MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాక్సాఫీస్ వద్ద రికార్డు ముక్క మిగలదు..బాలయ్య నరసింహ స్వామిగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో మూవీ ?

బాక్సాఫీస్ వద్ద రికార్డు ముక్క మిగలదు..బాలయ్య నరసింహ స్వామిగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో మూవీ ?

హను మాన్ మూవీ ప్రభంజనంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో ఒక్కసారిగా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయాడు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు పాన్ ఇండియా వైడ్ గా ప్రశాంత్ వర్మ పేరు మారుమోగుతోంది. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jan 13 2024, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హను మాన్ మూవీ ప్రభంజనంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో ఒక్కసారిగా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళిపోయాడు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు పాన్ ఇండియా వైడ్ గా ప్రశాంత్ వర్మ పేరు మారుమోగుతోంది. ఆడియన్స్ ని భక్తి పారవశ్యంలో ముంచుతూనే గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో అదరగొట్టేశారు. తక్కువ బడ్జెట్ లో నే ప్రశాంత్ వర్మ ఇంతటి అద్భుతమైన సినిమా తెరకెక్కిస్తే.. ఇక మంచి బడ్జెట్ స్టార్ హీరో దొరికితే ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హను మాన్ చిత్రంలోనే మంచి ట్విస్ట్ తో ప్రశాంత్ వర్మ పార్ట్ 2 అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి జై హనుమాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. 2025లో రిలీజ్ చేస్తున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. అయితే హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రాన్ని పూర్తి చేయడానికే సమయం కేటాయిస్తాడా లేక వేరే హీరోతో కొత్త మూవీ ప్రారంభిస్తాడా అనేది ఉత్కంఠగా మారింది. 

36

తన వద్ద దాదాపు 10 సూపర్ హీరో కథలు ఉన్నట్లు ప్రశాంత్ వర్మ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణకి ప్రశాంత్ వర్మ బాగా క్లోజ్ అనే టాక్ ఉంది. దర్శకుడిగా కాకపోయినా ప్రశాంత్ వర్మ గతంలో బాలయ్యతో వర్క్ చేశారు. అయితే బాలయ్యతో సినిమా ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ అడగడం, మీడియా ప్రశ్నించడంతో కొన్ని రోజుల క్రితం ప్రశాంత్ వర్మ సమాధానం ఇచ్చాడు. బాలకృష్ణ గారు భైరవద్వీపం, ఆదిత్య 369 లాంటి అద్భుతమైన జోనర్స్ చేశారు. 

Also Read: ఇంట్లో విషాదం జరిగినా వృత్తి కోసం కామెడీ షోలో ముక్కు అవినాష్..కాబోయే భర్త పవన్ కళ్యాణ్ అంటూ..

46

మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే చిత్రం ఇండియన్ సినిమాలో ఎవరూ చేయని జోనర్ అయి ఉంటుంది అని ప్రశాంత్ వర్మ అన్నారు. కథ కూడా ఆల్రెడీ రెడీ అయింది అని ప్రశాంత్ వర్మ అన్నారు. అంతకంటే ముందుగా తాను బాలయ్యకి హను మాన్ చిత్రాన్ని చూపించాలని కూడా అన్నారు. 

56

అయితే బాలయ్యతో సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దానిపై మాత్రం ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా హను మాన్ టీమ్ తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్న ఉస్తాద్ షోకి హాజరయ్యారు. ఈ షోలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. బాలయ్య నీకు బాగా క్లోజ్ కదా.. ఆయనతో నరసింహ స్వామి అవతారంలో సూపర్ హీరో మూవీ చేశావంటే ఉంటుంది నా సామిరంగా అంటూ మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీనితో అక్కడున్న ఆడియన్స్ అంతా కేరింతలు కొట్టారు. 

Also Read: తేజ సజ్జా ఫోటో పక్కన ఆయన పేరు, ప్రపంచంలో ఇంకెవ్వరికీ దక్కని అదృష్టం.. మంచు మనోజ్ కామెంట్స్

66

బాలయ్య నరసింహ స్వామిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డు ముక్క కూడా మిగలదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా ప్రశాంత్ వర్మ, బాలయ్య కాంబినేషన్ లో ఒక చిత్రం త్వరగా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
మంచు మనోజ్
నందమూరి బాలకృష్ణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Anchor Suma: కత్తిలాంటి ఫిగర్ సుమ.. అంటూ కామెంట్ చేసిన హీరో ఎవరో తెలుసా? స్టార్ యాంకర్ రియాక్షన్ ఇదే
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image3
Priya Bapat: సాంగ్ షూట్‌లో హీరో బలవంతంగా ముద్దుపెట్టాడు.. ఆ నరకాన్ని తలచుకుని కన్నీళ్లు పెట్టుకున్న నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved