MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నా భర్తను నేను ఇష్టపడలేదు, ఆ పని చేశాక ఇంకా కోపం పెరిగింది ... పెళ్ళైన నెలకే బర్రెలక్క సంచలన కామెంట్స్ 

నా భర్తను నేను ఇష్టపడలేదు, ఆ పని చేశాక ఇంకా కోపం పెరిగింది ... పెళ్ళైన నెలకే బర్రెలక్క సంచలన కామెంట్స్ 

బర్రెలక్క గత నెలలో వెంకటేష్ అనే కుర్రాడిని పెళ్లి చేసుకుంది. పెళ్ళై నెలరోజులు కూడా గడవక ముందే భర్త అంటే ఇష్టం ఉండేది కాదని సంచలన కామెంట్స్ చేసింది. బర్రెలక్క కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 30 2024, 03:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Barrelakka

Barrelakka


సోషల్ మీడియా యుగంలో ఎవరు ఎప్పుడు సెలెబ్రిటీలు అవుతారో చెప్పలేం. లక్షల మంది సామాన్యులను స్టార్స్ చేసింది సోషల్ మీడియా. అలాంటి వారిలో బర్రెలక్క ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అంటే తెలియనివారుండరు. 
 

26

బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె డిగ్రీ చదివింది. ఉద్యోగం రాక బర్రెలు మేపుకుంటున్నాను... అంటూ వీడియోలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆమె వీడియోలు కనెక్ట్ అయ్యాయి. శిరీష వీడియోలు వైరల్ కాగా బర్రెలక్కగా పాప్యులర్ అయ్యింది. 
 

36

2023 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత అజెండాతో బర్రెలక్క పోటీ చేసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది. ఈమె తరపున జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేయడం విశేషం. అనూహ్యంగా కొల్లాపూర్ లో బర్రెలక్క నాలుగో స్థానంలో నిలిచింది. ఆమెకు 5700 పై చిలుకు ఓట్లు పడ్డాయి.

46

పార్లమెంట్ ఎన్నికల్లో కూడా శిరీష నిలబడుతుంది. ఇటీవల నామినేషన్ దాఖలు చేసింది. కాగా మార్చి నెలలో శిరీష వివాహం చేసుకుంది. బంధువుల అబ్బాయి అయిన వెంకటేష్ తో ఏడడుగులు వేసింది. తాజా ఇంటర్వ్యూలో భర్త వెంకటేష్ గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

56
Barrelakka

Barrelakka

శిరీష మాట్లాడుతూ... వెంకటేష్ నేను నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుకున్నాము. నాకు అప్పుడే తెలిసింది వెంకటేష్ మా బంధువు అవుతాడని. అప్పట్లో నేను జీన్స్ ధరించి స్టైలిష్ గా తయారయ్యేదాన్ని. అది వెంకటేష్ కి నచ్చేది కాదు. బొట్టు, పూలు పెట్టుకుని, గాజులు ధరించి సాంప్రదాయంగా ఉండమనేవాడు. 
 

66
Barrelakka alias Shirisha

Barrelakka alias Shirisha

అది నీకు నచ్చేది కాదు. అందుకే వెంకటేష్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఐ లవ్ యు అని మెసేజ్ లు పెట్టి డిలీట్ చేసేవాడు. అప్పుడు మరింత కోపం పెరిగింది. తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు ఎదురు కాగా అండగా నిలిచాడు. అప్పుడే వెంకటేష్ అంటే నాకు ఇష్టం కలిగిందని... ఆమె చెప్పుకొచ్చింది.. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved