Asianet News TeluguAsianet News Telugu

తేజ సజ్జా ఫోటో పక్కన ఆయన పేరు, ప్రపంచంలో ఇంకెవ్వరికీ దక్కని అదృష్టం.. మంచు మనోజ్ కామెంట్స్

హను మాన్ టీమ్ మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్న ఉస్తాద్ షోకి హాజరయ్యారు. తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ షోలో పాల్గొన్నారు. మంచు మనోజ్ తేజ సజ్జా గురించి మాట్లాడుతూ.. నువ్వు సూపర్ హీరో అయిపోయావ్ నేను నిన్ను ఏమని పిలవాలి అని అడిగారు.

hanu man team teja sajja and prashanth varma at manchu manoj ustaad show dtr
Author
First Published Jan 13, 2024, 11:18 AM IST

యువ హీరో తేజ సజ్జా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం 'హను మాన్'. ఇక్కడ ఆంజనేయ స్వామినే సూపర్ హీరోగా చూపిస్తూ ఆయన శక్తి యుక్తులతో హీరో ఏం చేశాడు అనే ఆసక్తికరమైన కథతో హను మాన్ చిత్రం తెరకెక్కింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తొలి షో నుంచే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ అనేక రికార్డులు సొంతం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. పాన్ ఇండియాలో సైతం హను మాన్ హంగామా మామూలుగా లేదు. హనుమంతుడి సన్నివేశాలతో ప్రశాంత్ వర్మ భక్తి పారవశ్యంలో నింపడమే కాదు గూస్ బంప్స్ కూడా తెప్పిస్తున్నారు. సినిమా ముగిసే సరికి హనుమంతుడి నామ స్మరణతో థియేటర్లు హోరెత్తుతున్నాయి. 

ఇదిలా ఉండగా హను మాన్ టీమ్ మంచు మనోజ్ హోస్ట్ గా చేస్తున్న ఉస్తాద్ షోకి హాజరయ్యారు. తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ షోలో పాల్గొన్నారు. మంచు మనోజ్ తేజ సజ్జా గురించి మాట్లాడుతూ.. నువ్వు సూపర్ హీరో అయిపోయావ్ నేను నిన్ను ఏమని పిలవాలి అని అడిగారు. అన్నా నేను సూపర్ హీరో కాదు.. హనుమంతుల వారు సూపర్ హీరో అని తెలిపారు. 

hanu man team teja sajja and prashanth varma at manchu manoj ustaad show dtr

తేజ సజ్జా మాట్లాడుతూ నా జీవితంలో ఇన్సిపిరేషన్, మోటివేషన్, బలం అన్ని మెగాస్టార్ చిరంజీవి గారే అని తెలిపాడు. వెంటనే మనోజ్ ఇంద్ర చిత్రంలో తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్ట్ గా తొడకొట్టే సీన్ చూపించారు. తేజ సజ్జా తొడ కొట్టగానే మెగాస్టార్ చిరంజీవి అనే టైటిల్ పడుతుంది. ప్రపంచంలో ఎవరికీ దక్కని అదృష్టం ఇది. నీ ఫ్రేము పక్కన చిరంజీవి గారి టైటిల్ అని మనోజ్ అభినందించారు. తేజ, ప్రశాంత్ వర్మతో మంచు మనోజ్ హను మాన్ చిత్ర విశేషాలు అడిగి తెలుసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios