MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జానకిని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక.. మళ్లీ చదవడం మొదలుపెట్టిన జానకి?

Janaki Kalaganaledu: జానకిని చూసి కుళ్ళుకుంటున్న మల్లిక.. మళ్లీ చదవడం మొదలుపెట్టిన జానకి?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 6వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Dec 06 2022, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో వాళ్ల ప్రేమను మరిచిపోయేలా చేశారు రామాగారు అని అనడంతో వెంటనే రామచంద్ర మీకు మీ అమ్మానాన్నలు అంటే ఎంత ఇష్టమండి వారి ప్రతి ఒక్క జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. అలాంటిది వారి కోరికను ఎందుకు పక్కన పెట్టేశారు అనడంతో జానకి మౌనంగా ఉంటుంది. మరి మీ నాన్న నిన్ను ఐఏఎస్ గా చూడాలి అనుకున్నారు మీరు అంతగా ప్రేమించే మీ అమ్మానాన్నల కోరికను ఎందుకు కాదంటున్నారు జానకి గారు అని అంటారు రామచంద్ర. తప్పు చేశానని నేను కాదనడం లేదు ఆవేశంలో ఒక మాట తూలాను. సమర్థించుకుకోవడం లేదు ఎందుకంటె నేను నా తప్పును సరిదిద్దుకునే లోపే మీరు ఐఏఎస్ అవ్వను అని పెద్ద నిర్ణయం తీసుకున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మీరే నన్ను ఎదురు ప్రశ్నించారు. అంతా లోతుగా ఆలోచించే తెలివి నాకు ఎక్కడ ఉంది నాది మట్టి బుర్ర అని బాధగా మాట్లాడుతాడు రామచంద్ర. మా తమ్ముడిని బయటికి పిలుచుకొని రావాలి అన్న ఆవేశంతో మాట్లాడాను కానీ దానిని మీరు ఇలా నిర్ణయం తీసుకుంటే ఏం చేయాలో చెప్పండి అని అంటాడు రామచంద్ర. అప్పుడు రామచంద్ర మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా మాధురి సంఘటనను ఒక మొదటి కేసు అని అనుకోండి అనగా జానకి ఆశ్చర్య పోతుంది. ఇక నిర్ణయం మీదే చెప్పాల్సింది చెప్పాను అని అంటాడు రామచంద్ర. ఆ తర్వాత రామచంద్ర వాళ్ళు ఇంటికి వెళ్తుండగా భానుమతి ఏంటో రామయ్య పొద్దు పోయాక వచ్చారు పొద్దు గడవక ముందే వెళ్తున్నారు అని బాధగా మాట్లాడడంతో వెళ్లాలి తప్పదు బానమ్మా అని అంటాడు రామచంద్ర.
 

36

సరేలే నేను ఎలాగోలా సర్దుకుంటాను అని అంటుంది భానుమతి. ఇలాంటి భర్త దొరకడం కోడలి అదృష్టం అని అనుకున్నాను కానీ నీకోసం ఎంత ఎలా ఆరాట పడుతుందో చూసి నా కోడల్ని పెళ్లి చేసుకోవడమే నీ అదృష్టం రామచంద్ర అని అంటుంది భానుమతి. ఆ తర్వాత రామచంద్ర వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడు జానకికి ఆమె కొంచెం డబ్బులు ఇస్తుంది. ఒకవైపు మల్లిక జానకి వాళ్ళు ఇంకా రాలేదు అని కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. జానకి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు కానీ వాళ్లు వెళ్లారు అన్న కోపం కంటే నేను వెళ్లలేదు అన్న బాధ ఎక్కువగా ఉంది అని కుళ్ళుకుంటూ ఉంటుంది మల్లిక. ఇప్పుడు పనిమనిషి చికిత మల్లికను చూసి అక్కడికి వెళుతుంది.
 

46

అప్పుడు చికిత, మల్లిక మీద పంచులు లో వేస్తూ మాట్లాడుతుంది. అప్పుడు మల్లికమ్మ జానకమ్మ గారు వచ్చారు మీరు కుళ్ళుకోవడం ఆపండి అని అంటుంది చికిత. అప్పుడు జానకి,రామచంద్ర వాళ్ళు సంతోషంగా లోపలికి రావడం చూసి మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర రావడంతో జ్ఞానాంబ ప్రయాణం ఎలా జరిగింది భాను బాగుందా అని అడగగా బాగుంది అందర్నీ అడిగాను అని చెప్పమంది అమ్మ అని అనడంతో వెంటనే జ్ఞానాంబ ఏం జానకి మా స్నేహితుడు ఎలా ఉంది అని అనగా రామచంద్ర బానమ్మకి జానకి నచ్చేసింది అని అనడంతో అది మల్లిక కుళ్ళుకుంటూ ఉంటుంది. జ్ఞానాంబ కూడా నా పెద్ద కోడలు అందరికీ ఇట్టే నచ్చుతుంది అని సంతోషంగా మాట్లాడుతూ ఉండగా మల్లిక బాధపడుతూ ఉంటుంది.
 

56

 ఆ తర్వాత జానకి తన గదిలోకి వెళ్లి ఐఏఎస్ బుక్కులు చూస్తూ రామచంద్ర అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు జానకి ఆ బుక్స్ తీసుకుంటూ ఉండగా ఇంతలో రామచంద్ర వచ్చి అడ్డుపడతాడు. ఎందుకు జానకి గారు ఆ బుక్స్ ని అక్కడ్నుంచి తీస్తున్నారు అని అంటాడు. అప్పుడు రామచంద్ర నా తప్పు నేను తెలుసుకుని క్షమాపణ అడిగాను. మీకు ఒక నిర్ణయం చెప్పాను ఆలోచించమని అడిగాను కానీ మీరు వాటిని ఎందుకు పక్కన పెడుతున్నారు అర్థం కావడం లేదు అంటూ బాధగా మాట్లాడుతాడు రామచంద్ర. ఆ తర్వాత రామచంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జానకి ఆ బుక్స్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది.
 

66

మరొకవైపు మల్లిక, రామచంద్ర జానకిని పొగిడిన విషయాలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు మల్లిక జానకి గది దగ్గరికి వెళ్ళగా అక్కడ జానకి చదువుతూ ఉండడంతో అది చూసి మల్లిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు మల్లిక నా దరిద్రం ఇలా ఉంది ఏంటి అని గోడకి తల బాదుకుంటూ ఉండగా విష్ణు చూసి ఇక్కడికి రా మల్లిక అని పిలుస్తాడు. అప్పుడు మల్లిక అబద్ధాలు చెబుతూ విష్ణు మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Silk Smitha: సిల్క్ స్మిత, జయలక్ష్మి లాగా ఇంకెవరూ చనిపోకూడదంటే అదే మార్గం..హీరోయిన్లంతా ఆ మూవీ చూడాలి
Recommended image2
Kalyan Padala: మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల, తనూజ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌
Recommended image3
Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved