MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే

Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే

జీ5 ఓటీటీ సంస్థ సంచలన ప్రకటన చేసింది. జీ5లో రాబోయే సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వివిధ భాషల్లో జీ5 ఓటీటీలో క్రేజీ సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ రానున్న రోజుల్లో ఎంటర్టైన్ చేయబోతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 29 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జీ5 ప్లానింగ్ అదుర్స్
Image Credit : Asianet News

జీ5 ప్లానింగ్ అదుర్స్

అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు డిఫ‌రెంట్ కంటెంట్‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తోన్న స్వ‌దేశీ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ జీ5 ..ట్రెండ్‌ను ఫాలో కావ‌టం కాదు..ట్రెండ్ క్రియేట్ చేయ‌టంలో మాకు మేమే సాటి అంటూ దూసుకెళ్తోంది. తాజాగా జీ5 మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మల్టీలాంగ్వేజ్ కంటెంట్ లైనప్‌ను అనౌన్స్ చేసి అంద‌రిలో తెలియ‌ని ఓ స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. కొత్త తరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ లైన‌ప్‌లో కొత్త కథలు, క్రియేట‌ర్స్‌, డిఫ‌రెంట్ ఫార్మేట్స్ ఉండ‌టం విశేషం. ఇంట్రెస్టింగ్ విష‌య‌మేమంటే.. తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషలను కవర్ చేస్తూ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్, AI ఆధారిత కథనాలు, యానిమేషన్, పిల్లల వినోదం వంటి విభిన్న కంటెంట్ ఈలైన‌ప్‌లో ఉండ‌టం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జీ5లో రాబోయే హిందీ సినిమాలు
Image Credit : our own

జీ5లో రాబోయే హిందీ సినిమాలు

ప్రముఖ ఫ్రాంచైజీలు, ప్రీమియం ఒరిజినల్స్ నుంచి కొత్త తరహా ఫార్మాట్స్ వరకు, కథ చెప్పే విధానంలో కొత్త ప్రమాణాలు సెట్ చేస్తూ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది జీ5.థియేట్రికల్ రిలీజ్‌లైన త‌ర్వాత స్ట్రీమింగ్ కాబోయే సినిమాల‌తో పాటు డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్‌ల కాంబో కూడా కనిపిస్తోంది. హై జ‌వానీతో ఇష్క్ హోనా హై (వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మౌని రాయ్), బండార్ (బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా), భార‌త్ భాగ్య విధాత (కంగనా రనౌత్), పూజా మేరీ జాన్ (మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషీ), స‌ర్వ్‌గుణ్ సంప‌న్న్‌(వాణీ కపూర్), ఘ‌మాసాన్ (అర్షద్ వార్సీ, తిగ్మాంశు ధూలియా, ప్రతీక్ గాంధీ), ఇక్రూప్‌ (మిథిలా పాల్కర్, గౌహర్ ఖాన్), ద‌లింప్‌ (జితేంద్ర కుమార్, ప్రియా బాపట్) వంటి ప్రాజెక్స్ ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. కొత్త కథలతో పాటు ప్రేక్షకులకు పరిచయమైన ఫ్రాంచైజీలను కూడా కలిపి ఈ లైన‌ప్‌ను మరింత ఆసక్తికరంగా రూపొందించారు.

Related Articles

Related image1
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Related image2
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
35
బాలయ్య నుంచి చైతు వరకు క్రేజీ హీరోల సినిమాలు ఇందులోనే
Image Credit : Asianet News

బాలయ్య నుంచి చైతు వరకు క్రేజీ హీరోల సినిమాలు ఇందులోనే

తెలుగులో శ్రీమ‌తి (నివేథా థామస్), అబ్జెక్ష‌న్ మై లార్డ్ (శ్రీకాంత్) వంటి కొత్త ఒరిజినల్స్‌తో పాటు, బ్లాక్‌బస్టర్ టాక్ షో జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా మళ్లీ వస్తోంది. సినిమాల లైనప్‌లో వెంకీ అనీల్ రావిపూడి5, ఎన్‌బీకే111, వృష‌క‌ర్మ‌ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

45
తమిళ కంటెంట్
Image Credit : Instagram

తమిళ కంటెంట్

తమిళంలో కూసే మునిసామి వీర‌ప్ప‌న్‌, త‌డ‌యమ్ మ‌ళ్లీ వ‌స్తుండ‌గా కొత్త ఒరిజినల్స్‌గా అనంత‌కాల‌మ్‌, మొదటి ఇండిపెండెంట్ రాప్ బ్యాటిల్ షోగా తీ కుర‌ల్ రానున్నాయి. సినిమాల విష‌యానికి వ‌స్తే డీ మాంటే కాల‌నీ3. హై(న‌య‌న‌తార‌, క‌విన్‌), రావాడి వంటి భారీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.

55
ఇతర భాషల చిత్రాలు
Image Credit : X

ఇతర భాషల చిత్రాలు

కన్నడలో అయ్య‌నా మానె కొత్త సీజన్‌తో మళ్లీ రాబోతోంది. అలాగే బిట్‌కాయిన్ స్కామ్‌, ఆప‌రేష‌న్ బంగార వంటి ఒరిజినల్స్ ఈ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తున్నాయి. సినిమాల విభాగంలో రాజ్ బి. శెట్టి, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన క‌ర‌వాలి యాడ్ కానుంది. మలయాళంలో ఏ క్వీన్‌, మ‌ల‌బార్ క‌ప్‌,మలయాళం తొలి ఇండిపెండెంట్ రాప్ బ్యాటిల్ షో కేర‌ళ అండ‌ర్‌గ్రౌండ్ ప్రీమియర్ కానున్నాయి. ఈ సీజన్‌లో అత్యంత ప్రశంసలు పొందిన బాల‌న్ ది బాయ్ కూడా ఇందులో భాగ‌మైంది. మరాఠీలో హె కే న‌వీన్‌? కొత్త సీజన్‌తో పాటు అగ అయి, అహో ఆయి అనే కొత్త ఒరిజినల్, తుంబ‌డ్చి మంజుల‌, భూత‌మ్ భ‌య‌మ్ వంటి హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. బెంగాలీలో ప్రేక్షకుల ఫేవరెట్ షోలు శ్వేత్‌కాళి, లాల్ బ‌జార్ కొత్త సీజన్‌లతో తిరిగి వస్తున్నాయి. అలాగే అలూర్ దోస్‌, ప్రియో బొంధు వంటి షోలు ఒరిజినల్స్ లైనప్‌ను మరింత బలపరుస్తున్నాయి. మొత్తంగా, ప్రతి భాషలో స్థానిక సంస్కృతి, భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథలను అందిస్తూ జీ5 తన ప్రాంతీయ కంటెంట్‌ను మరింత విస్తరిస్తోంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Recommended image2
Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి
Recommended image3
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Recommended image2
Tollywood: మీడియం రేంజ్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు.. వీటికి ఈ ఏడాది కూడా మోక్షం లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved