MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా

Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా

Bigg Boss10: బిగ్ బాస్ సీజన్ 10 లో మొదటి కంటెస్టెంట్ గా.. టీవీ సీరియల్ నటి దేబ్జానీ హౌస్ లోకి అడుగుపెట్టింది. హౌస్ లోకి వెళ్లే ముందు.. తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పి షాకిచ్చింది.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 06 2026, 07:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ హౌస్ లోకి దేబ్జానీ..
Image Credit : Hostar telugu

బిగ్ బాస్ హౌస్ లోకి దేబ్జానీ..

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ బుల్లితెరపై మొదలైంది. ఈసారి సామాన్యులతో పాటు గట్టి పోటీ ఇచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్ ను హౌస్ లోకి దించిన మేకర్స్, ఆడియన్స్ ని ఆకట్టుకునేలా పక్కా ప్లాన్ తో రంగాన్ని సిద్ధం చేస్తారు. దీనిలో భాగంగా.. హౌస్ లోకి మొదటి కంటెస్టెంట్ గా.. బుల్లితెర నటి దేబ్జానీ మోదక్ హౌస్ లోకి అడుగుపెట్టింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డ్యాన్స్ తో ఎంట్రీ...
Image Credit : Hostar telugu

డ్యాన్స్ తో ఎంట్రీ...

దేబ్జానీ.. పాటతో మంచి డ్యాన్స్ స్టెప్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక.. నాగార్జున అడిగిన ప్రశ్నలకు తనకు వచ్చీ రానీ తెలుగులో చాలా చక్కగా సమాధానాలు ఇచ్చింది. తాను ఎక్కువగా పగటి కలలు కంటూ ఉంటానని చెప్పింది. తన కోసం తన రాకుమారుడు గుర్రంపై వస్తూ ఉన్నట్లు ఎప్పుడూ కలలు వస్తూ ఉంటాయి అని సీక్రెట్ చెప్పింది. వారానికి ఒక్కసారి అయినా ఇంటికి వెళ్లకుండా వెళ్లలేనని.. అది తన వీక్నెస్ అని చెప్పింది. తర్వాత.. నాగార్జునను ఇంప్రెస్ చేయడానికి ఆయన పాటే పాడటం విశేషం. పాట తర్వాత.. దేబ్జానీ కి మొదటి రోజే నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు. ఆమె చేతిలో ఒక బాక్స్ పెట్టి.. అందులో ఉన్న బ్యాడ్జెస్ ని.. కంటెస్టెంట్స్ అందరికీ ఇవ్వాలని చెప్పారు. దేబ్జానీ దానికి ఒకే చెప్పారు. ఆ తర్వాత.. హౌస్ లోకి వెళ్తూ వెళ్తూ ముందుగానే.. తాను తెలిసీ తెలియకుండా చేసే తప్పులకు సారీ చెప్పి మరీ హౌస్ లోకి అడుగుపెట్టింది.

Related Articles

Related image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Related image2
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
34
బెంగాల్ బ్యూటీ నుంచి తెలుగువారి 'వేద' వరకు..
Image Credit : Hostar telugu

బెంగాల్ బ్యూటీ నుంచి తెలుగువారి 'వేద' వరకు..

కోల్‌కతాకు చెందిన దేబ్జానీ మోదక్ తన మోడలింగ్ కెరీర్‌ను బెంగాలీ ఇండస్ట్రీతో ప్రారంభించారు. ఆ తర్వాత తమిళంలో 'రాసాతి', 'వానతై పోల' లాంటి సీరియల్స్‌తో అక్కడి ప్రేక్షకులను అలరించారు. అయితే తెలుగు బుల్లితెరపైకి అడుగుపెట్టాక ఆమె రేంజ్ పూర్తిగా మారిపోయింది.

స్టార్ మా ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్‌లో 'వేద' పాత్రతో తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్‌కు విపరీతంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత 'సత్యభామ' సీరియల్‌లోనూ తన నటనతో అలరించారు. బెంగాలీ నేపథ్యం ఉన్నప్పటికీ, ముద్దు ముద్దు మాటలతో, స్పష్టమైన హావభావాలతో తెలుగు నాట భారీ ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు.

44
హౌస్‌లో ప్రైమ్ అట్రాక్షన్‌గా ఎంట్రీ
Image Credit : Hostar telugu

హౌస్‌లో ప్రైమ్ అట్రాక్షన్‌గా ఎంట్రీ

బిగ్ బాస్ సీజన్ 10 ప్రైమ్ కంటెస్టెంట్లలో ఒకరిగా దేబ్జానీ అడుగుపెడుతున్నారు. ముద్దుగా మాట్లాడే క్యూట్‌నెస్ మాత్రమే కాకుండా, గేమ్‌లలో ఆమె ఇచ్చే కామెడీ అండ్ ఎంటర్టైన్‌మెంట్ టైమింగ్ హౌస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అంచనా వేస్తున్నారు. సీరియల్స్ ద్వారా ఉన్న ఫ్యామిలీ అండ్ జెన్-జీ (Gen-Z) ఆడియన్స్ క్రేజ్ ఆమెకు బిగ్ బాస్ ప్రయాణంలో పెద్ద ప్లస్ పాయింట్ కానుంది.

భారీ రెమ్యూనరేషన్..

దేబ్జానీ మోదక్ క్రేజ్‌కు తగ్గట్లే మేకర్స్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్‌లో ఉండేందుకు దేబ్జానీకి వారానికి ఏకంగా రూ. 4 లక్షల వరకు పారితోషికం చెల్లించేలా డీల్ కుదిరిందని టాక్. ఒకవేళ ఆమె హౌస్‌లో కనీసం 50 నుండి 70 రోజులు ప్రయాణించినా లేదా ఫినాలే వరకు వెళ్లినా, భారీ స్థాయిలో పారితోషికం అందుకోనుంది.మరి, ఆమె ఈ సీజన్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Thrigun: సక్సెస్‌ లేక పేరు మార్చుకున్న త్రిగుణ్‌, అయినప్పటికీ స్ట్రగుల్స్.. బిగ్‌బాస్‌ తెలుగు 10 బ్రేక్‌ ఇస్తుందా?
Recommended image2
Mokshagna: ఎట్టకేలకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఖరారు.. చిరంజీవి దర్శకుడితో సినిమా ప్రకటన
Recommended image3
Dada - Title Glimpse: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీ టైటిల్ 'దాదా'.. మాస్ అండ్ స్టైలిష్ గా గ్లింప్స్
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved