- Home
- Entertainment
- Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో భాగంగా 8వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ సాధారణంగా జరగలేదు. రచ్చ చెలరేగింది అనే చెప్పాలి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో సోమవారం ఎపిసోడ్ రణరంగాన్ని తలపించింది. నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ నామినేషన్స్ పాయింట్స్ పెట్టారు. ముఖ్యంగా త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. త్రిగుణ వర్సెస్ సుధీర్ , షాలిని వర్సెస్ వర్షిణి వివాదాలు తీవ్ర స్థాయికి చేరాయి. నామినేషన్స్ ప్రక్రియని బిగ్ బాస్ ఆసక్తికరంగా అరేంజ్ చేశారు.
వాళ్ళిద్దరినీ నామినేట్ చేసిన రోహిత్
బజర్ మోగిన ప్రతి సారి బిగ్ బాస్ ఇద్దరిని పిలుస్తారు. ఆ ఇద్దరూ రోప్ ని తొలగించే టాస్క్ లో పాల్గొనాలి. ఎవరు ముందు కంప్లీట్ చేస్తే వాళ్ళకి నామినేట్ చేసే అవకాశం దక్కుతుంది. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. ముందుగా సుధీర్ రెడ్డి త్రిగుణ్, షాలిని లని నామినేట్ చేశారు. రోహిత్ వంతు వచ్చినప్పుడు అంతా ఊహించనినట్లుగానే అతడు త్రిగుణ్ ని నామినేట్ చేశారు. అదే విధంగా ఝాన్సీని కూడా నామినేట్ చేశాడు.
తోమడానికి పంపుతున్నాడు
రోహిత్ మాట్లాడుతూ.. త్రిగుణ్ చేసే కొన్ని కామెంట్స్ వినడానికి కూడా అసహ్యంగా ఉంటాయి. నన్ను స్టెరాయిడ్స్ అన్నాడు. అదే విధంగా మరో కామెంట్ కూడా చేశాడు. అది విన్నప్పుడు నేను అస్సలు జీర్ణించుకోలేకపోయాను. నేను సృష్టిని సుధీర్ మీదకు తోమడానికి పంపుతున్నాను అట. ఇది ఎంత అసభ్యంగా ఉంది అని రోహిత్ త్రిగుణ్ ని నామినేట్ చేశాడు. త్రిగుణ్ కూడా తన వాదనని బలంగా వినిపించాడు. ఝాన్సీ తన సొంత గేమ్ ఆడడం లేదు అని, సేఫ్ గేమ్ ఆడుతోంది అని రోహిత్ నామినేట్ చేశాడు. అప్పుడు ఝాన్సీ రోహిత్ కి కౌంటర్ ఇస్తూ.. నన్ను రోహిత్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పింది. వెంటనే త్రిగుణ్ అందుకుని అందుకే తోమడానికి పంపుతున్నాడు అని తాను చెప్పినట్లు తెలిపాడు.
నరేష్ తగ్గేదే లే
ఆ తర్వాత జబర్దస్త్ నరేష్ .. షాలినిని నామినేట్ చేశాడు. షాలిని ఏ టాస్క్ కి, మీటింగ్ కి కరెక్ట్ టైం కి రాదు. బిగ్ బాస్ చెప్పే వరకు ఆమె రాదు. అదే విధంగా ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుంది అని నరేష్ తెలిపారు. మీరు రామ్ ప్రసాద్ కి ఫేవర్ గా ఉంటూ పక్కన వాళ్లపై విమర్శలు చేయవద్దు అని షాలిని గొడవ పెట్టుకుంది. నరేష్ కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత త్రిగుణ్.. సుధీర్ ని, రోహిత్ ని నామినేట్ చేశారు.
వర్షిణి, షాలిని మధ్య రణరంగం
త్రిగుణ్ మాట్లాడుతుండగా.. షాలిని కలగజేసుకుని.. మధ్యలో ఎవరూ చప్పట్లు కొట్టి ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పింది. కానీ ఆ రూల్ ని షాలిని నే బ్రేక్ చేసి రోహిత్ కి సపోర్ట్ తెలుపుతూ కామెంట్స్ చేసింది. దీనితో వర్షిణికి వచ్చింది. అంటే చప్పట్లు కొట్టి సపోర్ట్ చేస్తే తప్పు.. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి మాట్లాడి సపోర్ట్ చేస్తే తప్పు లేదా.. అంటూ షాలినిని క్వశ్చన్ చేసింది. వర్షిణి మంచి పాయింట్ రైజ్ చేసింది అని ఆమెకి చాలా మంది సపోర్ట్ తెలిపారు. ఆ తర్వాత షాలిని తనని తాను కవర్ చేసుకోవడానికి చప్పట్లు కొట్టడం కరెక్ట్ కాదు.. మాట్లాడ వచ్చు అని చెప్పింది. దీనితో వర్షిణి, షాలిని మధ్య వివాదం ఒకరినొకరు తోసుకునే వరకు వెళ్ళింది. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో షాలిని, త్రిగుణ్, ఝాన్సీ, ముకేశ్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్ నిలిచారు.

