MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ఎట్టకేలకు ఛార్మితో ఎఫైర్ పై నోరువిప్పిన పూరి... అట్రాక్షన్ అయితే విడిపోయేవాళ్ళం కానీ మా మధ్య ఉంది... 

ఎట్టకేలకు ఛార్మితో ఎఫైర్ పై నోరువిప్పిన పూరి... అట్రాక్షన్ అయితే విడిపోయేవాళ్ళం కానీ మా మధ్య ఉంది... 

ఎట్టకేలకు దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ ఛార్మి తనకు ఏమవుతుందో తెలియజేశారు. చాలా కాలంగా అందరి మదిలో మెదలాడుతున్న అనుమానాలు, సందేహాలకు సమాధానం చెప్పాడు. ఛార్మితో తనకున్న రిలేషన్ ఏమిటో ఓపెన్ అయ్యాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 19 2022, 03:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Puri Jagannadh

Puri Jagannadh

ఓ ఆడా మగా కలిసి జీవిస్తుంటే దాన్ని లివింగ్ రిలేషన్ అంటారు. ఏళ్లుగా డైరెక్టర్ పూరి(Puri Jagannadh), హీరోయిన్ ఛార్మి కలిసి ఉంటున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించిన ఈ జంట నిర్మాణ భాస్వాములుగా కొనసాగుతున్నారు. ఈ బ్యానర్ లో మొదటి చిత్రంగా జ్యోతిలక్ష్మి తెరకెక్కింది. ఛార్మి ప్రధాన పాత్రలో పూరి తెరక్కించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

జయాపజయాలతో సంబంధం లేకుండా ఓ ఆరు చిత్రాలు ఈ బ్యానర్ లో తెరకెక్కాయి. వాటిలో విజయం సాధించింది ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే. వరుస ప్లాప్స్ తో పూరి సర్వం కోల్పోయాడు. కష్ట సమయాల్లో కూడా ఛార్మి ఆయన వెన్నంటే ఉంది. ఉన్నవన్నీ ఊడ్చి ఇస్మార్ట్ శంకర్ తెరకెక్కించారు. అనూహ్యంగా ఆ మూవీ భారీ విజయం సాధించింది. కోల్పోయినవన్నీ పూరి, ఛార్మి(Charmi Kaur) మళ్ళీ పొందారు. 
 

37
Bandl Ganesh

Bandl Ganesh


ప్రస్తుతం పూరి కనెక్ట్స్ బ్యానర్ లో లైగర్, జనగణమన చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్స్ లో లైగర్(Liger) ఆగస్టు 25న విడుదల కానుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా పూరి జగన్నాధ్ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నటి ఛార్మితో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. వస్తున్న పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. 

47

పూరి మాట్లాడుతూ.. 13 ఏళ్ళ వయసు నుండి ఛార్మి నాకు తెలుసు. ఆమెతో చాలా కాలంగా పని చేస్తున్నాను. ఛార్మి వయసులో ఉంది. ఆమెకు కూడా 50 ఏళ్ళు ఉంటే ఇలాంటి పుకార్లు వచ్చేవి కాదు. అందులోనూ ఆమె మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోలేదు.అట్రాక్షన్ అనేది ఎక్కువ కాలం  ఉండదు. మా మధ్య ఉంది స్నేహం. అందుకే ఇన్నేళ్లుగా కలిసి ఉంటున్నాం. మేము కేవలం మంచి మిత్రులం మాత్రమే. అంతకు మించి ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు.

57

మరి పూరి మాటల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ... ఆయన మాత్రం ఛార్మి జస్ట్ ఫ్రెండ్ అంటూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. పూరి, ఛార్మి ఓకె ఇంటిలో ఉంటారు. కలిసి డ్రింక్ చేస్తారు. విహారాలకు వెళతారు. పూరి ఎక్కడుంటే ఛార్మి అక్కడుంటుంది. ఇవన్నీ బహిరంగంగానే చేస్తారు. అందులో ఎలాంటి దాపరికం ఉండదు.

67
Puri jagannadh

Puri jagannadh

ఛార్మి కారణంగా పూరి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడనే వాదన ఉంది. చోర్ బజార్ ప్రీ రిలీజ్ వేడుకకు పూరి హాజరు కాలేదు. ఆ వేదికపై మాట్లాడిన బండ్ల గణేష్ పూరి, ఛార్మికి చురకలు వేశాడు. పూరి వైఫ్ లావణ్యను ఆకాశానికి ఎత్తిన బండ్ల దర్శకుడు పూరి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్నాడు.

77
Puri Jagannadh

Puri Jagannadh

అలాగే భర్తను దూరం చేసిన ఛార్మిపై లావణ్య ఒకటి రెండు సార్లు దాడికి తెగబడ్డారని కూడా వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా మేము ఎప్పటికీ కలిసే ఉంటాము. అలాగని మా మధ్య ఎటువంటి ఎఫైర్ లేదు. బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని పూరి అంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Recommended image2
krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..
Recommended image3
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved