MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్

Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో 4 సినిమాలు తనకు చాలా ఇష్టం అని చిరంజీవి తెలిపారు. ఆ 4 సినిమాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. చిరంజీవి జోస్యం చెప్పిన ఓ మూవీ సూపర్ హిట్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 02 2026, 08:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pawan Kalyan
Image Credit : Asianet News

Pawan Kalyan

జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు సెప్టెంబర్ 2న తన పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే అభిమానుల్లో ఎలాంటి జోష్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ వెల్లువలా వస్తున్నాయి. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో కెరీర్ ప్రారంభించారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి తగ్గ తమ్ముడిగా నిరూపించుకున్నారు. మెగాస్టార్ తో సమానమైన క్రేజ్ ని చూశారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ పవన్ సినిమాల్లో తనకి ఇష్టమైన 4 సినిమాలని ప్రస్తావించారు. పవన్ సినిమాలన్నీ ఇష్టం ఒకటి రెండు తప్ప. వాటిలో నాలుగు సినిమా స్పెషల్ గా ఇంకా ఎక్కువ ఇష్టం అని చిరంజీవి అన్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తొలిప్రేమ
Image Credit : Asianet News

తొలిప్రేమ

తొలిప్రేమ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చిరంజీవి తెలిపారు. పవన్ కళ్యాణ్ కి దక్కిన తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. ఈ మూవీతోనే పవన్ ని యువత ఫాలో కావడం ప్రారంభించారు. పవన్ అల్లరి, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, కీర్తి రెడ్డి పెర్ఫార్మెన్స్, కరుణాకరన్ దర్శకత్వం ఈ చిత్రంలో హైలైట్స్.

35
బద్రి
Image Credit : Sun NXT

బద్రి

చిరంజీవికి ఇష్టమైన సినిమాల జాబితాలో బద్రి కూడా ఉంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ పవర్ ఫుల్ మూవీ తెరకెక్కింది. పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన మ్యానరిజమ్స్ మొదలైంది ఈ సినిమాతోనే. కథ కంటే పవన్ యాటిట్యూడ్ కారణంగా ఈ మూవీ సూపర్ హిట్ అయింది.

45
జల్సా
Image Credit : Asianet News

జల్సా

తనకు జల్సా మూవీ అంటే కూడా ఇష్టం అని చిరంజీవి అన్నారు. పవన్ కళ్యాణ్ కి అస్సలు టైం బాగా లేని సమయంలో ఊరటనిచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఆడియో లాంచ్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరై జోస్యం కూడా చెప్పారు. జల్సా మూవీ నేను చూడలేదు. కానీ సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ మూవీలో ఏమైనా లోపాలు ఉంటే ఎడిటింగ్ లో సరిచేయమని అల్లు అరవింద్, త్రివిక్రమ్ నన్ను అడిగేవాళ్ళు. కానీ నన్ను అడగలేదంటే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకమే కారణం అని చిరంజీవి ఆడియో లాంచ్ లో తెలిపారు. చిరంజీవి చెప్పినట్లుగానే జల్సా మూవీ అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది.

55
అత్తారింటికి దారేది
Image Credit : Asianet News

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది మూవీ నాకు చాలా ఇష్టం. చాలా సంతృప్తి నిచ్చిన మూవీ అది అని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే. మగధీరని అధికమించి ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: షాలిని కోసం త్యాగం, డేంజర్ జోన్ లో రోహిత్.. లాస్ట్ మినిట్ లో అమన్ కి మళ్ళీ దెబ్బ
Recommended image2
Vishnupriya: బ్లాక్ శారీలో విష్ణుప్రియ మెరుపులు.. లేటెస్ట్ లుక్ అదిరిందిగా, వైరల్ ఫోటోస్
Recommended image3
Katrina Kaif: లండన్ లో కత్రినా కైఫ్, వైరల్ ఫోటోలపై ట్రోలింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అలియా భట్
Related Stories
Recommended image1
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Recommended image2
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved