MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • టబుకి నాగార్జున పెట్టిన ముద్దు పేరేంటో తెలుసా?.. అందరి ముందు సీక్రెట్‌ బయటపెట్టడంతో ఈవెంట్‌ మొత్తం గోల

టబుకి నాగార్జున పెట్టిన ముద్దు పేరేంటో తెలుసా?.. అందరి ముందు సీక్రెట్‌ బయటపెట్టడంతో ఈవెంట్‌ మొత్తం గోల

నాగార్జున, టబు ఇద్దరు మంచి స్నేహితులు. లవర్స్ అని అంతా మాట్లాడుకుంటారు. కానీ టబుకి ఓ ముద్దు పేరు పెట్టాడట నాగ్‌. ఆ విషయాన్ని టబు అందరి ముందు చెప్పడం విశేషం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 01 2024, 06:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టబు.. ఈ పొడుగు కాళ్ల సుందరి టాలీవుడ్‌లో నటించింది తక్కువ సినిమాలే అయినా ఓ ఊపు ఊపేసింది. గ్లామర్‌ డాల్‌గా చాలా మంది కుర్ర హృదయాలకు కొల్లగొట్టింది. అభిమానులుగా మార్చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌కి దూరమైనా ఇప్పటికీ ఆమెని ఆరాధించే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా తనదైన నటన, అందంతో కట్టిపడేసిందీ బ్యూటీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హిందీలో ఎక్కువగా రాణించిన టబు.. తెలుగు అమ్మాయే కావడం విశేషం. హైదరాబాద్‌కి చెందిన టబు.. మొదట బాలీవుడ్‌లో రాణించింది. అక్కడ రెండు సినిమాలు చేసి ఆ తర్వాత `కూలీ నెం.1` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వెంకటేష్‌తో కలిసి నటించి అదరగొట్టింది. తొలి చిత్రంతోనే హిట్‌ అందుకుంది. ఆ తర్వాత నాగార్జున నిర్మించిన `సిసింద్రీ` చిత్రంలో గెస్ట్ రోల్‌ చేసింది. ఇందులో అఖిల్‌ బాలనటుడిగా మెరిసిన విషయం తెలిసిందే. 

37

ఆ సమయంలోనే తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యింది. తెలుగు మేకర్స్ దృష్టిలో పడింది. కృష్ణవంశీ ఆమెని `నిన్నే పెళ్లాడతా` చిత్రం కోసం ఎంపిక చేశాడు. ఈ రొమాంటిక్‌ ఫ్యామిలీ డ్రామా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. నాగార్జున రొమాన్స్ కి టబు అందం తోడు కావడంతో దుమ్మురేపారు. ఇద్దరు కలిసి వెండితెరపై రచ్చ చేశారు. ఇద్దరి రొమాన్స్ తెలుగు ఆడియెన్స్ ని ఊపేసింది. అలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అదే సమయంలో ఇద్దరి మధ్య రిలేషన్‌ కూడా బిల్డ్ అయ్యిందనే వార్తలు వచ్చాయి. 
 

47

నెక్ట్స్ సినిమా కూడా నాగ్‌తోనే చేసింది టబ్. `ఆవిడే మా ఆవిడ` చిత్రంలో నటించి మరోసారి మెప్పించింది. దీంతో డేటింగ్‌ రూమర్స్ మరింతగా పెరిగాయి. నాగార్జున ప్రేమలో పడే టబు పెళ్లి చేసుకోలేదనే పుకార్లు వినిపించాయి. ఇప్పటికీ అదే వినిపిస్తుంది. అంతేకాదు హైదరాబాద్‌కి టబు వస్తే నాగార్జున ఇంటికే వెళ్తుందట. అంతటితో ఆగలేదు, నాగ్‌ ఇంటికి ఎదురుగానే తాను ఇళ్లు కొనుక్కుందట. ఇన్ని రకాల హింట్స్ ఉండటంతో ఎవరైనా రూమర్స్ విస్తరిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

57

అయితే దీనిపై ఇటీవల నాగార్జున స్పందించారు. తామ మధ్య ఫ్రెండ్‌షిప్‌ కి మించిన బంధం అని, ఆమె తన ఫ్యామిలీలో మెంబర్‌ అని, అమలతోనూ చాలా క్లోజ్‌గా ఉంటుందని తెలిపారు నాగ్‌. టబుకి ఏదైనా సమస్య వస్తే తనకే మొదటి ఫోన్‌ వస్తుందని తెలిపారు. తమది ఓ రకంగా ఫ్యామిలీ రిలేషన్‌ అని చెప్పారు నాగ్‌. అదే సమయంలో తను చాలా సెన్సిటివ్‌ అని, అందుకే పెళ్లి చేసుకోలేదని తెలిపారు. 
 

67

ఇదిలా ఉంటే టబుకి నాగార్జున ఓ ముద్దు పేరు కూడా పెట్టాడట. ఆ విషయాన్ని టబు బయటపెట్టింది. పెద్ద ఈవెంట్‌లో ఇండస్ట్రీ మొత్తం ఉన్న ఈవెంట్‌లో బహిర్గతం చేయడం విశేషం. ఆ మధ్య కొన్నేళ్ల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమ వజ్రోత్సవ వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో టబు పాల్గొన్నారు. తెలుగు ఇండస్ట్రీ గురించి, తన కెరీర్‌లో బెస్ట్ మూమెంట్స్ గురించి ఆమె మాట్లాడింది.  
 

77

తొలి సినిమా ఆఫర్‌ ఇచ్చిన రాఘవేంద్రరావు, రామానాయుడికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. `కూలీ నెంబర్‌ 1`తో తన కెరీర్‌ ప్రారంభమైందని తెలిపింది. ఈ సందర్భంగానే `పండు` అనే పేరుని ఇచ్చినందుకు నాగార్జునకి థ్యాంక్స్ అని తెలిపింది టబు. అంటే టబుకి `పండు` అనే ముద్దు పేరు పెట్టాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో టబు మాటలకు ఈవెంట్‌ మొత్తం అరుపులతో గోల చేయడం విశేషం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
టబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved