MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Lokesh Kanagaraj: డైరెక్టర్ కాదు, హీరోగా అదరగొట్టాడు! లోకేశ్ 'డీసీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడాలంటే?

Lokesh Kanagaraj: డైరెక్టర్ కాదు, హీరోగా అదరగొట్టాడు! లోకేశ్ 'డీసీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది, ఎక్కడ చూడాలంటే?

Lokesh Kanagaraj: స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించిన 'డీసీ' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 04 2026, 10:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ సినిమా..
Image Credit : Asianet News

ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ సినిమా..

స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'డీసీ' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో వామికా గబ్బి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది. ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వంద కోట్లకు పైగా వసూలు చేసిన డీసీ
Image Credit : Instagram

వంద కోట్లకు పైగా వసూలు చేసిన డీసీ

ఈ సినిమాలో లోకేశ్ 'దేవదాస్' అనే పాత్రలో హీరోగా తన అరంగేట్రాన్ని అదరగొట్టేశాడు. వామికా 'చంద్ర' అనే పాత్రలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా 'డీసీ' సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి.

34
ఎమోషనల్ కథతో హిట్ కొట్టారు..
Image Credit : Sun TV

ఎమోషనల్ కథతో హిట్ కొట్టారు..

సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా నిడివి 2 గంటల 23 నిమిషాలు. సంజన కృష్ణమూర్తి మరో ముఖ్యమైన పాత్రలో నటించారు. హింస, ప్రేమకు ప్రాధాన్యతనిస్తూ తీసిన ఈ సినిమాలో మంచి ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి టాక్ వచ్చింది.

44
ఇక సాంకేతిక బృందం విషయానికొస్తే..
Image Credit : Asianet News

ఇక సాంకేతిక బృందం విషయానికొస్తే..

ఇక సాంకేతిక బృందం విషయానికొస్తే.. అడిషనల్ స్క్రీన్‌ప్లే: అరుణ్ రంజన్, సంభాషణలు: అరుణ్ మాతేశ్వరన్, ఫ్రాంక్లిన్ జాకబ్, సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి, ఎడిటింగ్: జికె ప్రసన్న, అసోసియేట్ ఎడిటర్: హరీష్ అరుణ్ ఎం, ఆర్ట్ డైరెక్షన్: కన్నన్ ఎస్, స్టంట్స్: పీసీ స్టంట్స్, కాస్ట్యూమ్ డిజైన్: అరుణ్ మాతేశ్వరన్, కాస్ట్యూమర్: పెరుమాళ్ శెల్వం, మేకప్: వినోద్ సుకుమారన్, స్టిల్స్: అమీర్, సౌండ్ రికార్డింగ్: సింక్ సినిమాస్, ఆడియోగ్రఫీ: వినయ్ శ్రీధర్, అట్మోస్ మిక్స్ అసిస్టెంట్: విఘ్నేష్ గురు (నాక్ స్టూడియోస్), కలరిస్ట్: రంగ, విజువల్ ఎఫెక్ట్స్: ప్రవీణ్ డి, పబ్లిసిటీ డిజైనర్: కబిలన్ చెల్లయ్య, ప్రొడక్షన్ కంట్రోలర్: డి రమేష్ కుచిరాయర్, కేటీఎస్ స్వామినాథన్, పీఆర్ఓ: శబరి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi: ఇరుముడి బ్లాక్ బస్టర్ హిట్.. చిరంజీవి, రాంచరణ్ ని కలిసిన రవితేజ
Recommended image2
Malavika Mohanan: అందరిముందు మాళవికని ఆమెతో పోల్చిన కార్తీ.. జెంటిల్మెన్ అంటూ పొగిడిన హీరోయిన్
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Related Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Megastar: 26 సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్ తో చిరంజీవికి పెద్ద గొడవ, మెగాస్టార్ భార్య సురేఖ ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved