప ఆ పోస్టర్ చూపించి ఇంద్రుడు చేసిన పనిని చెబుతుంది. ఇప్పుడు సరే డాక్టర్ బాబు వెళ్దాం పద అని అనగా ముందు నువ్వు హాస్పిటల్ కి వెళ్దాం పద దీప అని అనగా ఇంతలోనే గతంలో కార్తీక్ తన ఆస్తి మొత్తం రాసించిన ఆమె వచ్చి కార్తీక్ కాళ్లు పట్టుకుంటుంది. ఇప్పుడు నన్ను క్షమించండి డాక్టర్ బాబు మీ మంచితనం గురించి తెలియక మిమ్మల్ని నానా మాటలు అన్నాను అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత దీప కార్తీక్ ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. మరొకవైపు సౌందర్యకి ఆ ఇంటి ఓనర్ జరిగింది మొత్తం వివరించడంతో సౌందర్య షాక్ అవుతుంది. అప్పుడు ఆ ఇంటి ఓనర్ శౌర్య వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చారంట అందుకే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనడంతో సౌందర్య షాక్ అవుతుంది. ఇప్పుడు సౌందర్య నిజంగానే నా కొడుకు కోడలు బతికే ఉన్నారా అని ఆనందపడుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీ గతంలో దీపకి వచ్చిన జబ్బే వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Recommended image3
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved