MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం

Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం

హాస్య నటి కల్పనా రాయ్ 400పైగా సినిమాల్లో నటించారు. పుట్టుకతోనే ఆమె ధనవంతురాలు. కానీ చివరి రోజుల్లో ఆకలితో అలమటిస్తూ ఎవరూ లేని దీన స్థితిలో మరణించారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 02 2026, 03:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Kalpana Rai
Image Credit : Asianet News

Kalpana Rai

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించి చివరకు దీన స్థితిలో మరణించిన వారు చాలా మందే ఉన్నారు. వారిలో హాస్య నటి కల్పనా రాయ్ ఒకరు. లేడీ కమెడియన్ గా కల్పనా రాయ్ ఎన్నో సినిమాల్లో నటించారు. 70వ దశకం నుంచే ఆమె కెరీర్ ప్రారంభం అయింది. 400పైగా సినిమాల్లో కల్పనా రాయ్ నటించారు. కమెడియన్ గా తిరుగులేని గుర్తింపు సాధించిన కల్పనా రాయ్ చివరి రోజుల్లో ఎవరూ లేని దీన స్థితిలో అనాథలా మరణించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పుట్టుకతోనే కోటీశ్వరురాలు
Image Credit : Asianet News

పుట్టుకతోనే కోటీశ్వరురాలు

కల్పనా రాయ్ పుట్టుకతో పేదవారు కాదు. కోటీశ్వరుల కుటుంబంలో జన్మించారు. సీనియర్ రచయిత నందం హరిశ్చంద్రరావు ఓ ఇంటర్వ్యూలో కల్పనా రాయ్ జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్పనా రాయ్ అచ్చతెలుగు మహిళ. ఆమె కాకినాడలో జన్మించారు. కానీ ఆమె పేరు చివర రాయ్ అని ఉండడం వెనుక ఆసక్తికర కథ ఉంది. పుట్టుకతోనే కల్పనా రాయ్ ధనవంతురాలు. ఆమె తల్లి దండ్రులు ఒళ్ళంతా బంగారం చేయించారు. ఓ కార్యక్రమంలో నటి శారద చిన్న వయసులో ఉన్న కల్పనా రాయ్ ని చూసి నటి అయ్యే లక్షణాలు ఉన్నాయి అని అభినందించారట. నటిని చేయమని ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ కల్పనా రాయ్ చిన్నతనంలోనే ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు.

35
ప్రియుడి వల్ల ఎదురుదెబ్బ
Image Credit : Asianet News

ప్రియుడి వల్ల ఎదురుదెబ్బ

దీనితో కల్పనా రాయ్ బంధువులు ఆమె ఆస్తిని కరిగించేశారు. దీనితో ఆమె పేదరికంలోకి నెట్టివేయబడింది. సినిమాల్లోకి వెళ్లి సంపాదించాలని కల్పనా రాయ్ అనుకుంది. నటి శారద సహాయంతో ఆమెకి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. యుక్త వయసులో ఉన్నప్పుడు మోహన్ రాయ్ అనే వ్యక్తిని కల్పనా రాయ్ ప్రేమించింది. పెళ్లి చేసుకోకుండానే అతడితో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాయ్ అనే పేరు అతడి నుంచి ఆమెకి వచ్చింది. కానీ అతడు కల్పనా రాయ్ ని మోసం చేసి వెళ్ళిపోయాడు.

45
స్టార్ హీరోల సినిమాల్లో హాస్య నటిగా
Image Credit : Asianet News

స్టార్ హీరోల సినిమాల్లో హాస్య నటిగా

తన బిడ్డని పోషించడం కోసం నటిగా మారింది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కల్పనా రాయ్ మాత్రం తన బిడ్డపైనే ఆశలు పెట్టుకుంది. ఇంతలో ఆమెకి నటిగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. కల్పనా రాయ్ కూతురు పెద్దయ్యాక ఓ వ్యక్తిని ప్రేమించి అతడితో వెళ్ళిపోయింది. తల్లిని ఒంటరిని చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే కల్పనా రాయ్ జీవితం మొత్తం ఎదురుదెబ్బలే. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు ఇలా అగ్ర హీరోల సినిమాల్లో తన హాస్యంతో కల్పనా రాయ్ కడుపుబ్బా నవ్వించారు.

55
దీన స్థితిలో మరణించిన కల్పనా రాయ్
Image Credit : Asianet News

దీన స్థితిలో మరణించిన కల్పనా రాయ్

ఓ సీత కథ, హిట్లర్, ప్రేమించుకుందాం రా, ఆపద్బాంధవుడు, నారీ నారీ నడుమ మురారి, శ్రీనివాస కల్యాణం, జానకి రాముడు, జంబ లకిడి పంబ ఇలా ఎన్నో చిత్రాల్లో కల్పనారాయ్ నటించారు. ఆమె విపరీతమైన బరువు పెరగడంతో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఎవ్వరూ తోడు లేకపోవడం తో ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందనే సంగతి కూడా ఎవరికీ తెలియదు. చివరికి భోజనం లేక అలాగే ఇంట్లోనే ఒంటరిగా మరణించారు. నటిగా రాణిస్తున్న రోజుల్లో కల్పనా రాయ్ చాలా మంది ఆర్టిస్టులని తన ఇంటికి పిలిచి మరీ భోజనం పపెట్టారు. కానీ ఎవరూ లేని అనాథలా ఆమె మరణించాల్సి వచ్చింది. ఆమె అంత్యక్రియలని కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు చేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: రోహిత్ ను మరోసారి టార్గెట్ చేసిన టీమ్, ఇచ్చిపడేసిన నాగార్జున, అసలేం జరుగుతోంది
Recommended image2
Charan Eliminate: బిగ్ బాస్‌ తెలుగు 10 ఐదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌.. చరణ్‌ ఎలిమినేట్‌
Recommended image3
Vijay Deverakonda: పాన్‌ ఇండియా స్టార్స్ కి విజయ్‌ దేవరకొండ బిగ్‌ షాక్‌.. సంచలన స్టేట్‌మెంట్‌
Related Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved