MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?

CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ దళపతికి హీరో అజిత్ థ్యాంక్స్.. షాక్ లో ఫ్యాన్స్, కారణం తెలుసా?

CM Vijay Thalapathy: తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్ చేసిన ఓ కీలక ప్రకటనపై.. మరో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ ఏంటా ప్రకటన, అజిత్ రిలీజ్ చేసిన ప్రకటనలో ఏముంది.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 04 2026, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయ్‌కు అజిత్ ధన్యవాదాలు
Image Credit : X

విజయ్‌కు అజిత్ ధన్యవాదాలు

తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రకటించారు. అసెంబ్లీలో రూల్ 110 కింద ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. దీనిపై నటుడు, కార్ రేసర్ అయిన అజిత్ కుమార్ ఓ ప్రకటన ద్వారా తన హర్షాన్ని, అభినందనలను తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అజిత్ విడుదల చేసిన ప్రకటన
Image Credit : Asianet News

అజిత్ విడుదల చేసిన ప్రకటన

తమిళనాడు యువతను క్రీడల్లో ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అజిత్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా, మోటార్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయడం తనకు చాలా సంతోషాన్ని కలిగిచ్చిందన్నారు. మోటార్ స్పోర్ట్స్‌తో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తిగా, ఈ ప్రకటనను భారత మోటార్ రేసింగ్ రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నానని అజిత్ తెలిపారు. సీఎం విజయ్ ప్రయత్నాలన్నీ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

34
కొత్త మోటార్ స్పోర్ట్స్ సిటీ ఎలా ఉంటుంది?
Image Credit : our own

కొత్త మోటార్ స్పోర్ట్స్ సిటీ ఎలా ఉంటుంది?

తమిళనాడు ఇప్పటికే ఆటోమొబైల్ తయారీలో కీలక రాష్ట్రంగా ఉంది. ముఖ్యంగా కోయంబత్తూరులో అనేక మోటార్ స్పోర్ట్స్ వాహనాల తయారీ సంస్థలు పనిచేస్తున్నాయి. చెన్నై సమీపంలోని ఇరుంగాట్టుకోట్టైలో 'మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్', కోయంబత్తూరులో 'KARI మోటార్ స్పీడ్‌వే' రాష్ట్రంలోని ప్రధాన రేసింగ్ ట్రాక్‌లుగా ఉన్నాయి. ఇక్కడ జాతీయ స్థాయిలో F3, F4 కార్ రేసింగ్ పోటీలు జరుగుతాయి.
44
అంతర్జాతీయ కార్ రేస్ నిర్వహణకు ప్లాన్
Image Credit : our own

అంతర్జాతీయ కార్ రేస్ నిర్వహణకు ప్లాన్

అంతర్జాతీయ ప్రమాణాలతో మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని నిర్మించడం ద్వారా కొత్త అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త నగరంలో అంతర్జాతీయ స్థాయి రేస్ ట్రాక్, ఆధునిక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఫార్ములా 4 వంటి అంతర్జాతీయ పోటీలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. దీనివల్ల క్రీడా పర్యాటకం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
టీవీకే విజయ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved