MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • RRR చూసి ఓర్వలేక విషం కక్కుతున్న హాలీవుడ్ ఫ్యాన్స్.. 'గే చిత్రం' అంటూ అసభ్యకర ట్రోలింగ్

RRR చూసి ఓర్వలేక విషం కక్కుతున్న హాలీవుడ్ ఫ్యాన్స్.. 'గే చిత్రం' అంటూ అసభ్యకర ట్రోలింగ్

దర్శకధీరుడు రాజమౌళి విజన్ నుంచి పుట్టుకొచ్చిన మరో అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. 1920 బ్రిటిష్ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని కల్పిత గాధగా తెరకెక్కించారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 02 2022, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

దర్శకధీరుడు రాజమౌళి విజన్ నుంచి పుట్టుకొచ్చిన మరో అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. 1920 బ్రిటిష్ నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని కల్పిత గాధగా తెరకెక్కించారు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు స్నేహితులుగా మారి ఉంటే ఎలా ఉంటుంది అనే కల్పిత అంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రాజమౌళి ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పాలనుకున్నది రామ్, భీం మధ్య స్నేహం గురించే. అది చాలా ఎఫెక్టివ్ గా చూపించారు. రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహం, బ్రోమాన్స్ బాగా పండింది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఆర్ఆర్ఆర్ చిత్రం ఒక అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. 

36

కానీ హాలీవుడ్ అభిమానులు, వెస్ట్రన్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ చూసి ఓర్వలేకపోతున్నారు. సోషల్ మీడియాలో విషం కక్కడం ప్రారంభించారు. ఇటీవల హాలీవుడ్ కి ధీటుగా ఇండియన్ సినిమాలు సైతం పుంజుకుంటున్నాయి. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా అందరిని మెస్మరైజ్ చేసింది. 

46

కానీ జాత్యహంకార ధోరణి ఉన్న కొందరు వెస్ట్రన్ నెటిజన్స్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో రాంచరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహాన్ని గే రిలేషన్ షిప్ అంటూ అసభ్యంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ వెస్ట్రన్ నెటిజన్ ట్వీట్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ లో మతిపోగోట్టే యాక్షన్ ఉందని చెప్పారు.. నిజమే.. అడ్వెంచర్ మూవీ అన్నారు నిజమే.. రివేంజ్ అన్నారు నిజమే.. కానీ ఈ చిత్రం గే మూవీ అని ఎవరూ చెప్పలేదు ఏంటి ? అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. 

56

ఆర్ఆర్ఆర్ మూవీ కొన్నిచోట్ల గే రొమాన్స్ మూవీ అనిపిస్తోంది అంటూ మరో వెస్ట్రన్ నెటిజన్ కామెంట్స్ చేశాడు. దీనితో వారికి ఇండియన్ సినిమా అభిమానులు గట్టిగా కౌంటర్ ఇచ్చేస్తున్నారు. ఈ వెస్ట్రన్ వాళ్ళు అసలు మారరు అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. వెస్ట్రన్ వాళ్లకు స్నేహం, బ్రోమాన్స్ గురించి తెలియదు. అందుకే ఆర్ఆర్ఆర్ మూవీని గే మూవీ అంటున్నారు. 

66

ఇద్దరు పురుషుల స్నేహంపై కల్పిత గాధగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంపై వెస్ట్రన్ ఆడియన్స్ ఓర్వలేకపోతున్నారు. అందుకే గే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది వీళ్ళ మానసిక పరిస్థితికి నిదర్శనం అంటూ తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth Biopic: వెండితెరపైకి తలైవా జీవితం.. రజనీకాంత్‌గా కనిపించేది ఎవరు? షాకింగ్‌ ట్విస్ట్
Recommended image2
Jana Nayagan 4 Days Collections: ఆదివారం తన రేంజ్‌ చూపించిన విజయ్‌.. జన నాయకుడుకి అదిరిపోయే వసూళ్లు
Recommended image3
Chennai Love Story 3 Days Collections: దుమ్ములేపుతున్న చెన్నై లవ్‌ స్టోరీ.. కిరణ్‌ సినిమాకి 3 రోజుల్లో ఎంత వచ్చాయంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved