- Home
- Entertainment
- ఎల్లో డ్రెస్‌లో జబర్దస్త్ యాంకర్ పిచ్చెక్కించే పోజులు.. హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్లు రచ్చ
ఎల్లో డ్రెస్‌లో జబర్దస్త్ యాంకర్ పిచ్చెక్కించే పోజులు.. హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్లు రచ్చ
జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావు స్లిమ్ లుక్‌లో మతిపోగొడుతున్న విషయం తెలిసిందే. ప్రతి వారం ఆమె గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

`జబర్దస్త్` కామెడీ షోలో కొత్త యాంకర్‌గా సందడి చేస్తుంది సౌమ్య రావు(Sowmya Rao). కన్నడకు చెందిన ఈ అందాల భామ ఇప్పుడు గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అవుతూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో డ్రెస్‌లో మెరిసింది. తాజాగా పంచుకున్న గ్లామర్ ఫోటోల్లో మరింత హాట్‌గా, అందంగా ఉంటూ కనువిందు చేస్తుంది.
స్లిమ్ లుక్‌లో మతిపోగొట్టే అందం సౌమ్యరావు సొంతం. నాజూకు అందాలతో బుల్లితెరపై చేసే రచ్చ మామూలుగా ఉండదు. అంతకు మించిన రచ్చ గ్లామర్ ఫోటోలతో చేస్తుందీ జబర్దస్త్ యాంకర్. సోషల్ మీడియాలో ఆమె ప్రతి వారం హాట్ ఫోటో షూట్ చేస్తూ వాటిని అభిమానులతో పంచుకోగా ఆకట్టుకుంటున్నాయి. మెస్మరైజ్ చేస్తున్నాయి.
తాజాగా కూడా ఆమె పంచుకున్న ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. కిల్లింగ్ లుక్స్ తో, సన్నని అందాలతో మత్తెక్కిస్తుంది. చూపులతోనే చంపేస్తుందా అనేట్టుగా ఆమె పోజులుండటం విశేషం. అయితే ఈ బ్యూటీని చూసిన నెటిజన్లు అదిరిపోయే కామెంట్లు చేస్తున్నారు. పర్‌ఫెక్ట్ ఫిగర్ అంటూనే హీరోయిన్ మెటీరియల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సౌమ్యా రావుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
సౌమ్య రావు.. అనసూయ స్థానంలో జబర్దస్త్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే గ్లామర్ సైడ్‌లోనూ, షోలో సందడి చేయడంలోనూ ఆమె స్థాయిలో మెప్పించలేకపోతుందనే కామెంట్లు వస్తున్నాయి. ఆమె నవ్వులు సహజత్వం లేదని అంటున్నారు. అయితే లుక్ మాత్రం హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని ప్రశంసలు కురిపిస్తున్నారు.
కన్నడకు చెందిన సౌమ్యరావు సీరియల్స్ ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది. సీరియల్స్ లో నటిగా, అలాగే అడపాదడపా యాంకర్‌గా చేస్తూ వచ్చింది. ఈటీవీ స్పెషల్ ఈవెంట్‌లో హైలైట్ అయ్యింది. దీంతో `జబర్దస్త్`లో యాంకర్‌గా చేసే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. సౌమ్యరావు ఈ స్థాయికి రావడం వెనక ఓ కన్నీటి గాథ ఉంది. ఆమె తనకి ఎవరూ లేరని ఓ షోలో చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో జబర్దస్త్ ఆమెని అక్కున్న చేర్చుకుంది. బుల్లితెర ఆడియెన్స్ ఆమెని ఆదరిస్తున్నారు. దీంతో ఇప్పుడు స్టార్ యాంకర్ల జాబితాలో చేరిపోతుంది సౌమ్య రావు.