- Home
- Entertainment
- సిరి, షణ్ముఖ్ వ్యవహారం అందరి ముందు లీక్, హైర్ ఆది షాకింగ్ కామెంట్స్.. ఉన్నమాట ముఖం మీదే..
సిరి, షణ్ముఖ్ వ్యవహారం అందరి ముందు లీక్, హైర్ ఆది షాకింగ్ కామెంట్స్.. ఉన్నమాట ముఖం మీదే..
సిరి, షణ్ముఖ్ వ్యవహారం గురించి మరోసారి చర్చ మొదలైంది. అందుకు కారణం హైపర్ ఆది.

బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ జస్వంత్ రన్నరప్ గా నిలిచాడు. యూట్యూబర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ బిగ్ బాస్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అలాగే సిరి కూడా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది. ముఖ్యంగా గ్లామర్ తో సిరి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది.
బిగ్ బాస్ హౌస్ లో సిరి, షణ్ముఖ్ మధ్య కెమిస్ట్రీ ఒక రేంజ్ లో పండింది. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో కథలు కథగా ప్రచారాలు జరిగాయి.అయితే తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకున్నారు. ఒక దశలో సిరి వల్లే షణ్ముఖ్, దీప్తి సునైనా మధ్య బ్రేకప్ జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. సిరి ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది.
తాజాగా సిరి, షణ్ముఖ్ వ్యవహారం గురించి మరోసారి చర్చ మొదలైంది. అందుకు కారణం హైపర్ ఆది. నవరాత్రి సందర్భంగా మల్లెమాల సంస్థ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. నవరాత్రి ధమాకా పేరుతో ప్రత్యేకమైన షో చేశారు. ఆ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ఈవెంట్ కి సీనియర్ హీరోయిన్ సంఘవి, ప్రేమ అతిథులుగా హాజరయ్యారు.
యాంకర్ రవి, సిరి, జ్యోతి, ఇతర బుల్లితెర నటులు ఈ షోలో పాల్గొన్నారు. హైపర్ ఆది ఎప్పటిలాగే ఒక్కొక్కరిపై తన కామెడీ పంచ్ లతో విరుచుకుపడ్డాడు. హైపర్ ఆది, సిరి కలసి ఓ స్కిట్ పెర్ఫామ్ చేశారు. వీళ్ళిద్దరూ తండ్రి కూతుళ్లుగా నటించారు. నాన్న నాకు రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఉంది బోర్ కొడుతోంది అని సిరి అంటుంది. నీకు రెండు రోజులకే బోర్ కొడితే.. ఇక వందరోజులు వాళ్ళని భరించే మా పరిస్థితి ఏంటి అన్నట్లుగా బిగ్ బాస్ గురించి హైపర్ ఆది పరోక్షంగా కామెంట్స్ చేశాడు.
అదేంటి నేను బాగా ఫన్ ఇచ్చి ఎంటర్టైన్ చేశానుగా అని సిరి అంటుంది. ఫన్ మొత్తం షన్నూకే ఇచ్చావ్.. మాకేం ఇచ్చావ్ అని ఆది సెటైర్ వేస్తూ అందరి ముందు వాళ్ళిద్దరి వ్యవహారాన్ని బయట పెట్టాడు. దీనితో సిరి సిగ్గుతో నవ్వుకుంటూ ముఖం పక్కకి తిప్పుకుంటుంది. యాంకర్ రవిని కూడా ఆది వదల్లేదు. అటు వెళ్లాలా ఇటు వెళ్లాలా అనేది అర్థం కావడం లేదు అని రవి అంటాడు. అది తెలియకే ఛానల్స్ అన్నీ తిరిగేస్తున్నావ్ అని ఆది సెటైర్ వేశాడు.
వాస్తవానికి షణ్ముఖ్, దీప్తి సునైనా ఇద్దరూ ఘాడ ప్రేమికులు. కానీ బిగ్ బాస్ 5 తర్వాత సీన్ మారిపోయింది. షణ్ముఖ్, సరి గురించి రూమర్స్ ఎక్కువయ్యాయి. అప్పటి వరకు షణ్ముఖ్ కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెట్టిన దీప్తి సునైనా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. దీనితో సిరి కారణంగానే వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి అని అంతా భావించారు. చివరకి దీప్తి షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పేసింది.