MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • విదేశాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న సమంత... లేటెస్ట్ స్టిల్స్ వైరల్!

విదేశాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్న సమంత... లేటెస్ట్ స్టిల్స్ వైరల్!

సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియా దేశం వెళ్ళింది సమంత. అక్కడ షెడ్యూల్ ముగిసినట్లు తెలుస్తుండగా సమంత జాలీగా విహరిస్తున్నారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 27 2023, 06:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha

Samantha

సమంత ప్రస్తుతం సెర్బియా దేశంలో ఉన్నారు. సిటాడెల్ లేటెస్ట్ షెడ్యూల్ అక్కడ జరుగుతుంది. మొత్తంగా సిటాడెల్ షూటింగ్ పూర్తి చేశారని సమాచారం. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది. పని పూర్తి కావడంతో అక్కడి అందమైన ప్రదేశాల్లో సమంత విహరిస్తున్నారు. హోటల్స్, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. సమంతతో పాటు సిటాడెల్ టీమ్ సెర్బియాలో ఆహ్లాదంగా గడుపుతున్నారు. సమంత తన హ్యాపీ మూమెంట్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Samantha

Samantha

 కాగా సెర్బియా పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సిటాడెల్ యూనిట్ మర్యాదపూర్వకంగా కలిశారు. వరుణ్ ధావన్, సమంత, రాజ్ అండ్ డీకే రాష్ట్రపతితో ఫోటో దిగారు. ఇక సమంత నటిస్తున్న సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు.  వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సమంత-వరుణ్ మధ్య బోల్డ్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుండగా లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. 
 

35
Samantha

Samantha

అలాగే సమంత విజయ్ దేవరకొండకి జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. 
 

45
Samantha

Samantha

గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది. సమంత ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారని సమాచారం. దర్శకుడు ఫిలిప్ జాన్ చెన్నై స్టోరీ టైటిల్  తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారట. వివేక్ కాల్రా హీరోగా నటించనున్న ఈ హాలీవుడ్ మూవీలో చెన్నై అమ్మాయిగా సమంత నటిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 

55
Samantha

Samantha

ఇక శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది. సమంత కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా శాకుంతలం నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శాకుంతలం మూవీతో దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Recommended image2
Disha Patani Outfit Controversy: దేవుడి దగ్గర ఈ ఎక్స్‌పోజింగ్ అవసరమా? దిశా పటానీపై నెటిజన్ల ఫైర్
Recommended image3
Future Predicting Movies: ఏఐ, సైబర్ క్రైమ్, వైరస్ గురించి ముందే చెప్పిన 8 సినిమాలు..భవిష్యత్తు తెలిసిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved