MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: మళ్లీ ఒకటైన రిషి, గౌతమ్.. అసలు విషయం తెలుసుకొని షాకైన దేవయాని?

Guppedantha Manasu: మళ్లీ ఒకటైన రిషి, గౌతమ్.. అసలు విషయం తెలుసుకొని షాకైన దేవయాని?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Dec 05 2022, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో రిషి మహేంద్ర అన్న మాటలు, గౌతమ్ అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు రిషి రాత్రంతా అలాగే కూర్చుని ఆలోచిస్తూ ఉండగా తెల్లవారిపోతుంది. అప్పుడు గౌతమ్ తో సరదాగా గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి వసు కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు వసుధార,రిషి వైపు అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు వసు రిషి వైపు అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు గౌతమ్, మహేంద్రతో ఫోన్ మాట్లాడుతూ లేదు అంకుల్ జరిగిన విషయం గురించి నాకు నమ్మకం పోయింది. నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను అని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అప్పుడు మహేంద్ర నా మాట విను గౌతమ్ తగ్గగానే మళ్లీ మీరు ఒకటి అవుతారు అనగా లేదు అంకుల్ మిమ్మల్ని నా ఫ్లాట్లో ఉంచినందుకు వాడు నా మీద చాలా సీరియస్ గా ఉన్నాడు అని అంటాడు. వాడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు ఇక జన్మలో నా మొఖం చూడడు అంకుల్, వాడు నన్ను ఒక మోసగాడిలా చూస్తున్నాడు అంటూ బాధతో మాట్లాడుతాడు గౌతమ్. నిజంగానే నిజం దాచి నేను మోసం చేశాను కదా అంకుల్ మేడం గారిని వసుధారని అడిగానని చెప్పండి మీరంతా జాగ్రత్తగా ఉండండి అంకుల్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత గౌతమ్ లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళగా ఇంతలోనే అక్కడికి రిషి, వసులు వస్తారు.
 

36

వాళ్ళను చూసిన గౌతమ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. రిషి ఏమీ తెలియనట్టుగా నవ్వుతూ ఏంట్రా ఎక్కడికో బయలుదేరావ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అమెరికాకు వెళ్తున్నావా నాకు చెప్పకుండా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నావా అని అంటాడు రిషి. అలా ఎలా వెళ్తావ్ రా నాకు చెప్పకుండా ఇలా వెళ్తావు ఇదేనా నా మీద నీకున్న ప్రేమ అంటూ కూల్ గా మాట్లాడటంతో గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నాకు చెప్పకుండా ఎలా వెళ్తావ్ రా ఇడియట్ అంటూ గౌతమ్ ని హగ్ చేసుకోవడంతో గౌతమ్ ఆనందంగా రిషి అని హగ్ చేసుకుంటాడు. అప్పుడు గౌతమ్ అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించగా నువ్వేం మాట్లాడకు రేయ్ నాకు కోపం ఏంటో అంతకు వంద రెట్లు ప్రేమ ఉంటుందిరా అని అంటాడు.
 

46

డాడ్ నాకు జరిగింది మొత్తం వివరించారు నన్ను వదిలిపెట్టి డాట్ ఎలా ఉంటారా అనుకున్నాను అంటూ గౌతమ్ ది తప్పులేదు అన్నట్టుగా మాట్లాడడంతో గౌతమ్ ఆనంద పడుతూ ఉంటాడు. అప్పుడు మహేంద్ర వాళ్ళను జాగ్రత్తగా చూసుకున్నందుకు రిషి, గౌతమ్ కి థాంక్స్ చెబుతాడు. అప్పుడు రిషి గౌతమ్ ఇద్దురు మరోసారి హగ్ చేసుకుంటారు. అది చూసి వసుధార సంతోషపడుతూ ఉంటుంది. మరోవైపు మహేంద్ర జగతి వాళ్ళు ఆనందంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే వసుధార, రిషి, గౌతమ్ వాళ్ళు అక్కడికి వస్తారు. అది చూసి మహేంద్ర ఒక్కసారిగా ఆనందపడతాడు. అప్పుడు మహేంద్ర కు రిషి గౌతమ్ ఇంట్లో మర్చిపోయిన వాచిని చేతికి తొడుగుతాడు.
 

56

 ఏం జరుగుతుందో అర్థం కాక దేవయాని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు రిషి అసలు విషయం చెప్పడంతో దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు గౌతమ్ మీద దేవయాని సీరియస్ అవ్వగా వెంటనే రిషి వాడిని ఏమి అనకండి పెద్దమ్మ అని అంటాడు. అప్పుడు గౌతమ్ గురించి రిషి గొప్పగా మాట్లాడటం తో మహేంద్ర సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు దేవయాని,గౌతమ్ మీద సీరియస్ అవుతూ ఉండగా వసుధార అడ్డు చెప్పడంతో వసుధార మీద కూడా కోప్పడుతుంది. అంత ప్లాన్ చేసుకొని వెళ్లారు. ఈ విషయం నీకు కూడా తెలుసు ఏమో ఎవరికి తెలుసు అని వసుని అనుమానిస్తుంది దేవయాని.

66

అప్పుడు జరిగింది వదిలేయండి పెద్దమ్మ అని అనడంతో దేవయాని మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత జగతి నీళ్లు తాగడానికి వాటర్ బాటిల్ తీసుకుంటుండగా అక్కడికి వెళ్లిన దేవయాని వాటర్ బాటిల్ తీసుకొని తాగు జగతి అంటూ దొంగ ప్రేమలు నటిస్తూ వాటర్ బాటిల్ ఇస్తుంది. అప్పుడు దేవయాని నువ్వు తెలివైన దానివి అని తెలుసు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి గౌతమ్ ఇంట్లో మకాం వేశావు చూడు అనగా జగతి ఆశ్చర్యపోతుంది. అప్పుడు హాల్లో నాతో పాటు అందరికీ తెలిసిపోయింది అనగా జగతి షాక్ అవ్వడంతో అంత నటించకు అంటూ దేవయాని వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు జగతి మాట్లాడడానికి ప్రయత్నించగా దేవయాని మాత్రం జగతిని బాధపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved