నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.. ఆ రెండు మేకప్ ప్రొడక్ట్స్ మాత్రం వాడుతుందట..?
నేచురల్ యాక్ట్రస్ గానే కాదు.. నేచురల్ బ్యూటీగా కూడా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. మేకప్ లేకుండా నటించే ఈ బ్యూటీ.. తన పర్సనల్ గా మాత్రం రెండు ప్రోడక్ట్స్ మాత్రం వాడుతుందట.. ఇంతకీ ఆమె ఏం వాడుతుందో తెలుసా..?
సహజ సుందరి సౌత్ ఇండియన్ స్టార్ నటి సాయి పల్లవి. అందరు హీరోయిన్లలా కాదు సాయిపల్లవి. ముఖానికి పెయింట్, పెదాలకు లిప్ స్టిక్ వేసుకుని, పొట్టి డ్రస్సులు వేసుకోవడం ఆమెకు అలవాటు లేదు. చాలాసింపుల్ గా ఉంటుంది హీరోయిన్. మేకప్ ను ముఖం మీదకు రానివ్వదు.. అవసరం అయితే చాలా లిమిటెడ్ గా వేసుకోవడం తప్పించి అవసరం లేకున్నా పులుముకోవడం ఆమెకు అలవాటు లేదు.
సౌత్ సినిమాలతో పాటు, బాలీవుడ్‌కి జంప్ చేసిన సాయి పల్లవి ప్రస్తుతం రామాయణంతో బిజీగా ఉంది. సాయి పల్లవి తన మేకప్ గురించి చాలా సార్లు మాట్లాడింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సాయి పల్లవి.. తాన మేకప్ గురించి వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం ఆ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, సాయి పల్లవి మేకప్ రూపంలో తను ఉపయోగించే వాటి గురించి మాట్లాడింది.
నటి సాయి పల్లవికి మేకప్ కోసం ఈ రెండు వస్తువులు మాత్రంమే ఎక్కువగా వాడుతుందట. సాయి పల్లవి తన ముఖానికి ప్రత్యేకంగా క్రీములు ఏమీ పూయదు. కాని ఆమె బ్యాగ్ లో మాత్రం రెండు మేకప్ వస్తులు ఉంటాయట. అవేమిటంటే..ఒకటి ఐలైనర్, రెండోది మాయిశ్చరైజర్ క్రీమ్. ఈ రెండు తప్పకుండా బ్యాగ్ లో క్యారీ చేస్తుందట. అయితే హెయిర్ కు సబంధించి సాయి పల్లవి ఎప్పటికప్పుడు డిజైన్ లు మార్చుకుంటూ ఉంటుందట.
సినిమా పాత్రను బట్టి సాయి పల్లవి తన హెయిర్ స్టైల్ మార్చుకుంటుంది. సాయి పల్లవి రాత్రిపూట షూటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఐలైనర్ ఉపయోగిస్తుంది. కళ్ళు బాగా కనిపించడంతో పాటు.. ఆకర్శనీయంగా ఉండటానికి మాత్రమే సాయి పల్లవి ఐలైనర్ వాడుతుందట. ఇక సాయి పల్లవి ఎలాంటి మేకప్ లేకుండా పూర్తిగా నేచురల్ గా కనిపించిన సినిమాలు రెండే ఉన్నాయి అవి గార్గి, విరాటపర్వం. ఈ రెండు సినిమాల్లో మేకప్ లేకుండా కనిపించింది సాయి పల్లవి.
గార్గి, విరాటపర్వం సినిమాల్లో సాయి పల్లవి ఎలాంటి మేకప్ వేసుకోలేదు. మొహం కడుక్కుని తుడుచుకుని షూటింగ్‌కి వచ్చానని సాయి పల్లవి సరదాగా వ్యాక్యానించింది. సినిమా మొత్తంలో సాయి పల్లవి తన మేకప్ కోసం కేవలం ఐలైనర్ మాత్రమే ఉపయోగించిందట.
సాయి పల్లవి క్యారెక్టర్‌కి, యాక్టింగ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తోంది. హీరోయిన్ కు ఇంపార్టెన్స్ లేకుంటే ఆ సినిమాల్లో నటించదు. ఆమె చేసే డిఫరెంట్ క్యారెక్టర్లకు తగ్గట్టుగా.. హెయిర్‌స్టైల్‌ను తానే మార్చుకుంటుందట. మేకప్ వేసుకోవడం కంటే కూడా.. పాత్రకు తగ్గట్టుగా నటించడం ముఖ్యమని ఆమె నమ్ముతుంది. మంచి నటన కంటే మేకప్‌పై తనకు నమ్మకం లేదని ఓ ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది.
సాయి పల్లవి ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, యష్‌లతో కలిసి రెండు సినిమాల్లో నటిస్తోంది. సాయి పల్లవి పై ప్రస్తుతం ఓ రూమర్ నడుస్తోంది. పెళ్లయి ఇద్దరు పిల్లలతో ఉన్న ఓ నటుడితో సాయి పల్లవి డేటింగ్ చేస్తోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై సాయి పల్లవి స్పందించలేదు.