MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Bigg Boss 6 Telugu: ఫైమా పారితోషికం లీక్‌.. ఎంతో తెలిస్తే వాహ్‌ అనాల్సిందే.. సొంతింటి కల నెరవేరినట్టేనా?

Bigg Boss 6 Telugu: ఫైమా పారితోషికం లీక్‌.. ఎంతో తెలిస్తే వాహ్‌ అనాల్సిందే.. సొంతింటి కల నెరవేరినట్టేనా?

బిగ్‌ బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో ఈ ఆదివారం(13వ వారం)లో `జబర్దస్త్` ఫైమా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె ఈ షోకి ఎంత పారితోషికం తీసుకుందనే వార్త లీక్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 05 2022, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్‌ బాస్‌ 6వ(Bigg Boss 6 Telugu) సీజన్‌ చివరి దశకు చేరుకుంది. ఇంకో రెండు వారాల్లో ముగుస్తుంది. షో ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆదివారం(13వ వారం) ఫైమా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె ఎలిమినేషన్‌ ఊహించినట్టుగానే సాగింది. గత వారంలోనే ఫైమా(Faima) చివరి వరకు వెళ్లి సేవ్‌ అయ్యింది. కానీ ఈ వారం మాత్రం ఆమె ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకోలేకపోయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా `జబర్దస్త్` షోతో విశేషంగా ఆదరణతోపాటు పాపులారిటీని సొంతం చేసుకుంది. బుల్లెట్‌ భాస్కర్‌తో కలిసి స్కిట్లు చేస్తూ అదిరిపోయే పంచ్ లతో అదరగొట్టింది. నవ్వులు పూయించింది. లేడీ పులిలా ఆమె విరుచుకుపడే తీరు ఆకట్టుకుంది. ఈషోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫైమాకి `బిగ్‌ బాస్‌ 6` తెలుగు షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. అందుకోసం జబర్దస్త్ ని వదులుకుని బిగ్‌ బాస్‌ షోలో అదరగొట్టింది. 

36

13 వారాలపాటు ఆద్యంతం ఆకట్టుకుంది ఫైమా. నవ్వులు పూయించింది. తొలుత కామెడీతో మెప్పించిన ఆమె, ఆ తర్వాత టాస్క్ లోనూ పోరాడింది. గెలిచింది. కెప్టెన్‌ కూడా అయ్యింది. ఆడ పులిలా తన గేమ్‌ ఉంటుందని హోస్ట్ నాగార్జున కూడా ప్రశంసించారు. అంతగా అలరించిన ఫైమా కొన్ని మిస్టేక్స్ ఆమెకి నెగటివ్‌ నేమ్‌ని తీసుకొచ్చాయి. ఎటకారం, రేవంత్‌, రోహిత్‌ వంటి వారిపై ఆమె చేసిన కామెంట్లు కాస్త నెగటివ్‌గా మారాయి. అయినా అన్నింటిని ఫేస్‌ చేసి అందరిని ఎదుర్కొని నిలబడింది. 

46

ఇక 13 వారంలో ఆమె ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె ఎలిమినేషన్‌తో ఆదిరెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. పేదరికంతో బాధపడుతూ పెరిగిన ఫైమా రేంట్‌ కట్టలేని స్థితిని, హోనర్లు ఉన్నట్టుండి బయటకు పంపించేసిన స్థితిని ఎదుర్కొంది. ఆమె క్రేజ్‌, ఇమేజ్‌, పాపులారిటీ వెనకాల అంతులేని కన్నీళ్లున్నాయి. సొంతం ఇళ్లు లేని స్థితి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన ఫైమా.. తన పేరెంట్స్ కి సొంతంగా ఇళ్లు కట్టించాలని కలలు కన్నడి. బిగ్‌ బాస్‌ షో తో ఆ కల నెరవేర్చుకోవాలని భావించింది. మరి సొంతింటి కల నెరవేర్చుకునేందుకు సరిపడ పారితోషికం బిగ్‌ బాస్‌ నుంచి ఫైమా అందుకుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 

56

ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ 6లో ఫైమా అందుకున్న పారితోషికం (Faima Remuneration)వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె వారానికి 2.1లక్షలు పారితోషికం అందుకుందని సమాచారం. రోజుకి ముప్పై వేల చొప్పున ఆమెకి పారితోషికం ఇచ్చారట. మొత్తంగా 13 వారాలకుగానూ దాదాపు 27లక్షలు రెమ్యూనరేషన్‌గా ఫైమాకి దక్కిందని టాక్‌. మరి ఇందులో నిజమెంతోగానీ ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 

66

ఈ అమౌంట్‌తో ఫైమా సొంతిళ్లు కల నెరవేరబోతుందా? అనేది ప్రశ్నగా మారింది. పారితోషికంతోపాటు ఇతర గిఫ్ట్ లు వగైరా కలుపుకుని ఆల్మోస్ట్ ముప్పై లక్షల వరకు ఫైమా పొందే అవకాశం ఉంది. అయితే ఊర్లో మాత్రం ఈ అమౌంట్‌తో సొంతిళ్లు సాధ్యమే. కానీ హైదరాబాద్‌లో మాత్రం కష్టమనే చెప్పాలి. కనీసం వంద గజాల ఫ్లాట్‌ కూడా రాని పరిస్థితి. మరి హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు. అందుకోసం ఫైమా ఇంకా కష్టపడాల్సిందే. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved