MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: వేరుకాపురం పెడుతున్నందుకు ఆనందంతో మల్లిక.. వారి మనసు మార్చే ప్రయత్నంలో రామా, జానకి!

Janaki kalaganaledu: వేరుకాపురం పెడుతున్నందుకు ఆనందంతో మల్లిక.. వారి మనసు మార్చే ప్రయత్నంలో రామా, జానకి!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..  

3 Min read
Author : Navya G
Published : Oct 20 2022, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జ్ఞానాంబ, రేపే విజయదశమి. తర్వాత ఎవరి వాటాలు వాళ్ళకి ఇస్తాను ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోండి అని అంటుంది. అప్పుడు గోవిందరాజు,ఒకసారి ఆలోచించుకో జ్ఞానం చిన్నపిల్లలు ఏమీ తెలీదు కదా అని అనగా ఇదేనా నిర్ణయం నేను అన్ని ఆలోచించుకొని చెప్తున్నాను  అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ గొడవ అయిపోయిన తర్వాత అఖిల్ బయటకు వచ్చి తను మాట్లాడిన మాటలు గుర్తుతెచ్చుకుంటూ అనవసరంగా తొందరపడ్డానా అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది అని అనుకుంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

 అదే సమయంలో మల్లిక అక్కడికి వచ్చి, ఏంటి ఆలోచనలో పడ్డాడు కొంపతీసి మంచి మనిషిగా మారిపోతాడా అని అక్కడ వెళ్లి ఏం చేస్తున్నావ్ అఖిల్ అని అనగా, అనవసరంగా అలా మాట్లాడినట్టు ఉన్నాను చిన్న వదిన ఇక్కడే ఉండాల్సింది అని అంటాడు అఖిల్. దానికి మల్లిక, అలా కాదు అఖిల్ నువ్వు ఇక్కడ ఉంటే అత్తయ్య గారి ముందు నువ్వు ఎప్పుడు మంచి వాడివి అవ్వలేవు జానకి నిన్ను అత్తయ్య గారు ముందు మంచి వాడిని చేయలేదు. నువ్వు ఇప్పుడు నీ డబ్బులు తీసుకుని బయటికి వెళ్లావు అనుకో అక్కడ నువ్వు ఉద్యోగం చేయొచ్చు, లేకపోతే వ్యాపారం చేయొచ్చు.
 

38

 నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితేనే అత్తయ్య గారి ముందు నీకు గౌరవం ఉంటుంది. నా మాట విను వేరు కాపరమే మంచిది అని అంటుంది. అదే సమయంలో జానకి అక్కడికి వస్తుంది. కోపంగా మల్లిక దగ్గరకు వచ్చి, మల్లికా నువ్వు కావాలనే అఖిల్ నీ రెచ్చగొడుతున్నావు పాపం అఖిల్ కి ఏం తెలీదు. చూడు అఖిల్ ఉమ్మడి కుటుంబంలో ఉండే విలువలు ఆనందాలు వేరు కాపురం పెడితే ఉండవు అని అనగా అఖిల్, నేను చిన్న వదిన చెప్పిందే చేస్తాను వేరుకాపరమే మంచిది. ఇంక నన్ను ఏమి అడగవద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

48

 అప్పుడు అఖిల్ మాటలకు మల్లిక ఎంతో ఆనంద పడుతూ గంతులు వేస్తుంది. అప్పుడు జానకితో మల్లిక, ఇప్పుడు నువ్వు ఎన్ని చేసినా సరే ఎవరి మనసులు మార్చలేవు నేనే గెలిచాను అని ఆనంద పడిపోతుంది. ఆ తర్వాత సీన్లో జరిగిన విషయం అంతా గుర్తు తెచ్చుకుంటున్న విష్ణు  ఆలోచనలో పడి అనవసరంగా నోరు జారనా? మల్లిక మాటలు విని వేరు కాపురం పెడతాను అని చెప్పాను అని అనుకుంటాడు. ఇంతలో రామా అక్కడికి వచ్చి విష్ణు భుజం మీద చేయి పెడతాడు. అప్పుడు విష్ణు అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మల్లిక అదే సమయంలో విష్ణు కోసం వెతుకుతూ మూల నుంచి వీళ్ళ మాటలు వింటుంది.
 

58

అప్పుడు రామ, ఏం విష్ణు వెళ్ళిపోదామని అనుకుంటున్నావా మన అన్నదమ్ముల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా సరే దూరం పెట్టే అంత గొడవలు ఎప్పుడు రాలేదు కదా ఇక్కడే ఉండు రా కావాలంటే నువ్వు ప్రతి నెల డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నేనే అప్పు చేసి అమ్మకు ఇస్తాను అని అనగా,మల్లిక అక్కడికి వచ్చి చాలు లెండి బావగారు.  ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పి మమ్మల్ని ఇంట్లో ఉండడానికి ఒప్పించి అత్తయ్య గారి ముందు మంచి పేరు తెచ్చేసుకుంటారు అని అనగా రామా, నీకు తెలుసో తెలియకో నామీద జానకి గారి మీద మంచి అభిప్రాయం లేదు మల్లిక.
 

68

 మార్చుకో అని అనగా విష్ణు మనసులో, ఇక్కడే ఉంటే మల్లిక ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉంటుంది. అన్నయ్యకి, వదినకు కూడా ఇబ్బంది అవుతుంది వెళ్లిపోవడమే మంచిది. అప్పుడైనా అన్నయ్య,  వదినలు ప్రశాంతంగా ఉంటారు అనుకొని,  అన్నయ్య మేము వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాము మా నిర్ణయం మార్చుకోము ఇంక వదిలేయని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో జ్ఞానాంబ, గోవిందరాజులు జరిగిన విషయం అంతా ఆలోచించుకుంటూ ఉంటారు .అప్పుడు జానకి రామా లు అక్కడికి  వస్తారు.
 

78

 అప్పుడు జానకి జ్ఞానాంబతో, అత్తయ్య గారూ మేము మాట్లాడుకున్న మాటలు మల్లిక విని తను ఇంకొకటి అర్థం చేసుకొని ఇంట్లో వాళ్లకు చెప్పింది ఈ గొడవ అంతా తమ వల్లే వచ్చింది. అయినా వాళ్ళు ఏవి తెలియక మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు వేరు కాపురం పెడితే సమాజాన్ని వాళ్ళు ఎదుర్కోలేరు, చిన్నపిల్లలు. అసలకే మల్లిక, జెస్సి ఇద్దరు కడుపుతో ఉన్నారు నెలలు నిండుతున్న కొద్ది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక ఎవరు వాళ్ళకి చేయలేక చాలా కష్టంగా ఉంటుంది. దయచేసి మీ నిర్ణయం మార్చుకోండి అత్తయ్య గారు అని అనగా నాకు తెలుసు జానకి వాళ్లకి కష్టం తెలియాలి. నాకు ఉమ్మడి కుటుంబంలో ఉన్న లాభాలు తెలుసు కనుక ఇన్ని రోజులు ఆపాను ఇప్పుడు కుటుంబ విలువలు గురించి తెలియాల్సింది నాకు కాదు వాళ్ళకి బయటకు వెళ్తేనే వాళ్లకు తెలుస్తది ఇదే నా నిర్ణయం ఇంక దీని గురించి మాట్లాడొద్దు అని చెప్తుంది జ్ఞానాంబ

88

అప్పుడు రామ, జానికిలు నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సీన్లో విష్ణు ఆలోచనలో పడతాడు కానీ మల్లిక మాత్రం వేరుకాపురం పెడుతున్నాము అని పాట పాడుతూ డాన్స్ చూస్తూ ఉంటుంది. ఆ మరోవైపు అఖిల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. కానీ జెస్సి మాత్రం జరిగిన విషయం గురించి ఆలోచించుకుంటూ, నేను ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ఆనందంగా ఇన్ని మంది మంచి మనుషులు మధ్య ఉంటున్నాను అనుకున్నాను కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఇలా అయింది అందరం కలిసి ఉంటే బాగుండు కదా అని అనుకుంటుంది. మరోవైపు జానకి,రామలు వాళ్ళ గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. 'ఎంఎస్- ఏ లెగసీ ఆన్ స్క్రీన్' బయోపిక్
Recommended image2
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image3
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved