MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?

Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?

Kannappa: మంచు విష్ణు, మంచు మోహన్‌ బాబు రూపొందించిన `కన్నప్ప` మూవీ గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Jun 17 2026, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
భారీ కాస్టింగ్‌తో రూపొంది సందడి చేసిన కన్నప్ప
Image Credit : X / @iVishnuManchu

భారీ కాస్టింగ్‌తో రూపొంది సందడి చేసిన కన్నప్ప

మంచు మోహన్‌ బాబు, మంచు విష్ణు  రూపొందించిన చిత్రం `కన్నప్ప`. భక్త కన్నప్ప జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. ఇందులో మంచు విష్ణు, మోహన్‌ బాబుతోపాటు ప్రభాస్, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, కాజల్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రల్లో మెరిశారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద మోహన్‌ బాబు నిర్మించారు. ఈ చిత్రం గతేడాది జూన్‌ 27న విడుదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కన్నప్ప టోటల్‌ కలెక్షన్లు
Image Credit : Asianet News

కన్నప్ప టోటల్‌ కలెక్షన్లు

భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కానీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. సుమారు వంద కోట్లకుపైగానే బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దారుణమైన కలెక్షన్లని వసూలు చేసింది. దాదాపు రూ.49కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రూ.25కోట్ల షేర్‌ సాధించింది. ఈ మూవీకి రూ.80కోట్ల బిజినెస్‌గా లెక్కగట్టారు. కానీ అందులో సగం కూడా వసూలు చేయలేదు. దాదాపు రూ.56కోట్ల నష్టాలను మిగిల్చింది.

33
కన్నప్ప రీ రిలీజ్‌
Image Credit : Asianet News

కన్నప్ప రీ రిలీజ్‌

ఇక బాలీవుడ్‌ దర్శకుడు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ రూపొందించిన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌, సన్‌ నెక్ట్స్ లో అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. సినిమా విడుదలై ఏడాది అవుతున్న సందర్భంగా దీన్ని మరోసారి రీ రిలీజ్‌ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. `కన్నప్ప` సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ, క్లైమాక్స్‌లో విష్ణు నటనకు వచ్చిన ప్రశంసల గురించి అందరికీ తెలిసిందే. మరోసారి ఈ విజువల్ వండర్‌ను ఆడియెన్స్‌కి అందించబోతున్నాం. సినిమా రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా మళ్లీ జూన్ 27న ‘కన్నప్ప’ని లిమిటెడ్ స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతోన్నామని మంచు విష్ణు వెల్లడించారు. మరి స్ట్రెయిట్‌ రిలీజ్‌ టైమ్‌లో నష్టాలను మిగిల్చిన ఈ మూవీ ఇప్పుడు ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మంచు మోహన్ బాబు
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?
Recommended image2
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Recommended image3
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Related Stories
Recommended image1
Ramu Rathod: అందరు నన్నే వాడుకుంటున్నారు.. రాము రాథోడ్‌ బోల్డ్ కామెంట్‌.. పేరెంట్స్ అన్నమాటకి ఎమోషనల్‌
Recommended image2
Balakrishna: విజయశాంతిని బాలకృష్ణ పెళ్లి చేసుకోవాలనుకున్నాడా? అసలు నిజం ఇదే.. వీరి మధ్య గ్యాప్‌కి కారణం ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved