MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..

krishna: చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే సూపర్ స్టార్ కృష్ణ ఏమన్నారో తెలుసా? షాక్ అయిన దర్శకుడు.. అస్సలు ఊహించలేదు..

krishna: సూపర్ స్టార్ కృష్ణ నిర్మాతల పాలిట దేవుడు.. సినిమానే ఊపిరిగా బ్రతికిన గొప్ప నటుడు. ఆయన స్థాయికి దర్శకులను రూల్ చేయవచ్చు.. కానీ వారు ఏది చెపితే అది చేసేవారు. ఇక సూపర్ స్టార్ ను ఓ దర్శకుడు చార్లీ చాప్లిన్ వేషం వేయమంటే ఆయన ఏమన్నాడో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 17 2026, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టాలీవుడ్ లో కృష్ణ స్థానం ప్రత్యేకం..
Image Credit : Asianet News

టాలీవుడ్ లో కృష్ణ స్థానం ప్రత్యేకం..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ కృష్ణ స్థానం సుస్థిరం. ఆయన నటనకే కాదు, ఆయన చూపించే ధైర్యానికి, వృత్తిపట్ల ఆయనకున్న అంకితభావానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొత్తదనానికి పెద్దపీట వేస్తూ, ఎలాంటి పాత్రనైనా.. సన్నివేశాన్నైనా స్వీకరించే మనస్తత్వం ఆయన సొంతం. కృష్ణ లోని అసాధారణమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆయన గొప్పతనం గురించి ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ కు తెలుసు. ఏదో ఒక్క ఇంటర్వ్యూలో నటీనటులు కానీ.. దర్శకులు కానీ.. ఎవరైనా సరే కృష్ణను తలుచుకుంటూనే ఉంటారు. అలాగే గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యలో సూపర్ స్టార్ గురించి దర్శకుడు ఎస్వీ కృష్ణ రెడ్డి చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కమెడియన్ సినిమాలో సాంగ్ చేయమంటే..?
Image Credit : Asianet News

కమెడియన్ సినిమాలో సాంగ్ చేయమంటే..?

హీరోగా వందల సినిమాల్లో నటించిన కృష్ణ ఒక్క సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు నమ్ముతారా? అవును ఇది నిజం. అంతే కాదు ఒక కమెడియన్ హీరోగా నటిస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేయమంటే కృష్ణ ఏమాత్రం ఆలోచించకుండా చేసేశారు. ఆ సినిమా ఏదో కాదు అలీ హీరోగా నటించిన యమలీల. ఈసినిమాలో లో 'జుంబారే జుమ జుంబారే' అనే పాటచేయమంటే సరే చేద్దాం అన్నారట కృష్ణ. ఈ సాంగ్ కు సంబంధించి కృష్ణగారు సెట్‌కి సిద్ధమై వచ్చారు. దర్శకుడు సలహా మేరకు సుచిత్ర (నృత్య దర్శకురాలు) వచ్చి ఆ పాటలోని మూవ్‌మెంట్స్ కృష్ణ కి చూపించారు. అయితే అక్కడే ఉంది అసలైన ట్విస్ట్..

34
ఏంటయ్యా.. అదంతా నేనే చేయాలా..?
Image Credit : Asianet News

ఏంటయ్యా.. అదంతా నేనే చేయాలా..?

ఈ పాటలో భాగమైన ఒక కష్టమైన స్టెప్‌ను వివరించగా, ఒక క్లాత్‌ను కింద వేసి, దానిని తిప్పి మళ్లీ కట్టుకుని, ఆపై ప్రత్యేకమైన డ్యాన్స్ స్టెప్ వేయాల్సి ఉంటుంది.ఈ సంక్లిష్టమైన స్టెప్ చూసిన తర్వాత కృష్ణ గారు నవ్వుతూ, "ఏంటయ్యా అదంతా నేనే చేయాలా? మధ్యలో ఏమైనా కట్స్ (ఎడిటింగ్ కట్స్) వస్తాయా?" అని షాకింగ్ గా అడిగారట. దానికి డైరెక్టర్ ఎస్వీ కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ఎటువంటి కట్స్ ఉండవని, కింద వేసిన గుడ్డను తీసుకొని చంకలో పెట్టుకొని, నడుచుకుంటూ వెళ్తూ మళ్లీ వెనక్కి వస్తూ ఈ క్రమాన్నంతా ఒక్కసారిగా పూర్తి చేయాలని చెప్పారు. వెంటనే కృష్ణ ఏమాత్రం సంకోచం లేకుండా, కృష్ణ గారు "సరే, చేసేద్దాం!" అని చెప్పి ఆ సన్నివేశాన్ని అలాగే పూర్తి చేశారు. చిన్న అంశాలకైనా ఆయన చూపించే ఈ సానుకూల ధోరణి ఆయనలోని ప్రొఫెషనలిజాన్ని తెలియజేస్తుందని దర్శకుడు కృష్ణారెడ్డి అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో వెల్లడించారు.

44
చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే కృష్ణ ఏమన్నాడంటే?
Image Credit : Asianet News

చార్లీ చాప్లిన్ గెటప్ వేయమంటే కృష్ణ ఏమన్నాడంటే?

అలాగే అదే 'నెంబర్ వన్' చిత్రంలో కృష్ణ 'చార్లీ చాప్లిన్' వేషధారణలో కనిపిస్తారు. సాధారణంగా స్టార్ హీరోలు ఎవరు ఇలాంటి గెటప్‌లు వేయడానికి ఇష్టపడరు, చేయాల్సి వచ్చినా కొంత సంకోచిస్తారు. కానీ కృష్ణ మాత్రం ఆ చార్లీ చాప్లిన్ వేయాలీ అంటే ఏమాత్రం ఆలోచించకుండా వేసుకుని వచ్చారట. అంతే కాదు షాకింగ్ విషయం ఏంటంటే.. ఆ వేషం వేసుకుని రాగానే మొదటి మాటగా, "ఈ వేషం నాకు బాగుంటదే!" అని ఎంతో నమ్మకంగా అన్నారంట.

"ఎవరైనా వచ్చి 'మీకు ఈ వేషం బాగుంది సార్' అని చెప్పక ముందే, తనకు తానుగా అంత ఆత్మవిశ్వాసంతో చెప్పడం కృష్ణగారికే చెల్లింది" అని దర్శకుడు కృష్ణారెడ్డి కొనియాడారు. తనపై తనకున్న ఆ నమ్మకం, కాన్ఫిడెన్స్ వల్లే ఆయన ఆ పాత్రను అంత అద్భుతంగా పండించారని, ఆ సన్నివేశాలకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ తో పాటు క్లాప్స్ క్లాప్స్)వచ్చాయని అన్నారు.

ముగింపుఏ పాత్రనైనా స్వీకరించే ముందు సంకోచించకపోవడం, తనపై తనకు ఉన్న నమ్మకం మరియు దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా తన్ను తాను మలచుకోవడం కృష్ణ గొప్పతనానికి నిదర్శనం. అందుకే ఆయనను పరిశ్రమలో ఒక ధైర్యవంతుడైన నటుడిగా, సూపర్‌స్టార్‌గా ఇప్పటికీ స్మరించుకుంటారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
కృష్ణ ఘట్టమనేని
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi 27 Days Collections: థియేటర్లో రవితేజ మాస్‌ జాతర.. 27వ రోజూ ఇరుముడికి సంచలన వసూళ్లు.. ఇక ఓటీటీ వంతు
Recommended image2
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image3
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Related Stories
Recommended image1
Suriya Box Office 2026: విజయ్, అజిత్ రూటు మార్చారు.. ఇక 1000 కోట్ల క్లబ్‌లో సూర్య.. చరిత్ర సృష్టిస్తాడా?
Recommended image2
Venkatesh: ఒక్క ఫైట్ లేదు, విలన్ కూడా లేడు, సినిమా చూసి వెంకటేష్ భార్య త్రివిక్రమ్ ను పిలిచి ఏమన్నారంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved