MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసుపై సీరియస్ అయిన జగతి, మహేంద్ర.. రిషి ఇంటికి వెళ్ళిన వసు?

Guppedantha Manasu: వసుపై సీరియస్ అయిన జగతి, మహేంద్ర.. రిషి ఇంటికి వెళ్ళిన వసు?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 18వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

4 Min read
Author : Navya G
Published : Jan 18 2023, 09:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్లో మహేంద్ర,జగతి ఈ డిపిఎస్టి కాలేజీకి కొత్త ఎండి అనడంతో వసుధర షాక్ అవుతుంది. పాత ఎండి ఎక్కడికి వెళ్లారు తెలుసుకోవచ్చా మేడం అని వసుధార అనడంతో కనిపించని భవిష్యత్తును వెతుక్కుంటూ తనకు కూడా తెలియని దారిలో వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. అందుకే మాకు కూడా ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు అంటుంది జగతి. ఒక్కొక్కసారి మనసులు విరిగిపోతాయి మనసులను విరగగొట్టి చాలా మంది ఆనందాన్ని పొందుతారు అంటుంది జగతి. మీరు ఏమంటున్నారు నాకు అర్థం అయింది మేడం అని వసుధార అనడంతో మళ్లీ ఎందుకు వచ్చావు అని అంటుంది జగతి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అప్పుడు మహేంద్ర మాట్లాడరేంటి వసుధార గారు మా అబ్బాయి ఎలా ఉన్నారో చూసి పోదామని వచ్చారా లేకుంటే బతికి ఉన్నాడా లేదా అని చూద్దామని వచ్చారా అని అంటాడు. సార్ ఏంటి సార్ మీరు నన్ను మేడం అంటున్నారు అనడంతో మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అని అంటాడు మహేంద్ర. నాకు తెలిసిన వసుధార లేదు కదా కొత్త వసుధారగా మీరు అవతారం ఎత్తారు కదా అని అంటాడు మహేంద్ర. మీ మాటలు మీ ప్రవర్తన మాకు అర్థం కావడం లేదు కాబట్టి మిమ్మల్ని గౌరవించక తప్పడం లేదు వసుధర అంటాడు మహేంద్ర. అయినా తనతో ఏంటి మహేంద్ర మాటలు కొంతమంది గొప్ప గొప్ప చదువులు చదివి గొప్ప గొప్ప కలలు కంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు. జగతి వసుధార మీద కోపంగా మాట్లాడుతుంది.
 

38

 అప్పుడు వసుధార సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్తున్నావు అనడంతో కొన్ని సమాధానాలు చెప్పాల్సిన వాళ్లకే చెప్పాలి మేడం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు రిషి కారులో వెళ్తూ వసుధార మళ్లీ ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు వసుధర కాలేజీలో తన సీటు దగ్గరికి వెళ్లి రిషి మాట్లాడిన మాటలు జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. రిషి సార్ ఎక్కడికి వెళ్తున్నారు. అయినా మా జెంటిల్మెన్ కి కోపం వచ్చినట్టు ఉంది ఆ కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసు. ఏం జరిగిందో మీకు వివరించడానికి వచ్చాను సార్ అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి వసుధార కి ఫోన్ చేయగా రిషి ఫోన్ కట్ చేస్తాడు.

48

మరొకవైపు రిషి ఎందుకు వెనక్కి వచ్చావు వసుధార చేయాల్సినంత చేశావు ఇప్పుడు మళ్ళీ వెనక పడుతున్నావు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసు మళ్లీ ఫోన్ చేసింది అనుకొని ఎయిర్పోర్ట్ వాళ్ళు ఫోన్ చేయడంతో వాళ్లపై సీరియస్ అవుతాడు. వాళ్లు మీ టికెట్ క్యాన్సిల్ అయింది అనడంతో సరే అని అంటాడు రిషి. ఆ తర్వాత వసుధార రిషి ఫోటో చూసి పేపర్ లో రాస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి మహేంద్ర వస్తారు. కూర్చోండి సార్ కూర్చొని మేడం అనగా అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు వసు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు మేడమ్ అనడంతో జరిగిన విషయాలు గురించి మాట్లాడుతున్నాను ఏమీ జరగనట్టుగా వచ్చి ఇలా నవ్వుతూ అందరిని మాట్లాడిస్తున్నావు అని కోపంగా మాట్లాడుతుంది జగతి. 

