- Home
- Entertainment
- Mokshagna: ఎట్టకేలకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఖరారు.. చిరంజీవి దర్శకుడితో సినిమా ప్రకటన
Mokshagna: ఎట్టకేలకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఖరారు.. చిరంజీవి దర్శకుడితో సినిమా ప్రకటన
చాలా కాలంగా ఊరిస్తున్న నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఎట్టకేలకు ఓకే అయ్యింది. వశిష్ట దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీని ప్రకటించారు.

వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ తేజ హీరోగా సినిమా
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో నటుడు సినిమాల్లోకి వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. గతంలోనే ఆయన ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఆ మూవీ ఆగిపోయింది. ఇప్పుడు మరో దర్శకుడితో మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నారు. చిరంజీవితో `విశ్వంభర` మూవీ చేస్తున్న వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా సినిమాని రూపొందిస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. తాజాగా నేడు ఆదివారం(సెప్టెంబర్ 6)న మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు.
సింహపు పిల్ల స్థావరాన్ని వీడి అడవిలోకి ఎంట్రీ
ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇందులో వాళ్లు చెబుతూ, సింహపు పిల్ల తన స్థావరాన్ని వీడింది. ఇప్పుడు ఒక సింహంలా అడవిలోకి అడుగుపెడుతోంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు నందమూరి మోక్షజ్ఞ అంటూ పోస్ట్ చేయగా ఇప్పుడిది వైరల్ అవుతుంది. బాలయ్య ఆశీస్సులతో ఈ సినిమాని ప్రకటిస్తున్నట్టు నిర్మాతలు వెల్లడించారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానున్నట్టు తెలిపారు.
ఆగిపోయిన మోక్షజ్ఞ మొదటి సినిమా
మోక్షజ్ఞ తేజ హీరోగా రెండేళ్ల క్రితమే సినిమా ప్రకటన వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమాని ప్రకటించారు. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ మూవీతో బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నట్టు వెల్లడించారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది. స్క్రిప్ట్ విషయంలో బాలయ్యకి, ప్రశాంత్ వర్మకి మధ్య సెట్ కాలేదని, దీంతో ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత బాలయ్య దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరిగింది. బాలయ్య కూడా ఓ సందర్భంలో చెప్పారు. కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు వశిష్ట దర్శకత్వంలో సినిమా రూపొందుతుండటం విశేషం.
చిరంజీవితో విశ్వంభర చేస్తున్న వశిస్ట
ఇదిలా ఉంటే `బింబిసార` చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట.. ఇప్పుడు చిరంజీవితో `విశ్వంభర` చిత్రాన్ని రూపొందించారు. ఇందులో త్రిష వంటి భారీ కాస్టింగ్ నటిస్తోంది. సోషియో ఫాంటసీ, యాక్షన్, మైథాలజీ మేళవింపుగా ఈ మూవీ ఉండబోతుంది. వీఎఫ్‌ఎక్స్ కారణంగా ఈ మూవీ వాయిదా పడుతూ వస్తోంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది క్లారిటీ లేదు. ఈ క్రమంలో వశిష్ట ఇప్పుడు మోక్షజ్ఞతో సినిమా చేస్తుండటం విశేషం.

