- Home
- Entertainment
- Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
గౌరీ గణేశ పండగ సందర్భంగా కన్నడ నటుడు డాలీ ధనంజయ్ తన కొడుకు ఫోటోను షేర్ చేశారు. బాబుకు 'ఎరెయ' అని పేరు పెట్టారు. 'యజమాని' లేదా 'స్వామి' అని అర్థం వచ్చే ఈ పేరు వెనుక ఉన్న చారిత్రక ప్రాముఖ్యతను కూడా ఆయన వివరించారు.
15

Image Credit : daali-dhananjay instagram
నటుడు డాలీ ధనంజయ్
కన్నడ స్టార్ నటుడు డాలీ ధనంజయ్ తన ముద్దుల కొడుకు ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. బాబుకు 'ఎరెయ' అనే ప్రత్యేకమైన, అర్థవంతమైన పేరు పెట్టారు. ఈ పేరుకు అర్థం ఏంటో కూడా ధనంజయ్ వివరించారు. అలాగే, ప్రజలందరికీ గౌరీ-గణేశ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : daali-dhananjay instagram
డాలీ ధనంజయ్ పోస్ట్
అందరికీ గౌరీ గణేశ పండగ శుభాకాంక్షలు. మమ్మల్ని ప్రేమించే వాళ్లంతా, 'మీ అబ్బాయిని ఎప్పుడు చూపిస్తారు, ఏం పేరు పెట్టారు' అని అడుగుతున్నారు. ఈ పండగ రోజున, ఈరోజు మీ అందరికీ పరిచయం చేస్తున్నాం.
35
Image Credit : daali-dhananjay instagram
పేరుకి అర్థం ఇదే
'ఎరెయ'— ఇది ప్రాచీన కన్నడ సంప్రదాయంలో ఒక గౌరవప్రదమైన పదం. దీనికి 'యజమాని, స్వామి, అధిపతి' అని అర్థం. ఒకప్పుడు రాజులను, చక్రవర్తులను గౌరవంగా పిలిచేందుకు ఈ పదాన్ని వాడేవారు. చారిత్రక పుటల్లో, చాళుక్య మహారాజు ఇమ్మడి పులకేశి చిన్ననాటి పేరు కూడా 'ఎరెయ' అని కనిపిస్తుంది.
45
Image Credit : daali-dhananjay instagram
మా హృదయానికి రాజు
"ఆ రాజసం, వారసత్వం, శక్తివంతమైన అర్థం ఉన్న మా జీవితంలోని చిన్న అధిపతి. మా హృదయానికి రాజు. మా 'ఎరెయ'. మీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి," అని నటుడు డాలీ ధనంజయ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
55
Image Credit : daali-dhananjay instagram
ధనంజయ్, ధన్యతల వివాహం
ధనంజయ్, ధన్యతల వివాహం 2025 ఫిబ్రవరిలో ఘనంగా జరిగింది. మైసూరులో జరిగిన ఈ పెళ్లికి స్టార్ నటీనటులతో పాటు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. చిత్రదుర్గకు చెందిన ధన్యత వృత్తిరీత్యా గైనకాలజిస్ట్.
Latest Videos

