MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సోషల్ మీడియాలో పెరుగుతున్న ఐకాన్ స్టార్ క్రేజ్.. మరోసారి స్టైలిష్ లుక్ లో బన్నీ దర్శనం..

సోషల్ మీడియాలో పెరుగుతున్న ఐకాన్ స్టార్ క్రేజ్.. మరోసారి స్టైలిష్ లుక్ లో బన్నీ దర్శనం..

స్టైలిష్ లుక్ కు పెట్టింది పేరు అల్లు అర్జున్. అతని హెయిర్ స్టైల్.. డ్రెస్సింగ్ వేరే లెవల్లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే  డిఫరెంట్ లుక్స్ తో దుమ్ములేపుతున్న ‘పుష్ఫ’ స్టార్.. తాజాగా మరో కొత్త పిక్ ను షేర్ చేయడంతో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 17 2022, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘షుష్ఫ : ది రైజ్’ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరో స్థాయికి చేరుకుంది. ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ కు ఒక్కసారిగా అల్లు అర్జున్ కేరీర్ ‘పుష్ఫ’కు ముందు.. ఆ తర్వాత అనేలా మారిపోయింది. ఫుష్ఫ రాజ్ గా అల్లు అర్జున్ మ్యానరిజం దేశ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ను సంపాదించిందో అందరికీ తెలిసిందే.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతేడాది డిసెంబర్ లో వచ్చిన  ‘పుష్ఫ’ అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించి పెట్టింది. సౌత్ లో అప్పటికే యమా పాపులారిటీని సాధించుకున్న బన్నీకి ఈ చిత్రం తర్వాత నార్త్ లో గట్టి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో సోషల్ మీడియాలో ఈయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 

36

ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ లో 18 మిలియన్ల ఫాలోవర్స్ ను సాధించుకున్న అల్లు అర్జున్ సౌత్ కా సుల్తాన్ గా నిలిచారు.  దీంతో టాలీవుడ్ ‘ఐకాన్ స్టార్’గా పేరొందాడు. అయితే అటు ట్విట్టర్ లోనూ అల్లు అర్జున్ ఫాలోయింగ్ క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా 7 మిలియన్ల ఫాలోవర్స్ ను తన ట్విట్టర్ ఫ్యామిలీలో చేరిపోయారు. దీంతో బన్నీ, ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

46

ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన ఫాలోవర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 70 లక్షల మంది తనపై చూపించన ప్రేమకు బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మరోసారి స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో, అదిరిపోయే హెయిర్ స్టైల్, గాగూల్స్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. 

56

అల్లు అర్జున్ ‘పుష్ఫ’ చిత్రం తర్వాత పలు యాడ్స్ షూటింగ్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డిఫరెంట్ అవుట్ ఫిట్స్ లో, స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నారు. ఇటీవల ‘ఆస్ట్రాల్’ యాడ్ కోసం కనిపించిన అల్లు అర్జున్  లుక్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా బన్నీ పంచుకున్న మరో స్టైలిష్ పిక్ ను ప్రస్తుతం అభిమానులు, నెటిజన్లు నెట్టింట వైరల్ చేస్తున్నారు. 
 

66

‘పుష్ఫ : ది రైజ్’ తర్వాత బన్నీ పార్ట్ 2 ‘పుష్ప : ది రూల్’ (Pushpa The Rule)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ను మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నారు దర్శకుడు సుకుమార్. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోయిన్ రష్మిక మందన్న, నటి అనసూయ, ఫహద్ ఫాజిల్, సునిల్ నటిస్తుండగా.. సమంత, ప్రియమణి పేర్లు కూడా పలు కీలక పాత్రలకు వినిపిస్తున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Lenin total Collections: `లెనిన్‌` ఫైనల్‌ కలెక్షన్లు, నిజంగా షాకింగ్‌.. అఖిల్‌ సినిమా హిట్టా? ఫట్టా?
Recommended image2
Ravi Kishan House: 20 కోట్ల ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే, రేసుగుర్రం విలన్ లగ్జరీ హౌస్‌
Recommended image3
Bigg Boss Telugu 10: ఒక్క మాటతో ట్రోల్ అయిన యంగ్ లిరిసిస్ట్.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved