మగాడి పక్కలో పడుకునే అవకాశం.. పెళ్లిపై రష్మీకి ఇలాంటి ఒపీనియన్ ఉందా, మొత్తం డబుల్ మీనింగే
త్వరలో న్యూ ఇయర్ రానున్న సందర్భంగా రష్మీ గౌతమ్ పేరుపై ఒక క్రేజీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ పేరు 'రష్మీ పెళ్లి పార్టీ'. రష్మీ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది.
జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. రష్మీ, సుధీర్ లవ్ ఎఫైర్ గురించి ఏళ్ల తరబడి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతూనే ఉంది. బుల్లితెరపై వీరిద్దరూ నిజమైన ప్రేమికుల్లాగే వ్యవహరిస్తూ వినోదం పంచారు.
అయితే నిజంగానే సుధీర్, రష్మీ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. సుధీర్ బుల్లితెరపై గుడ్ బై చెప్పి హీరోగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రష్మీ మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ లాంటి షోలతో బిజీగా గడుపుతోంది.
త్వరలో న్యూ ఇయర్ రానున్న సందర్భంగా రష్మీ గౌతమ్ పేరుపై ఒక క్రేజీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ పేరు 'రష్మీ పెళ్లి పార్టీ'. రష్మీ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినట్లు అనిపిస్తోంది. రష్మీ పెళ్లి అంటే వెంటనే ఆడియన్స్ లో ఆసక్తి పెరుగుతుంది. అందుకే ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ షోలో బుల్లితెర నటీనటులు, బిగ్ బాస్ సెలెబ్రిటీలు, బాబా భాస్కర్, అమ్మ రాజశేఖర్ లాంటి కొరియోగ్రాఫర్లు సందడి చేస్తున్నారు. ఎప్పటిలాగే హైపర్ ఆది, రష్మీ మధ్య సంభాషణ నవ్వులు పూయించే విధంగా ఉంది.
Rashmi Gautam
ప్రోమో గమనిస్తే హైపర్ ఆది రష్మీతో ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావ్ అని అడగగా.. నా పెళ్లి పార్టీ అని సమాధానం ఇస్తుంది. నీ ఏజ్ ఫార్టీ అంటే నమ్ముతాం కానీ పార్టీ అంటే నమ్మశక్యంగా లేదు అని హైపర్ ఆది సెటైర్ వేస్తాడు.బాబా భాస్కర్, అమ్మ రాజశేఖర్ డాన్స్ పెర్ఫామెన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. హనుమాన్ హీరో తేజ సజ్జా కూడా ఈ ఈవెంట్ కి అతిథిగా హాజరయ్యారు.
rashmi Instagram
ఆ తర్వాత చమ్మక్ చంద్రతో రష్మీ పూర్తిగా డబుల్ మీనింగ్ సెటైర్లు వేస్తూ షాకిచ్చింది. చమ్మక్ చంద్ర రాగానే రష్మీ అతడి పాదాలకు నమస్కరిస్తునట్లు అతివినయం చూపించింది. ఏంటి రష్మీ నా కాళ్లకు మొక్కుతున్నావ్ అని చమ్మక్ చంద్ర అడగగా.. మగడు చాలా గొప్పోడు అంటూ రష్మీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మొదలు పెట్టింది.
మగాడు చాలా గొప్పోడు.. ఆడపిల్లకు తాళి కట్టి ఆలిని చేసుకుంటాడు. తన పక్కలో పడుకునేందుకు అవకాశం ఇస్తాడు. ఏడాది తిరిగే సరికి చంకలో బిడ్డని ఇస్తాడు అంటూ ఫన్నీగా చెబుతుంది. మాకు నవ్వు రాలేదు అంటూ బాబా భాస్కర్ ఆమెపై సెటైర్ వేయడం నవ్వులు పూయిస్తుంది. మగాళ్ళంటే నీకు చిన్నపాటి గౌరవం ఉందని తెలుసు ఇంత గౌరవం ఉందని నాకు తెలియదు అని చమ్మక్ చంద్ర అంటాడు. దీనికి బదులుగా రష్మీ పిచ్చి ప్రాణం అండీ నాకు మగాళ్ళంటే అని నవ్వుతూ చెప్పడంతో హైపర్ ఆది నవ్వు ఆపుకోలేకపోతాడు.
చీరకట్టులో సాంప్రదాయాలు పాటించే మహిళగా రష్మీ కొంగు కప్పుకోవడం చమ్మక్ చంద్రకి ఆశ్చర్యం కలిగించేలా చేస్తుంది. ఇంత అభినయం ఏ ఎపిసోడ్ లో చూడలేదు రష్మీ అని అంటాడు. పేమెంట్ ని బట్టే పెర్ఫామెన్స్ ఉంటుందని రష్మీ చెప్పడం కూడా ఫన్నీగా ఉంది.