58

రిషి ని నమ్మించి మోసం చేశావు నిలువునా నరికేశావు అసలు ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడో తెలుసా అనడంతో ఏం మాట్లాడవేంటి వసుధార అంటాడు మహేంద్ర. జగతి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవేంటి అనడంతో చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నిటికీ సమాధానాలు సమాధానం ఉంటుంది వసు. జరిగిన దాని గురించి మర్చిపోయి జరగాల్సిన దాని గురించి మాట్లాడదాము అనడంతో కోపంతో జగతి వసుధారని కొట్టబోతుంది. అప్పుడు జగతి ఎంత కోపంగా మాట్లాడినా కూడా సమాధానం చెప్పే రోజు చెబుతాను మేడం అని అంటుంది వసుధార. అప్పుడు మహేంద్ర కోపడుతూ చిన్నవాళ్లకు దండం పెట్టకూడదు అయినా నీకు దండం పెడుతున్నాను. ఏం సాధించడానికి నువ్వు మాకు కాలేజీకి వచ్చావు అని అంటాడు.
 

68

అప్పుడు వసుధర చేతిలో ఉన్న పేపర్స్ చూసి ఏంటివి అనడంతో చేసిన తప్పుకు పశ్చాత్తాపం క్షమాపణలు మేడం అంటుంది వసు. ఏం మాట్లాడుతున్నావ్ వసు ఈ సారి అన్న రెండు పదాలు రిషిని మల్లి వెనక్కి తీసుకురాగలవా ఒక్కసారి ఆలోచించు అని అంటుంది. అప్పుడు మహేంద్ర జగతి ఇద్దరు సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు వసు జరిగిన విషయాలు తెలుసుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. రిషి సార్ ఎక్కడికి వెళ్లారు అంటే ఎవరు చెప్పడం లేదు నేను ఎలా తెలుసుకోవాలి అని వసుధార బయట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి పుష్ప వస్తుంది. పెళ్లి గురించి చాలా హోప్స్ పెట్టుకున్నాను అలా చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది పుష్ప.

78

ఇప్పుడు పుష్ప నన్ను ఎందుకు రమ్మన్నావు అనగా నాకు ఒక హెల్ప్ చేయాలి పుష్ప అని అంటుంది. నాకు ఒక రూమ్ కావాలి అన్నాడంతో సరే అని అంటుంది పుష్ప. అప్పుడు పుష్ప వసుధార ఇద్దరు కలిసి అక్కడ నుంచి బయలుతేరుతారు. మరొకవైపు మహేంద్ర జగతి ఇంటికి వెళ్లి అసలు విషయం చెప్పడంతో దేవయాని కోపంతో రగిలిపోతూ వసుధార మల్లి రావడం ఏంటి అని అంటుంది. మళ్లీ ఎందుకు వచ్చింది అనగా తను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ అనడంతో తీసి పారేయకండి కాలేజ్ మనదే కదా అనగా వదినగారు అలా చేయడం కుదరదు అంటాడు మహేంద్ర. ఆ వసుధార చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి తెలియని దానిలా మళ్ళీ ఏం చేద్దామని వచ్చింది అంటూ దొంగ నాటకాలు అడుతూ ఉంటుంది.

88

 మొదటి నుంచి వసుధార విషయంలో నేను చెబుతూనే ఉన్నాను. పిలుచుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు అంటూ జగతి మహేంద్ర పై సీరియస్ అవుతుంది దేవయాని. ఇంతలోనే వసుధర రిషిని వెతుక్కుంటూ ఇంటికి వచ్చి రిషి సార్ రిషి సార్ అని అరుస్తుంది. అప్పుడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దేవయాని ఏంటి అసలు నువ్వు ఏదో మీ అత్తగారిల్లు అన్నట్టు నేరుగా వెళ్ళిపోతున్నావు అనగా రిషి సార్ తో మాట్లాడాలి మేడం అనడంతో నీకసలు సిగ్గుందా అని అంటుంది దేవయాని.

About the Author

NG
Navya G
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved