MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?

Nayanthara: జిమ్ చేయదు, డైట్ తో పనిలేదు, నయనతార ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే షాక్ అవుతారు, లేడీ సూపర్ స్టార్ చేసే ఒక్క పని ఏంటి?

Nayanthara: 40 ఏళ్లు దాటినా నయనతార గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గడంలేదు. ఫిట్ నెస్ తో పాటు కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ.. బ్యూటీని మెయింటేన్ చేస్తోంది లేడీ సూపర్ స్టార్. ఎక్కువగా జిమ్ చేయకుండా? కఠినమైన డైట్ ఫాలో అవ్వకుండా నయన్ కు ఎలా సాధ్యం అయ్యింది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 04 2026, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
41 ఏళ్ల వయసులో కూడా అంతే ఎనర్జీతో...
Image Credit : X

41 ఏళ్ల వయసులో కూడా అంతే ఎనర్జీతో...

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నయనతార. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగుతున్నప్పటికీ, ఆమె అందం, ఫిట్‌నెస్, అభినయంలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులోనూ అంతే ఎనర్జీతో, గ్లామరస్ లుక్స్‌తో ప్రేక్షకులను మైమరపిస్తున్నారు నయనతార. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. ఆమెలో పెద్దగా మార్పుమాత్రం రాలేదు. రీసెంట్ గా కన్నడ స్టార్ హీరో యశ్‌తో కలిసి 'టాక్సిక్' చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో నటించి వార్తల్లో నిలిచింది నయన్. అయితే, ఈ వయసులోనూ తన అందాన్ని కాపాడుకోవడానికి నయనతార ఎలాంటి నియమాలు పాటిస్తారో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
యోగా, వెయిట్ ట్రైనింగ్ కలయిక
Image Credit : Instagram@nayanthara

యోగా, వెయిట్ ట్రైనింగ్ కలయిక

నయనతార పెద్దగా డైట్ చేయదు, జిమ్ముల్లో గంటలు గంటలు వర్కౌట్లు కూడా చేయదు.. ఆమె కేవలం కొత్త సినిమాల ప్రకటన వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, ఫిట్‌నెస్‌ను తన రోజువారీ జీవనశైలిలో ఒక భాగంగా మార్చుకున్నారు. రోజూ క్రమం తప్పకుండా వెయిట్ ట్రైనింగ్ చేయడానికి నయన్ ప్రాధాన్యత ఇస్తారు. దీనితో పాటు ఆమె ఫిట్ నెస్ కోసం యోగాను తన దినచర్యలో భాగంగా చేర్చుకున్నారు. లాంగ్ షూటింగ్ షెడ్యూల్స్ ముగిసిన తర్వాత శరీరం, మనస్సు ప్రశాంతత పొందేందుకు, కోల్పోయిన శక్తిని తిరిగి సాధించేందుకు యోగా ఆమెకు ఎంతగానో దోహదపడుతుంది.

34
ఆహార నియమాల్లో మార్పులు:
Image Credit : Asianet News

ఆహార నియమాల్లో మార్పులు:

ఒకప్పుడు డైట్ అంటే కేవలం కఠినమైన నియమాలు అని, ఇష్టం లేని ఆహారాన్ని తినాల్సి వస్తుందని నయనతార భావించేవారట. కానీ, కాలక్రమేణా ఆమె ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. శరీరాన్ని ఇబ్బంది పెట్టే కఠినమైన ఉపవాసాలకు బదులుగా, శరీరానికి అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించడమే అసలైన డైట్ అని ఆమె నమ్ముతున్నారు. ఆమె తనకు నచ్చిన ఫుడ్ ను మితంగా తినడానికి ఇష్టపడుతుంది.

ఇంటి వంటకే తొలి ప్రాధాన్యం

షూటింగ్ ప్రదేశాల్లో లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు రకరకాల ఆహారాలు అందుబాటులో ఉన్నప్పటికీ, నయనతార ఎల్లప్పుడూ ఇంట్లో వండిన సాదా సీదా భోజనాన్ని తినడానికే మొగ్గు చూపుతారు. షూటింగ్స్ కోసం వెళ్లేటప్పుడు కూడా ఇంటి నుంచే క్యారేజ్ తీసుకెళ్తుంటారు. ఇది జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఆమె తన రోజువారీ ఆహారంలో పండ్లు, తాజా కూరగాయలు, గుడ్లు , లీన్ మీట్ (మాంసం)లతో కూడిన సమతుల్య పోషకాహారాన్ని తీసుకుంటారు.

44
బాడీ హైడ్రేషన్ తో పాటు నిద్ర చాలా ముఖ్యం..
Image Credit : Instagram

బాడీ హైడ్రేషన్ తో పాటు నిద్ర చాలా ముఖ్యం..

చర్మాన్ని కాంతివంతంగా ఉంచుకోవడానికి శరీరాన్ని నిరంతరం హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నయనతార ముఖంతో పాటు, ఆమె చర్మ అలా మెరవడానికి ఈ పద్దతిని ఉపయోగిస్తుంటుంది. అందుకోసం ఆమె రోజూ తగినంత నీటితో పాటు గ్రీన్ టీ, తాజా పండ్ల రసాలు , సూప్‌లను తీసుకుంటారు. వీటితో పాటు, బిజీ వర్క్ షెడ్యూల్స్ నుంచి ఉపశమనం పొందేందుకు రోజూ కనీసం 8 గంటల నిద్రకు నయనతార ఇంపార్టెన్స్ ఇస్తుంది. సరైన నిద్ర, సమతుల్య ఆహారం, రోజూ వ్యాయామమే నయనతార సౌందర్యానికి అసలైన సీక్రెట్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved